breaking news
Chaitra Rai
-
ఓరి నాయనో ఇదేం 'ప్రేమ'? చైత్ర-చరణ్.. అనుకున్నట్లే ట్విస్ట్
ఈసారి బిగ్‌బాస్ షోలో తొలివారమే ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయారు. అది కూడా వారం మధ్యలోనే హౌస్ నుంచి వెళ్లిపోవడంతో అంతా షాకయ్యారు. కానీ వాళ్లిద్దరూ బయటకెళ్లలేదు. అనుకున్నట్లే ఈ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. అలానే దేబ్జానీ, ముకేశ్ అయితే నిజమైన ప్రేమికుల కంటే అతి చేస్తున్నారు. ఇంతకీ బిగ్‌బాస్ 10లో 10వ రోజైన మంగళవారం ఏం జరిగింది? ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి?(ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)నామినేషన్ల హంగామాతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. దీని గురించి మాట్లాడుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇంతలో ముకేశ్, వర్షిణితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో దిగాడు. దీంతో దేబ్జానీ సరదాగానే ముకేశ్‌తో గొడవ పెట్టుకుంది. నా చెల్లికి అన్యాయం చేస్తావా అని రాంప్రసాద్ ఓవైపు నుంచి ముకేశ్‌ని అడుగుతుంటే.. నేను ఉండగా మరొకరితో పూల్‌లోకి ఎలా దిగుతావ్ అని దేబ్జానీ అడిగింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు ఓరి నాయనో ఇదేం ప్రేమ అనకుండా ఉండలేరు.ఇక వినాయక చవితి పండగని ఇంట్లోనే అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూజా సామాగ్రిని బిగ్‌బాస్ పంపించాడు. కాసేపటి తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. పవర్ ఆఫ్ పీపుల్‌లో ఉన్న త్రిగుణ్, దేబ్జానీ, అమన్, షాలిని, ముఖేశ్, రోహిత్, ఝాన్సీ, రాంప్రసాద్‌లు కెప్టెన్ అయ్యేందుకు పోటీపడ్డారు. బెలూన్ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్ అందరికీ కొన్ని స్పెల్లింగ్స్ ఇచ్చారు. ఎవరు కరెక్ట్‌గా రాస్తే వాళ్లు మిగతా కంటెస్టెంట్స్‌లలో ఒకరి బెలూన్ పగలగొట్టి కారణాలు చెప్పాలని బిగ్‌బాస్ అన్నాడు.మొదటి రౌండ్లో త్రిగుణ్ బెలూన్లు నాలుగూ వేరే మిగతావాళ్లు పగలగొట్టేయడంతో ఇతడు ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత వరసగా రోహిత్, రాంప్రసాద్, దేబ్జానీ, షాలినీ, ముకేశ్ ఎలిమినేట్ అయ్యారు. చివరగా మిగిలిన ఝాన్సీ, అమన్‌లకు బుధవారం నాడు కెప్టెన్సీ పోటీ ఉండబోతుంది. గతవారం ఎలిమినేట్ అయిన చైత్ర, చరణ్ విషయంలో అనుకున్నట్లే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్లిద్దరిలో ఒకరిని తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చే బాధ్యత ఆడియెన్స్‌కి ఇచ్చారు. ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారో వాళ్లు రీఎంట్రీ ఇస్తారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
బిగ్‌బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు?
సాధారణంగా బిగ్‌బాస్‌లో ఏ సీజన్ అయినా సరే ప్రారంభంలో కాస్త నిదానంగా ఉంటుంది. ఒకటి రెండు వారాలు పూర్తయిన తర్వాత గొడవలు, ఎలిమినేషన్లతో హీట్ పెరుగుతుంది. కానీ రీసెంట్గా మొదలైన తెలుగు బిగ్‌బాస్ 10లో ఊహించని ట్విస్టులు షాకిస్తున్నాయి. ఇంతకీ ఐదో రోజైన శుక్రవారం(సెప్టెంబరు 11) అసలేం జరిగింది?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు)సింపుల్.. టఫ్ టాస్క్చరణ్ ఎలిమినేట్ కావడంతో గురువారం ఎపిసోడ్ పూర్తయింది. తమ స్నేహితుడు ఇలా అర్థాంతరంగా హౌస్ వీడి బయటకెళ్లిపోయేసరికి సృష్టి బాధపడింది. మరోవైపు ఝాన్సీ గేమ్ గురించి మాట్లాడుకున్న అమన్, రోహిత్, సృష్టి, షాలిని.. మనతో ఉంటే వాళ్లు టార్గెట్ చేస్తారని తెలివిగా ఆమె వాళ్ల వైపు వెళ్లిపోయిందని అనుకున్నారు. కట్ చేస్తే సులభమైన టాస్క్ కోసం ఏడుగురు, కష్టమైన టాస్క్ కోసం ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని బిగ్‌బాస్ చెప్పాడు. త్రిగుణ్, ముఖేశ్, కృష్ణుడు మేం ఆడమని చెప్పేయగా.. హై రిస్క్‌లో ఉన్న కారణంగా చైత్రని ఆడొద్దని ఆదేశించాడు. దీంతో మిగతావాళ్లంతా మాట్లాడుకుని సుధీర్, వర్షిణిని కష్టమైన టాస్క్ కోసం.. రాంప్రసాద్, ఝాన్సీ, నరేశ్, సృష్టి, అమన్, షాలిని, దేబ్జానీ సింపుల్ టాస్క్‌కి సెలక్ట్ అయ్యారు.ట్రయాంగిల్ లవ్ స్టోరీ?రోహిత్ తనతో మాట్లాడటం లేదని సృష్టి, అమన్‌తో చెప్పేసరికి.. ఇతడీ విషయం రోహిత్‌కి చెబుతాడు. దీంతో రోహిత్ వెళ్లి సృష్టితో మాట్లాడతాడు. ఇదంతా చూసిన షాలిని.. తన వల్లే సృష్టికి రోహిత్ దూరమైపోతున్నాడేమోనని తెగ బాధపడిపోయింది. ఇదంతా చూస్తుంటే వీళ్ల ముగ్గురి మధ్య లవ్ స్టోరీ లాంటిది ఏమైనా మొదలవుతుందేమోనని అనిపిస్తోంది. మరోవైపు కర్చీఫ్ వేసి పరుగెత్తి వచ్చి కూర్చునే సింపుల్ టాస్క్‌లో రాంప్రసాద్ విజేతగా నిలిచాడు. గేమ్‌లో గెలిచినందుకు ఒకరిని హై రిస్క్‌లో పెట్టాలని అనగా అమన్ పేరు చెప్పుకొచ్చాడు.సుధీర్-వర్షిణి దొందుకు దొందేకష్టమైన టాస్క్ కోసం ఎంపికైన సుధీర్, వర్షిణిని లోపలికి పిలిచిన బిగ్‌బాస్.. ఓ కేక్ స్మాష్ చేసి దీనిని ఒకరు చేశారంటే మరొకరు చేశారని కంటెస్టెంట్స్ అందరినీ నమ్మించాలని.. ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్లు సేవ్ అవుతారని అన్నాడు. అయితే ఈ టాస్క్ సరిగా ఆడలేక లోపల జరిగిన విషయాన్ని వర్షిణి, ముకేశ్‌కి చెప్పేయడంతో గేమ్ ఆడిన సుధీర్, వర్షిణి ఇద్దరూ కూడా హై రిస్క్ జోన్లోకి వెళ్లారని బిగ్‌బాస్ అల్టిమేటం జారీ చేశాడు.చైత్ర ఎలిమినేట్ఇక మహాపరీక్షలో భాగంగా హై రిస్క్‌లోకి వచ్చిన చైత్ర, వర్షిణి, సుధీర్, అమన్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పిన బిగ్‌బాస్.. నలుగురూ మిగిలిన వాళ్లలో ఒక్కొక్కరికి ఓటు వేయాలని చెప్పాడు. దీంతో వర్షిణి, చైత్ర పేరు.. అమన్ కూడా చైత్ర పేరు.. సుధీర్ కూడా చైత్ర పేరు చెప్పాడు. ఇక చైత్ర, సుధీర్ ఎలిమినేట్ అవ్వాలని చెప్పింది. చైత్రకు మూడు ఓట్లు వచ్చినందుకు చైత్ర ఎలిమినేట్ అయింది. ఏంటి బిగ్‌బాస్ ఇది నాలుగు రోజుల్లో ఇద్దరినీ తీసుకెళ్లిపోతారా అని రాంప్రసాద్ కామెడీ చేశాడు. ఇలా ఐదోరోజు ఎపిసోడ్ ముగిసింది. వారం కాకుండానే ఇద్దరిని ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్.. వీకెండ్లో ఇంకెలాంటి ట్విస్టులు ఇస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్‌బాస్ జంటకు మరో కూతురు) -
‘బిగ్‌బాస్’లోకి ఇద్దరు ఆడపిల్లల తల్లి.. ఎవరీ సీరియల్ బ్యూటీ!
బిగ్‌బాస్ 10వ సీజన్లో 6వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన చైత్ర రాయ్ స్వతహాగా కన్నడ. సొంత భాషలోనే తొలుత నటిగా కెరీర్ ప్రారంభించింది. సీరియల్స్‌తో మంచి గుర్తింపు అందుకుంది. 'అష్టా చమ్మా' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' తదితర సీరియల్స్ చేసింది. 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు'లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.చైత్ర కేవలం సీరియళ్లకే పరిమితం కాలేదు. ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'లో ఓ సహాయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వ్యక్తిగత విషయానికొస్తే ప్రసన్న అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండో పాప పుట్టి కేవలం 10 నెలల మాత్రమే అవుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇప్పుడు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టేసింది. మళ్లీ తనదైన ప్రతిభ చూపించి తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకోవాలని అనుకుంటోంది.ప్రతి సీజన్లోనూ సీరియల్స్ నుంచి పాపులర్ నటీనటులను బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకురావడం ఓ ఆనవాయితీ. ఈసారి చైత్ర రాయ్‌ని ఆ అవకాశం వరించింది. గ్లామర్, ఆమెకున్న ఫ్యాన్ బేస్, బోల్డ్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ షోకి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. 10 నెలల పాపని వదిలేసి వెళ్తున్న ఈమె షోలో ఎంతలా మెప్పిస్తుందో చూడాలి?


