మరోసారి ఆస్పత్రికి రామ్ చరణ్.. ఎందుకంటే? | Mega Hero Ram Charan Visits Hospital Once again for Treatmemt | Sakshi
Sakshi News home page

Ram Charan: ఆస్పత్రికెళ్లిన రామ్ చరణ్.. ఎందుకంటే?

Sep 24 2026 6:17 PM | Updated on Sep 24 2026 6:34 PM

Mega Hero Ram Charan Visits Hospital Once again for Treatmemt

మెగా హీరో రామ్ చరణ్ మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల తన మణికట్టు గాయానికి సర్జరీ చేయించుకున్న చెర్రీ.. కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రికి చేరుకున్నారు. సర్జరీ సమయంలో వేసిన రాడ్లను వైద్యులు తొలగించారు. ఇప్పుడు ఆయన మరో 8 నుంచి 10 వారాల పాటు  ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ చేయించుకోనున్నారు. అంటే దాదాపు రెండు నెలలకు పైగా సమయం పట్టే ఛాన్స్ ఉంది. పూర్తిగా కోలుకున్న తర్వాత నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో పాల్గొనే అవకాశముంది.

ఈ ఏడాది పెద్ది మూవీతో అలరించిన రామ్ చరణ్ ఓ మాదిరి సక్సెస్ అందుకున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించింది. ఈ మెగా హీరో తన తదుపరి ప్రాజెక్ట్ సుకుమార్‌ డైరెక్షన్‌లో చేయనున్నారు. ఈ గాయం నుంచి కోలుకున్నాకే సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు రామ్ చరణ్. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement