ఎట్టకేలకు 'విశ్వంభర' బండి కదిలింది | Vishwambhara Movie Release Date And OTT Details | Sakshi
Sakshi News home page

Viswambhara OTT: సంక్రాంతి బరిలో 'విశ్వంభర'.. మరి 'కాకా'?

Sep 14 2026 8:31 AM | Updated on Sep 14 2026 8:31 AM

Vishwambhara Movie Release Date And OTT Details

చిరంజీవి 'విశ్వంభర' సినిమా గురించి మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా దాదాపు మర్చిపోయారు. ఇదొకటి ఉందనే సంగతి కూడా చాలామందికి గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం అట్టహాసంగా మొదలైన ఈ ప్రాజెక్ట్.. విజువల్ ఎఫెక్స్ట్ వల్ల మూలన పడిపోయింది. ఇప్పుడు అప్పుడు రిలీజ్ అని ఊరిస్తూ వచ్చారు గానీ ఎంతకీ తేల్చట్లేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీ డీల్ ఖరారు కావడంతో పాటు విడుదలకు లైన్ క్లియర్ అయిందని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)

'విశ్వంభర' మూవీని దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఏడు లోకాలు అనే సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ దీని కథ. వశిష్ఠ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. లెక్క ప్రకారం ఈపాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ ఆలస్యమవుతూ వస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం వచ్చే సంక్రాంతి బరిలో దీన్ని దింపాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థతో డీల్ కుదిరిందట.

'విశ్వంభర' సంక్రాంతికి రిలీజైతే మరి ఇదే చిరంజీవి నుంచి వచ్చే సంక్రాంతికి వస్తుందని ప్రకటించిన 'కాకా' సంగతి ఏంటనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మరి రెండింటిని పండగ బరిలో దింపుతారా లేదంటే 'కాకా' తప్పుకొంటాడా?

'విశ్వంభర'లో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా చేసింది. సురభి, ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. కీరవాణి సంగీతమందించాడు.

(ఇదీ చదవండి: ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్‌.. అంచనాలను పెంచేసిన బిగ్‌బాస్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement