‘అంతా రాములోరు చూస్కుంటారు‘ గ్లింప్స్‌ విడుదల | Antha Ramuloru Chusukuntaru Title Glimpse Released | Sakshi
Sakshi News home page

అంతా రాములోరు చూస్కుంటారు గ్లింప్స్‌ విడుదల

Sep 6 2026 3:39 PM | Updated on Sep 6 2026 4:13 PM

Antha Ramuloru Chusukuntaru Title Glimpse Released

పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో సంగీత్‌ శోభన్‌, అనస్వర రాజన్‌ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్రం బృందం గ్లింప్స్‌ని విడుదల చేసింది. వీడియోలో హీరో హీరోయిన్ల మధ్య జరిగిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

 ఈ సినిమాకి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. సినిమాలో సంగీత్‌ శోభన్‌ మారుతి అనే గోదారి కుర్రాడులా కనిపిస్తున్నాడు. అనస్వర రాజన్‌ ‘శిరీష’గా వెండి తెరను పలకరించనుంది.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement