దేబ్జానీపై హాస్యనటుడు బ్రహ్మానందం ప్రశంసలు..! | Brahmanandam praises bigg boss beauty Debjani over telugu language | Sakshi
Sakshi News home page

‘అబ్బా.. చాలా సంతోషంగా ఉంది తల్లి’

Sep 24 2026 12:30 PM | Updated on Sep 24 2026 1:20 PM

Brahmanandam praises bigg boss beauty Debjani over telugu language

బిగ్‌బాస్‌ సీజన్‌10లో కంటెస్టెంట్ల ఆట ఒకవైపు ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు కొందరి మాటతీరు.. ప్రవర్తన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి వారిలో దేబ్జానీ మోదక్‌ ఒకరు.  బెంగాలీ నేపథ్యంలో నుంచి వచ్చిన ఆమె తెలుగులో మాట్లాడే విధానం.. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, తనదైన శైలిలో స్పందించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా  హౌస్‌లో అందరితో మాట్లాడే మాటలు, తోటి కంటెస్టెంట్లతో కలిసిపోయే విధానం హౌస్‌మేట్స్‌కే కాకుండా బయట ప్రేక్షకులకూ ముచ్చటగా అనిపిస్తోంది. 

గత నాలుగైదు ఎపిసోడ్‌ల నుంచి దేబ్జానీ పేరు​ మార్మోగుతోంది. ఆమె ఆడిన తీరు ఒక ఎత్తు అయితే.. ఆమె మాట్లాడే మాటలు ఒకెత్తు. దీంతో ఆమె అభిమానులు సోషల్‌ మీడియాలో మీమ్స్‌, పాత వీడియోలు వైరల్‌ చేస్తున్నారు. అలా ఓ సందర్భంలో టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం ఆమె మాట్లాడే తెలుగుపై ప్రశంసలు కురిపించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

బృహ్మనందం ఆమెని  ప్రశంసిస్తూ..
ఓ సందర్భంలో.. శ్రీముఖి దేబ్జానీ కోసం చెప్తూ.. ‘ఆమెకు తెలుగు మాట్లాడడం సరిగా రాకపోయినా తెలుగు పాటలు బాగా పడుతుంది సార్‌’ అని బ్రహ్మనందంకి పరిచయం చేస్తారు. బ్రహ్మనందం ఆమెని  ప్రశంసిస్తూ..  ‘దేబ్జానీ నిన్ను చూస్తుంటే జల్సీగా ఉంది. తెలుగు తెలీదు. మేము ఏం మాట్లాడుతున్నాం అసలే అర్థం కాదు. కానీ నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు’ అంటూ ఆమెను పొగడ్తల వర్షం కురిపించారు. అనంతరం దేబ్జానీ తెలుగులో పాడిన పాటను విని అబ్బా.. చాలు.. బాగా పాడావు,  చాలా సంతోషం తల్లి అంటూ నవ్వులు పూయించారు. ఇప్పుడీ వీడియో వైరల్‌ అవుతోంది.

దేబ్జానీ విషయానికి వస్తే..
దేబ్జానీ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. తండ్రి అపూర్బా మోదక్‌ వ్యాపారవేత్త.. తల్లి మితా మోదక్‌ గృహిణి.  ఈమెకు నందిని మోదక్‌ అనే చెల్లెలు ఉంది. అనుకోకుండా ఓ సీరియల్‌లో అవకాశం రావడంతో అలా బుల్లితెరపై అడుగుపెట్టి బెంగాలీ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.  ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌10లో ఫస్ట్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది.  అప్పటి నుంచి తన మాటలతో అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ఇప్పటి ప్రేక్షకులకూ దగ్గరవుతున్నారు.

ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: దేబ్జానీకి పెళ్లిచూపులు.. త్రిగుణ్‌ని ఏడిపించేశారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement