కొన్నిసార్లు చిన్న సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి హిట్ అయిపోతుంటాయి. అలాంటి ఓ తెలుగు చిత్రం 'హుషార్ పిట్టలు'. టీనేజీ రొమాంటిక్ కామెడీ మూవీగా దీన్ని తీశారు. థియేటర్లలోకి వచ్చినప్పుడు అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడాలి?
(ఇదీ చదవండి: 'రంగస్థలం' కోసం చరణ్ అన్నని బాగా టార్చర్ చేశా: శ్రీకాంత్ ఓదెల)
వాసవి గణేశన్, అన్ష్ ప్రధాన పాత్రలు చేసిన రొమాంటిక్ కామెడీ సినిమా 'హుషార్ పిట్టలు'. ప్రోమోలతో వైరల్ అయిన ఈ చిత్రం గత నెల అంటే ఆగస్టు 15న పెద్దగా ప్రచారం లేకుండానే థియేటర్లలో రిలీజైంది. డబుల్ మీనింగ్ జోకులతో పాటు చివరలో యువతకు ఓ మెసేజ్ ఇచ్చేసరికి ప్రేక్షకులు బాగానే ఆదరించారు. పెట్టిన బడ్జెట్‌కి మించి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడీ మూవీ సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.
'హుషార్ పిట్టలు' విషయానికొస్తే.. రవి(అన్ష్) పదో క్లాస్‌లో మంచి మార్కులతో పాస్ అవుతాడు. కానీ ఊరిలో కుర్రాళ్ల వల్ల చెడు ఆలోచనలు వస్తాయి. ఈ క్రమంలోనే తన ఊరిలోనే ఉండే చిట్టి(వాసవి గణేశన్)తో ప్రేమలో పడతాడు. టీనేజీ వయసులోనే వీళ్లిద్దరూ ఉన్నప్పటికీ ముద్దులు, హద్దులు దాటేస్తారు. ఓరోజు ఇలాంటి స్థితిలో ఉండగానే తల్లిదండ్రులకు పట్టుబడతారు. తర్వాత ఏం జరిగింది? చిట్టి, రవి చివరకు ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.
యుక్త వయసులో యువత చెడిపోవడానికి కారణాలేంటి? తల్లిదండ్రులు, అక్కలు, అన్నలు లాంటి పెద్దోళ్ల నుంచి స్నేహితుల వల్ల టీనేజీ పిల్లలు ఎలా చెడిపోతున్నారు? అనే అంశాల్ని ఇందులో చూపించారు. కాకపోతే మూవీ అంతా అడల్ట్ కామెడీ చూపించి చివరలో మెసేజ్ ఇవ్వడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)


