బిగ్‌బాస్ షో అనగానే తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికి గుర్తొచ్చే ఏకైన పేరు ‘కింగ్’ నాగార్జున. తెలుగులో ఇప్పటివరకు 9 సీజన్లు పూర్తవ్వగా..మొదటి రెండు తప్ప మిగిలిన సీజన్లన్నింటికీ ఆయనే హోస్ట్‌గా చేశాడు. తెరపై స్టైలీష్ ఎంట్రీ ఇస్తూనే తనదైన మాటతీరుతో దారితప్పుతున్న ఆటను గాడిలో పెడుతూ..బిగ్‌బాస్ షోని విజయవంతంగా నడిపిస్తున్నాడు. అయితే సీజన్ 10కి కొత్త హోస్ట్ వస్తాడని ప్రచారం జరిగినప్పటికీ..మళ్లీ నాగార్జుననే బరిలోకి దింపారు నిర్వాహకులు. దీని కోసం భారీగా పారితోషికం అందించారట. ఇప్పుడు నాగార్జున రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సీజన్ 3కి రూ. 5 కోట్లు పారితోషికంగా తీసుకున్న నాగార్జున.. సీజన్ 9కి వచ్చేసరికి రూ. 35 కోట్ల వరకు తీసుకున్నాడట. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డు నాగార్జునకే దక్కింది. ఇక సీజన్ 10కి వచ్చేసరికి పారితోషికం మరింత పెరిగినట్లు సమాచారం. బిగ్‌బాస్ 10 కోసం నాగార్జునకి రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇందులోనే స్పెషల్ ప్రోమోలు, ప్రమోషనల్ షూట్స్ కూడా ఉన్నాయట. దాదాపు 15 వారాల పాటు బిగ్‌బాస్ షో కొనసాగుతుంది. ఫినాలతో కలిపి మొత్తం 30 రోజుల పాటు నాగార్జున షోలో కనిపిస్తాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పారితోషికం విషయం నిజమే అయితే.. ఒక్కో రోజు రూ. కోటికిపైనే తీసుకుంటున్నల్లు లెక్క. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమే. అసలు పారితోషికం ఎంత అనేది అధికారికంగా ప్రకటించలేరు.కాబట్టి ఇందులో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు.


