అభిమానికి అండగా రామ్‌.. ఆమె ‍కోసం మరో అడుగు | Ram Pothineni Stands by Ailing Fan Sasi Keeps His Promise | Sakshi
Sakshi News home page

Ram Pothineni: అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రామ్‌

Sep 13 2026 3:51 PM | Updated on Sep 13 2026 4:34 PM

Ram Pothineni Stands by Ailing Fan Sasi Keeps His Promise

తెరపై మాస్‌ హీరోగా అభిమానులను అలరించే రామ్‌ పోతినేని.. నిజ జీవితంలోనూ తన మంచి మనసును చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ అభిమాని గురించి తెలుసుకుని గతంలో అండగా నిలిచిన ఆయన.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్న 18 ఏళ్ల శశి చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని గతంలో చెప్పాడు. తాజాగా ఆమె కుటుంబానికి అవసరమైన వస్తువులను పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మంచానికే పరిమితం..
తూర్పుగోదావరి జిల్లా దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల శశి కొంతకాలంగా తీవ్రమైన అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి కారణంగా ఆమె మతిస్థిమితం  కోల్పోయి చాలా ఏళ్లుగా మంచానికే పరిమితమైంది. ఆమె పరిస్థితిని సోషల్‌ మీడియా ద్వారా రామ్‌ తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: 'సైమా'లో మిరాయ్, సంక్రాంతికి వస్తున్నాం డామినేషన్

రామ్‌ అంటే ఎంతో అభిమానం..
శశికి.. రామ్‌ పోతినేని అంటే ఎంతో అభిమానం. రామ్‌ ఫొటోలు చూస్తే ఆమె స్పందిస్తుందని.. ఆయనను చూపిస్తే అన్నం కూడా తింటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామ్‌.. శశితో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పడంతో పాటు చికిత్సకు అవసరమైన ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో
అప్పుడు ఇచ్చిన మాటను రామ్‌ ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. శశికి అవసరమైన మందులు, నిత్యావసర సరుకులు, పౌష్టికాహారాన్ని ఆమె కుటుంబానికి పంపించారు. తన కళ్లజోడును కూడా శశికి బహుమతిగా పంపంచారు.( 'ఇరుముడి' సూపర్ క్యూట్ సాంగ్.. ఫుల్ వీడియో రిలీజ్)

అభిమానుల ద్వారా అందజేత
రామ్‌ పంపించిన వస్తువులను ఆయన అభిమానులు శశి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా శశి కుటుంబ సభ్యులు రామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అభిమాని కష్టాల్లో ఉందని తెలుసుకుని స్పందించడమే కాకుండా.. ఇచ్చిన మాట ప్రకారం అండగా నిలుస్తున్న రామ్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెరపై హీరోగా కనిపించే రామ్‌.. నిజ జీవితంలోనూ ‘రియల్‌ హీరో’ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement