బిగ్‌బాస్ 10లోకి యాంకర్ కేటగిరీలో సుధీర్ రెడ్డి నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఇతడి విషయానికి వస్తే గతంలో ఓ మీడియా ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం 'సుధీర్ టాక్స్' పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ(నంద్యాల)లో పుట్టి పెరిగిన సుధీర్.. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటూ పలువురు వ్యాపారవేత్తలు, డాక్టర్స్, సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు.
సోషల్ మీడియా వేదికగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రెడ్డి.. ఇప్పుడు బిగ్‌బాస్ 10లో ఓ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టడు. మరి బుల్లితెరపై అలరించిన ఇతడు ఈ రియాలిటీ షోలో ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి?


