బిగ్‌బాస్‌పై అంచనాలు పెంచేస్తోన్న ప్రోమో | bigg boss 10 telugu promo released | Sakshi
Sakshi News home page

Bigg boss 10 telugu: బిగ్‌బాస్‌పై అంచనాలు పెంచేస్తోన్న ప్రోమో

Sep 6 2026 4:25 PM | Updated on Sep 6 2026 4:48 PM

bigg boss 10 telugu promo released

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో..ఈ షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లాంచింగ్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్‌ విడుదల చేశారు.  ప్రోమోలో నాగార్జున ఓ మ్యాజిక్‌ కీని చూపిస్తూ ఇది ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ల తలరాతను మార్చుతుంది అని చెప్పడం ఈ సీజన్‌పై అంచానాలు పెంచేస్తోంది.  ప్రోమో చూస్తుంటే గత సీజన్లకు మించి ఈసారి లాంచింగ్‌ ఎపిసోడ్‌ను గ్రాండ్‌గా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతుబిడ్డ ఝాన్సీ ఎంట్రీని ప్రోమోలో చూపించడం ఆసక్తిని పెంచుతోంది.  బిగ్‌బాస్‌లో హీరో కార్తీక్‌ సందడి చేసినట్లు ప్రోమోలో కనిపించింది.

నాగార్జునకు సైతం షాక్‌!
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన హోస్ట్‌ నాగార్జున.. అక్కడి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు తాను ఇలాంటి కాన్సెప్ట్‌ను చూడలేదని బిగ్‌బాస్‌తో చెప్పడం ప్రోమోలో కనిపించింది. దీంతో ఈసారి హౌస్‌లో ఏదో కొత్తగా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.

ఒకేసారి మూడు భాషల్లో..
మరోవైపు తెలుగు బిగ్‌బాస్‌తో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ బిగ్‌బాస్‌ షోలు ఇదే రోజు ప్రారంభం కానున్నాయి. ఆయా భాషల హోస్టులు విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్‌, మోహన్‌లాల్‌.. నాగార్జునతో వర్చువల్‌గా భేటీ కావడం కూడా ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి కొత్త కంటెస్టెంట్లు, కొత్త కాన్సెప్ట్‌లు, గ్రాండ్‌ లాంచింగ్‌తో బిగ్‌బాస్‌ సీజన్‌ 10పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement