అర్చకుడు లేదా బ్రాహ్మణోత్తమా అనే పిలవాలి..! | Brahmins perform daily worship and rituals inside Temple Called Archaka | Sakshi
Sakshi News home page

అర్చకుడు లేదా బ్రాహ్మణోత్తమా అనే పిలవాలి..!

Oct 22 2026 4:24 PM | Updated on Oct 22 2026 4:30 PM

Brahmins perform daily worship and rituals inside Temple Called Archaka

మనం నిత్యం పూజలు చేయించే బ్రాహ్మణుడిని పూజారి అని పిలుస్తుంటాం కదా! అయితే అసలు పూజారి అనే పదమే తప్పని, అర్చకుడు అని లేదా బ్రహ్మ గారు అనో లేక బ్రాహ్మణోత్తమా అనో పిలవాలనో ప్రవచనకారులు చెబుతున్నారు. నిజమేనా? 

మీరు విన్న మాట నూటికి నూరుపాళ్లు సత్యం. నిత్యం దేవాలయాలలో లేదా మన ఇంట్లో పూజలు చేసేవారిని ‘పూజారి’ అని పిలవడం మన వాడుకభాషలో సర్వసాధారణం అయిపోయినప్పటికీ, ధర్మశాస్త్రాల ప్రకారం, భాషా ప్రయోగం దృష్ట్యా అది సరైన పదం కాదు.

అర్చకుడు... ఆగమ శాస్త్రాలు, అర్చా విధిని తెలిపే గ్రంథాలలో ’అర్చకుడు’ అనే పదం స్పష్టంగా కనిపిస్తుంది. ‘అర్చన’ అనగా పూజించడం. దేవాలయాలలో ప్రతిష్ఠించబడిన మూర్తులకు విధివిధానంగా అర్చన (పూజ) చేసేవాడిని అర్చకుడు అంటారు. ఇది సంస్కృత మూలమున్న ధర్మబద్ధమైన పదం.

బ్రాహ్మణోత్తమ / బ్రహ్మ గారు:  మన వేద సంప్రదాయంలో గృహాలలో జరిగే పూజలు, సంస్కారాలు (నామకరణం, ఉపనయనం, వివాహం, శ్రాద్ధాలు మొదలైనవి) నిర్వహించేవారిని వారి విద్యకి, సంస్కారానికి తగినట్లుగా గౌరవ సూచకంగా ‘బ్రహ్మ గారు’ అని లేదా ‘బ్రాహ్మణోత్తమా’ అని సంబోధించడం ఆచారం.

యజ్ఞయాగాదులలో, పూజాది కార్యక్రమాలలో కర్మను నడిపించే ప్రధాన పురోహితుడిని ‘బ్రహ్మ’ అని పిలుస్తారు. కాబట్టి పూజ చేసేవారిని గౌరవంగా బ్రహ్మ గారు అని అనడం శాస్త్రానుగుణమే. మనం తరచు అనే, వినే ‘పూజారి’ అనే పదం మన గ్రంథాలలో ఎక్కడా లేదు; అది కేవలం కాలక్రమేణా వచ్చిన వాడుక పదం. 

దేవాలయాల్లో స్వామివారికి సేవ చేసేవారిని ‘అర్చకులు’ అని, గృహాలలో పూజలు నిర్వహించే పండితులను గౌరవంగా ‘బ్రాహ్మణోత్తములు’ అని లేదా ‘అర్చక స్వాములు’ అని, సంప్రదాయానుసారం ‘బ్రహ్మ గారు’ అని పిలవడమే సర్వవిధాలా శాస్త్ర సమ్మతం, గౌరవప్రదం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement