షూటింగ్‌ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్ | Rashmika Mandanna Wraps Ranabaali Shoot Vijay Deverakonda Special Hug Goes Viral | Sakshi
Sakshi News home page

Ranabaali Movie : రణబాలి’ షూటింగ్‌ పూర్తి.. సెట్‌లో స్పెషల్ మూమెంట్

Sep 13 2026 7:35 PM | Updated on Sep 13 2026 7:40 PM

Rashmika Mandanna Wraps Ranabaali Shoot Vijay Deverakonda Special Hug Goes Viral

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్‌ 16 ఈ సినిమా విడుదల  కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ స్పెషల్‌ మూమెంట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

‘రణబాలి’లో జయమ్మ పాత్రలో నటిస్తున్న రష్మిక తన షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేశారు.  ఇంజ్యూరీ నుంచి కోలుకున్న తర్వాత ఆమె తిరిగి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు. తాజాగా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసిన సందర్భంగా చిత్రబృందం ఆమెకు వీడ్కోలు పలికింది. ఈ సమయంలో రష్మికను అభినందించేందుకు విజయ్‌ దేవరకొండ కూడా సెట్‌కు వచ్చారు. 
ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ టీజర్‌ చూశారా..
షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా..
రష్మిక షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా విజయ్ ఆమెను ఆప్యాయంగా హగ్‌ చేసుకున్నారు. ఈ స్పెషల్‌ మూమెంట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమ అభిమాన జంటను ఇలా చూసి ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

బ్రిటిష్‌ పాలన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో విజయ్‌ దేవరకొండ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ వోస్లూ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చదవండి: ఇరుముడి చిత్రబృందానికి ’మెగా‘ అభినందనలు
 It's a wrap for Jayamma ✨

We will dearly miss you on sets, @iamRashmika ❤️

The much loved #EndhayyaSaami out very soon.#RanabaaliTeaser TRENDING #1 on YouTube 🔥
▶️https://t.co/tqKGJM7RdG#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.#NeverForget#RanabaaliOnOct16th pic.twitter.com/qHX008QMkF

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement