ఇటీవల విడుదలైన బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న చిన్న సినిమా హనుమాన్ అంశ్. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే రూ.350 కోట్ల మార్క్ దాటేసింది. నాలుగొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఓవర్‌సీస్‌లోనూ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ పరంగా హిట్ కావడంతో అదరగొడుతోంది.
తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్ లాంగ్‌రన్ వసూళ్లను దాటేసింది. యశ్ హీరోగా వచ్చిన టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా రూ.339 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. హనుమాన్ అంశ్ ఇప్పటికే ఆ రికార్డ్ అధిగమించింది. రూ.360 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాకు విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించగా.. ఎటువంటి అంచనాలు లేకుండానే వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం 2026 సంవత్సరానికి అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-3 భారతీయ చిత్రాల జాబితాలో చేరింది.
ఇప్పటికే హనుమాన్ అన్శ్ చిత్రం విజయ్ నటించిన 'జన నాయగన్' (రూ.324 కోట్లు), యశ్ 'టాక్సిక్' (రూ.341 కోట్లు), రామ్ చరణ్ 'పెద్ది' (రూ.342 కోట్లు) పాన్-ఇండియా చిత్రాల లైఫ్‌టైమ్ బాక్సాఫీస్ వసూళ్లను అధిగమించింది. ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూలు చేసిన బాలీవుడ్ మూవీ 'బోర్డర్-2'... హనుమాన్ అంశ్ కంటే ముందుంది.


