గత నెలలో నయనతార నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. అయితే వీటిలో ఒకటి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఏజ్ గ్యాప్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుంది?
(ఇదీ చదవండి: కన్నతల్లి 'ఆవేదన'.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)
నయనతార, కవిన్ జంటగా నటించిన తమిళ సినిమా 'హాయ్'. గత నెల 28న తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. కానీ ఏమంతలా ఆకట్టుకోలేకపోయింది. విష్ణు ఎడవన్ దర్శకుడు కాగా నయనతార ఓ నిర్మాతగానూ వ్యవహరించింది. ఇప్పుడీ మూవీ ఈ శుక్రవారం(సెప్టెంబరు 25) నుంచి జీ5 ఓటీటీలోకి రానుందని అధికారికంగా వెల్లడించారు. ఓ వీడియో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
'హాయ్' విషయానికొస్తే.. రాజమండ్రికి చెందిన సుబ్రహ్మణ్యం(కవిన్) పెళ్లీడు వచ్చినా తల్లిదండ్రుల చాటు బిడ్డగానే ఉంటాడు. ఇంట్లో చెప్పందే ఏ పనీ చేయడు. మరదలకి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందని లెటర్ రాసి హైదరాబాద్ వెళ్లిపోతాడు. మరోవైపు భీమవరానికి చెందిన దేవసేన(నయనతార) పెళ్లిరోజే ఇంటినుంచి తప్పించుకుని హైదరాబాద్ వచ్చేస్తుంది. అనుకోకుండా సుబ్రహ్మణ్యం, దేవసేన కలిసి ఒకేచోట ఉండాల్సి వస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)


