'నోరు మంచిదైతే.. ఊరు మంచిది' | Devotional And Inspirational Story On Power Of Words Life Lessons Telugu | Sakshi
Sakshi News home page

'నోరు మంచిదైతే.. ఊరు మంచిది'

Oct 22 2026 9:42 AM | Updated on Oct 22 2026 9:42 AM

Devotional And Inspirational Story On Power Of Words Life Lessons Telugu

సన్నిధి

శతక నీతి

ఈ ప్రశ్నకి జవాబు ‘నోరు మంచిదైతే ఊరు మంచి అవుతుందని’ మన పెద్దవాళ్ళు ఏనాడో చెప్పారు..
రామాయణంలో..
‘సత్యం బృయాత్‌ ప్రియం బయాత్‌ న
బయాత్‌ సత్యమప్రియం ప్రియం
చ నానృతం బృయాత్‌ ఏష ధర్మః సనాతనః’
   అని చెప్పబడింది. నిజమే మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి. నచ్చని నిజాన్ని చెప్పకూడదు. నచ్చుతుందని అబద్దం చెప్పకూడదు...

‘నీచ ప్రసంగ:కులహీన’ అని భారతంలో వాక్యం
‘సత్యం వద’ సత్యమే పలకమని తైత్తిరీయోపనిషత్తులో బోధ.

కుమార శతకంలో ‘నోరు మంచిదైన నూరు మేలులు కలుగు నోరు చెడ్డదైతే నూరు కీడులు’ అని అంటారు
‘తల లేని మాటల తడబాటు పలుకులు
నగుబాటు తెలిసి పలుకుట మేలు సుమతీ’

‘మాటకున్న పదును వేయి కత్తుల కంటే వాడి గలది’ అంటాడు వేమన
‘కల్లుద్రాగుటకంటే కల్లలాడుట కీడు’ వేమన ఆలోచన.
‘పలుచని నీచమానవుడు పాటి దలంపక నిష్టురోక్తులం బలుకుచు నుండు గాని’ నీచ మానవ ప్రవృత్తిని బయట పెట్టాడు భాస్కర శతకంలో.

అదే శతకంలో దూషణం ప్రాణంతకమే అని శిశుపాల దంతవక్త్రుల కథ ప్రస్తావన తెస్తారు.
‘బల్లిదుడైన సతప్రభు నబద్ధము లాడిన ద్రుంగి పోదురె’ అంటూ...
‘సదోభూషాసూక్తి ‘అన్నది వాక్కు అలాగే ‘వాగ్భుషణం భూషణమ్‌’ చక్కని వాక్కే అలంకారం... ఇంటా, బయటా సజావుగా ఉండాలంటే, సత్సంబంధాలు ఉండాలంటే మనసు నొప్పించకుండా మాట్లాడాలి..
– డా. కందాళ సత్యనారాయణ మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement