టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది.
మరోవైపు ఇటీవల ‘ఏందయ్య సామీ’ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలోని ఓ క్లిప్‌ను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విజయ్‌పై తన ప్రేమను మరోసారి చాటుకుంది. ‘అతను నాకు పూర్తిగా సొంతమైనా.. తనపై క్రష్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇదేంటో మరి’ అంటూ రష్మిక చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
జీవితాంతం నా దగ్గరే ఉంటావు
దీనికి విజయ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘నేను ఎంతో అదృష్టవంతుడిని. జయమ్మను మిస్ అయినా.. నువ్వు మాత్రం జీవితాంతం నా దగ్గరే ఉంటావు’ అంటూ రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి సోషల్ మీడియా సంభాషణ చూసిన అభిమానులు సంబరపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లోనూ విజయ్-రష్మిక జోడీపై ఆసక్తి పెరుగుతోంది.
ఇక ‘రణబాలి’ కథ 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో విజయ్ దేవరకొండ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్-రష్మిక పెళ్లి తర్వాత కలిసి వస్తున్న తొలి చిత్రం కావడంతో ‘రణబాలి’పై మరింత ఆసక్తి నెలకొంది. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇదీ చదవండి: ‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్..?’


