నాని ‘ది ప్యారడైజ్’ నేడు(సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘దసరా’తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే రిలీజ్ తర్వాత మాత్రం ఆ అంచనాలకు తగ్గట్లుగా లేదనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సినిమాలో ప్రధానంగా ఎమోషన్ మిస్ అయిందని పలు న్యూస్ వెబ్‌సైట్స్ తమ రివ్యూల్లో పేర్కొన్నాయి.కొంతమంది కావాలని నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే నాని అభిమానులు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు అధికారికంగా బయటకు వచ్చాయి. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు నెట్ ఫ్లిక్స్ కూడా భారీ స్థాయిలో పోటీపడ్డాయి. అయితే చివరకు రూ. 50 కోట్లకు పైగా వెచ్చించి.. నెట్‌ఫ్లిక్ ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకుంది.
(చదవండి: ది ప్యారడైజ్ మూవీ రివ్యూ )
స్ట్రీమింగ్ అప్పుడేనా..?
థియేటర్స్‌లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాతే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఒప్పందంతో రైట్స్ అమ్ముకున్నారట నిర్మాత. ఈ లెక్కన చూస్తే.. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20-22 తేదీల మధ్య ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయ్యే అవకాశం ఉంది. ఇందులో నానికి జోడీగా కయాదు లోహర్ నటించగా.. సోనాలి కులకర్ణి, 'కిల్' ఫేమ్ రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక చాలా కాలం తర్వాత డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ఈ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించాడు.


