ఇటీవల తిరుమలలో అద్భుతమైన డ్యాన్స్‌తో అలరించిన టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి. తనలో కూచిపూడి నృత్యం చేసే టాలెంట్ కూడా ఉందని నిరూపించింది. డింపుల్ డ్యాన్స్‌కు భక్తులతో పాటు ఫ్యాన్స్ సైతం ఫిదా అయిపోయారు. తాజాగా ఈ బ్యూటీ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. హీరోయిన్ డింపుల్ హయాతి గల్ఫ్ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత అభినేత్రి 2, గద్దలకొండ గణేశ్, యురేకా, ఖిలాడీ, రామబాణం, దిల్ మార్, భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీస్ చేసింది. ప్రస్తుతం శర్వానంద్ 'భోగి'చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మకు అంతగా కలిసిరాలేదు.
Actress #DimpleHayathi spotted seeking divine blessings at the historic Sri Kalahasteeswara Swamy Temple. ✨🙏 Always beautiful to see our stars connect with their spiritual side ❤️#Bhogi #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/UjHtYHZBku
— Telugu FilmNagar (@telugufilmnagar) September 24, 2026


