ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ | Bigg Boss 10 Telugu Day 7 Promo Debjani And Mukesh | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu Debjani: ముకేశ్ కళ్ల గురించి దేబ్జానీ-నాగ్ డిస్కషన్

Sep 13 2026 12:19 PM | Updated on Sep 13 2026 12:22 PM

Bigg Boss 10 Telugu Day 7 Promo Debjani And Mukesh

వీకెండ్ వచ్చిందంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి మొదలైపోతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చి హౌస్‌మేట్స్‌తో ఆడుకోవడంతో పాటు వారమంతా జరిగిన సంగతుల గురించి మాట్లాడుతారు. అలా ఈ సీజన్‌లో తొలివారం జరిగిన చాలా విషయాల గురించి ఆదివారం మాట్లాడుకున్నారు. మిగతా వాటి సంగతేమో గానీ దేబ్జానీ, ముకేశ్ 'కళ్ల' కహానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది.

(ఇదీ చదవండి: తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!)

మీ మనసుకు ఎవరు దగ్గరయ్యారు? ఎవరు దూరమయ్యారు? అని చెప్పాలని నాగ్ అడగ్గా.. రామ్ ప్రసాద్, నరేశ్, ముకేశ్ తోటి కంటెస్టెంట్స్ పేర్లు చెప్పారు. అయితే హౌస్‌లో వాతావరణం సీరియస్‌గా ఉండేసరికి ముకేశ్, నీ కళ్లు బాగున్నాయని నాగ్ అనడంతో అందరూ నవ్వేశారు. మీరు అన్నందుకు థ్యాంక్యూ సర్ అని ముకేశ్ అనగానే కౌంటర్ ఇచ్చిన నాగ్.. నేను అంటే ఓకే గానీ దేబ్జానీ అంటే మాత్రం ఒప్పుకోవా అని ప్రశ్నించారు.

టాపిక్ తనవైపు డైవర్ట్ అయ్యేసరికి దేబ్జానీ తన మనసులో మాట బయటపెట్టింది. నాకు నిజంగా నీ కళ్లు బాగుందనిపించింది కాబట్టి చెప్పాను అని ముకేశ్‌ని చూస్తూ దేబ్జానీ చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ముకేశ్ చాలా ఇష్టం. కానీ చెప్పలేకపోతున్నాను. ఇటు సైడ్ పులిహోర చేస్తున్నాడు. అటు సైడు కూడా చేస్తున్నాడు. నా దగ్గర రావట్లేదు సర్ అని గోముగా అడిగింది. త్వరలో దేబ్జానీ-ముకేశ్ మధ్య బంధం మొదలవుతుందేమో చూడాలి?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో తొలి వీకెండ్‌.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement