‘బిగ్‌బాస్‌’లోకి ఇద్దరు ఆడపిల్లల తల్లి.. ఎవరీ సీరియల్‌ బ్యూటీ! | Bigg Boss 10 Telugu Chaitra Rai Full Biography, Career Details | Sakshi
Sakshi News home page

Chaitra Rai: సీరియల్ బ్యూటీ.. ఇద్దరు ఆడపిల్లల తల్లి.. ఇప్పుడు 'బిగ్‌బాస్' 10లోకి

Sep 6 2026 8:46 PM | Updated on Sep 6 2026 9:02 PM

Bigg Boss 10 Telugu Chaitra Rai Full Biography, Career Details

బిగ్‌బాస్ 10వ సీజన్‌లో  6వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన చైత్ర రాయ్ స్వతహాగా కన్నడ. సొంత భాషలోనే తొలుత నటిగా కెరీర్ ప్రారంభించింది. సీరియల్స్‌తో మంచి గుర్తింపు అందుకుంది. 'అష్టా చమ్మా' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' తదితర సీరియల్స్ చేసింది. 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు'లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.

చైత్ర కేవలం సీరియళ్లకే పరిమితం కాలేదు. ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'లో ఓ సహాయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వ్యక్తిగత విషయానికొస్తే ప్రసన్న అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండో పాప పుట్టి కేవలం 10 నెలల మాత్రమే అవుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇప్పుడు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టేసింది. మళ్లీ తనదైన ప్రతిభ చూపించి తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకోవాలని అనుకుంటోంది.

ప్రతి సీజన్‌లోనూ సీరియల్స్ నుంచి పాపులర్ నటీనటులను బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకురావడం ఓ ఆనవాయితీ. ఈసారి చైత్ర రాయ్‌ని ఆ అవకాశం వరించింది. గ్లామర్, ఆమెకున్న ఫ్యాన్ బేస్, బోల్డ్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ షోకి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు.  10  నెలల పాపని వదిలేసి వెళ్తున్న ఈమె షోలో ఎంతలా మెప్పిస్తుందో చూడాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement