సాధారణంగా బిగ్‌బాస్‌లో ఏ సీజన్ అయినా సరే ప్రారంభంలో కాస్త నిదానంగా ఉంటుంది. ఒకటి రెండు వారాలు పూర్తయిన తర్వాత గొడవలు, ఎలిమినేషన్లతో హీట్ పెరుగుతుంది. కానీ రీసెంట్‌గా మొదలైన తెలుగు బిగ్‌బాస్ 10లో ఊహించని ట్విస్టులు షాకిస్తున్నాయి. ఇంతకీ ఐదో రోజైన శుక్రవారం(సెప్టెంబరు 11) అసలేం జరిగింది?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు)
సింపుల్.. టఫ్ టాస్క్
చరణ్ ఎలిమినేట్ కావడంతో గురువారం ఎపిసోడ్ పూర్తయింది. తమ స్నేహితుడు ఇలా అర్థాంతరంగా హౌస్ వీడి బయటకెళ్లిపోయేసరికి సృష్టి బాధపడింది. మరోవైపు ఝాన్సీ గేమ్ గురించి మాట్లాడుకున్న అమన్, రోహిత్, సృష్టి, షాలిని.. మనతో ఉంటే వాళ్లు టార్గెట్ చేస్తారని తెలివిగా ఆమె వాళ్ల వైపు వెళ్లిపోయిందని అనుకున్నారు. కట్ చేస్తే సులభమైన టాస్క్ కోసం ఏడుగురు, కష్టమైన టాస్క్ కోసం ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని బిగ్‌బాస్ చెప్పాడు. త్రిగుణ్, ముఖేశ్, కృష్ణుడు మేం ఆడమని చెప్పేయగా.. హై రిస్క్‌లో ఉన్న కారణంగా చైత్రని ఆడొద్దని ఆదేశించాడు. దీంతో మిగతావాళ్లంతా మాట్లాడుకుని సుధీర్, వర్షిణిని కష్టమైన టాస్క్ కోసం.. రాంప్రసాద్, ఝాన్సీ, నరేశ్, సృష్టి, అమన్, షాలిని, దేబ్జానీ సింపుల్ టాస్క్‌కి సెలక్ట్ అయ్యారు.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ?
రోహిత్ తనతో మాట్లాడటం లేదని సృష్టి, అమన్‌తో చెప్పేసరికి.. ఇతడీ విషయం రోహిత్‌కి చెబుతాడు. దీంతో రోహిత్ వెళ్లి సృష్టితో మాట్లాడతాడు. ఇదంతా చూసిన షాలిని.. తన వల్లే సృష్టికి రోహిత్ దూరమైపోతున్నాడేమోనని తెగ బాధపడిపోయింది. ఇదంతా చూస్తుంటే వీళ్ల ముగ్గురి మధ్య లవ్ స్టోరీ లాంటిది ఏమైనా మొదలవుతుందేమోనని అనిపిస్తోంది. మరోవైపు కర్చీఫ్ వేసి పరుగెత్తి వచ్చి కూర్చునే సింపుల్ టాస్క్‌లో రాంప్రసాద్ విజేతగా నిలిచాడు. గేమ్‌లో గెలిచినందుకు ఒకరిని హై రిస్క్‌లో పెట్టాలని అనగా అమన్ పేరు చెప్పుకొచ్చాడు.
సుధీర్-వర్షిణి దొందుకు దొందే
కష్టమైన టాస్క్ కోసం ఎంపికైన సుధీర్, వర్షిణిని లోపలికి పిలిచిన బిగ్‌బాస్.. ఓ కేక్ స్మాష్ చేసి దీనిని ఒకరు చేశారంటే మరొకరు చేశారని కంటెస్టెంట్స్ అందరినీ నమ్మించాలని.. ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్లు సేవ్ అవుతారని అన్నాడు. అయితే ఈ టాస్క్ సరిగా ఆడలేక లోపల జరిగిన విషయాన్ని వర్షిణి, ముకేశ్‌కి చెప్పేయడంతో గేమ్ ఆడిన సుధీర్, వర్షిణి ఇద్దరూ కూడా హై రిస్క్ జోన్‌లోకి వెళ్లారని బిగ్‌బాస్ అల్టిమేటం జారీ చేశాడు.
చైత్ర ఎలిమినేట్
ఇక మహాపరీక్షలో భాగంగా హై రిస్క్‌లోకి వచ్చిన చైత్ర, వర్షిణి, సుధీర్, అమన్‌లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పిన బిగ్‌బాస్.. నలుగురూ మిగిలిన వాళ్లలో ఒక్కొక్కరికి ఓటు వేయాలని చెప్పాడు. దీంతో వర్షిణి, చైత్ర పేరు.. అమన్ కూడా చైత్ర పేరు.. సుధీర్ కూడా చైత్ర పేరు చెప్పాడు. ఇక చైత్ర, సుధీర్ ఎలిమినేట్ అవ్వాలని చెప్పింది. చైత్రకు మూడు ఓట్లు వచ్చినందుకు చైత్ర ఎలిమినేట్ అయింది. ఏంటి బిగ్‌బాస్ ఇది నాలుగు రోజుల్లో ఇద్దరినీ తీసుకెళ్లిపోతారా అని రాంప్రసాద్ కామెడీ చేశాడు. ఇలా ఐదోరోజు ఎపిసోడ్ ముగిసింది. వారం కాకుండానే ఇద్దరిని ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్.. వీకెండ్‌లో ఇంకెలాంటి ట్విస్టులు ఇస్తాడో చూడాలి?
(ఇదీ చదవండి: కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్‌బాస్ జంటకు మరో కూతురు)


