బిగ్‌బాస్'లోకి ఆటో రాంప్రసాద్.. అవినాష్, ఇమ్ములా మెప్పిస్తాడా? | Bigg Boss Telugu 10: Auto Ram Prasad Full Biography, Career Details | Sakshi
Sakshi News home page

Bigg Boss 10: ఆటో పంచుల కమెడియన్..'బిగ్‌బాస్'లో అడుగుపెట్టాడు

Sep 6 2026 8:51 PM | Updated on Sep 6 2026 9:50 PM

Bigg Boss Telugu 10: Auto Ram Prasad Full Biography, Career Details

అంగరంగ వైభవంగా 'బిగ్‌బాస్' 10వ సీజన్ మొదలైంది. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే కమెడియన్ ఆటో రాంప్రసాద్     కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. తనదైన డ్యాన్స్‌తో అలరించాడు. గతంలో ఇతడి స్నేహితులైన ముక్కు అవినాష్, ఇమ్మాన్యుయేల్ లాంటి వాళ్లు కమెడియన్ కేటగిరీలో వచ్చారు. ఫుల్ ఎంటర్‌టైనర్ చేశారు. మరి వాళ్లని రాంప్రసాద్ మర్చిపోయేలా చేస్తాడా లేదా అనేది చూడాలి?

రాంప్రసాద్ విషయానికొస్తే ఆంధ్రాలోని విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. 2009లో రిలీజైన నాగచైతన్య 'జోష్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత పెద్దగా ఛాన్స్‌లు రాకపోవడంతో తిరిగి సొంతూరికి వెళ్లిపోయి మెడికల్ హోల్‌సేల్ వ్యాపారం చేశాడు. 'జబర్దస్త్' షో మొదలైన తర్వాత ధనరాజ్ టీమ్‌కి రైటర్‌గా పనిచేసేందుకు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. కొన్నాళ్లు ఈ టీమ్‌లో చేసిన తర్వాత సుడిగాలి సుధీర్‌తో కలిసిపోయాడు. ఇతడి టీమ్‌లో రైటర్ కమ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటో పంచులతో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు.

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, పటాస్, అనుభవించు రాజా తదితర టీవీ షోల్లో చేస్తూనే నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ఖైదీ నంబర్ 150, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బెదురులంక 2012, ది ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్‌లో అడుగుపెట్టాడు. ఇందులో తనదైన పంచులు,ప్రాసలతో పాటు ప్రతిభ చూపించి విజేతగా నిలుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement