రవితేజ 'ఇరుముడి' మూవీ రిలీజై మూడు వారాలు అయిపోయినా సరే ఇప్పటికీ అద్భుతంగా ప్రదర్శితమవుతోంది. మరోవైపు సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలోనూ క్లారిటీ వచ్చేసింది. ఈ శుక్రవారం నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇదలా ఉండగానే ఇందులో సూపర్ క్యూట్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: చెప్పులతో పోస్టర్లపై కొట్టారు.. గలీజ్ మాటలు మాట్లాడారు: వైష్ణవి చైతన్య)
'ఇరుముడి'లో అయ్యప్ప స్వామి నేపథ్యంతో పాటు తండ్రి-కూతురు ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. తండ్రిగా రవితేజ, కూతురిగా నక్షత్ర మంచి యాక్టింగ్ చేశారు. వీళ్ల మధ్య, కుటుంబ అనుబంధాన్ని చూపించేలా 'యాలాలో యాలాలో' అనే సాంగ్ సినిమాలో ఉంది. ఇప్పుడు దీని ఫుల్ వీడియోని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇప్పటికే మల్లెపూల పల్లకి, ఇరుముడి కట్టు, కార్తీకమాసం పాటలకు సంబంధించిన వీడియోలు వదిలారు.
(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)


