‘అంతా రాములోరు చూస్కుంటారు‘ గ్లింప్స్ విడుదల
పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్రం బృందం గ్లింప్స్‌ని విడుదల చేసింది. వీడియోలో హీరో హీరోయిన్ల మధ్య జరిగిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. సినిమాలో సంగీత్ శోభన్ మారుతి అనే గోదారి కుర్రాడులా కనిపిస్తున్నాడు. అనస్వర రాజన్ ‘శిరీష’గా వెండి తెరను పలకరించనుంది.