గిన్నిస్‌కి ఎక్కిన ‘రాకా’.. ఈ రికార్డో ఏంటో తెలుసా! | Allu Arjun Raaka Creates Guinness World Record With 37 Performers and 92 Cameras | Sakshi
Sakshi News home page

Raaka Creates Guinness World Record : ‘రాకా’.. కోసం 37 మంది.. 92 కెమెరాలు.. ఈ రికార్డ్‌ ఏంటి?

Sep 24 2026 7:06 PM | Updated on Sep 24 2026 7:38 PM

Allu Arjun Raaka Creates Guinness World Record With 37 Performers and 92 Cameras

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’. సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఈ మూవీ ప్రపంచ రికార్డు సాధించి వార్తల్లో నిలిచింది. ఏకంగా 37 మంది ఒకేసారి మోషన్ క్యాప్చర్‌ చేయించుకోవడం ద్వారా ‘రియల్ టైమ్ మోషన్-క్యాప్చర్’(Most People Motion-Captured in Real-Time) విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ రికార్డును అధికారికంగా ధృవీకరించారు. అయితే అసలు ఏంటి ఈ రికార్డ్‌ అని చాలా మంది సోషల్‌ మీడియాకు పని చెప్తున్నారు. అదేంటో తెలుసుకుందాం..రండి..!
ఇదీ చదవండి: ‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్‌..?’

ఒకేసారి 37 మంది..
సాధారణంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఒకరు లేదా కొంతమంది నటుల యాక్టింగ్‌ను రికార్డు చేసేందుకు ఉపయోగిస్తుంటారు. కానీ ‘రాకా’ కోసం ఏకంగా 37 మంది యాక్టర్స్‌ యాక్టింగ్‌ని ఒకే సమయంలో క్యాప్చర్ చేశారు. ఇందులో నాలుగేళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల వ్యక్తి వరకు వివిధ వయసుల వారు కూడా ఉండడం గమనార్హం. అందరి కదలికలను ఒకరికొకరు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ట్రాక్ చేయడం ఈ ప్రక్రియలో ప్రధాన సవాలుగా నిలిచింది.

92 కెమెరాలతో భారీ సెటప్
ఈ రికార్డు కోసం మేకర్స్ ఏకంగా 92 ఆప్టికల్ మోషన్ క్యాప్చర్ కెమెరాలను ఉపయోగించారట. క్యాప్చర్, కాలిబ్రేషన్, నెట్‌వర్కింగ్, సింక్రనైజేషన్‌తో పాటు రియల్ టైమ్ విజువలైజేషన్, ఫేషియల్ క్యాప్చర్ వంటి టెక్నాలజీలను కూడా ఈ సెటప్‌లో భాగం చేశారని తెలిసింది.
ఇదీ చదవండి: దేబ్జానీపై హాస్యనటుడు బ్రహ్మానందం ప్రశంసలు..!

మోషన్ క్యాప్చర్ అంటే?
నిజ జీవితంలో ఒక నటుడు చేసే యాక్టింగ్‌ని టెక్నాలజీ ద్వారా రికార్డు చేసి, వాటిని డిజిటల్ లేదా CGI క్యారెక్టర్‌కు అందించడమే మోషన్ క్యాప్చర్. ‘రాకా’లో మాత్రం ఒకరిద్దరి కదలికలు కాకుండా 37 మంది యాక్టింగ్‌ని ఒకేసారి రికార్డు చేశారు. ఈ స్థాయిలో మోషన్ క్యాప్చర్ చేయడానికి ప్రత్యేకమైన పైప్‌లైన్, వర్క్‌ఫ్లోను చిత్రబృందం సిద్ధం చేసింది. ఇందుకోసం అవసరమైన ప్రత్యేక పరికరాలను లాస్ ఏంజెల్స్ నుంచి తీసుకొచ్చి సొంత మోషన్ క్యాప్చర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు దర్శకుడు అట్లీ వెల్లడించారు.

బన్నీ, అట్లీ చేతికి గిన్నిస్ సర్టిఫికెట్
ఈ రికార్డుకు సంబంధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అల్లు అర్జున్, అట్లీ అందుకున్నారు. సినిమా విడుదలకు ముందే ఇలాంటి అరుదైన ఘనత సాధించడం ‘రాకా’పై అంచనాలను మరింత పెంచింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపించనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్‌.
ఇదీ చదవండి:  ఆయన సొంతమైనా క్రష్‌ తగ్గట్లేదు: రష్మిక

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement