breaking news
life lessons
-
సంతోషం కోసం వెతకొద్దు.. ఈ సూత్రాలు పాటించండి!
పదేపదే ఫోన్ చూడటం, ఆందోళన చెందడం, సంతోషం కోసం నిరంతరం కొత్త విషయాలను వెతకడం వంటి అలవాట్లు మనసుపై ప్రభావం చూపుతుంటాయి. వీటిని అధిగమించేందుకు టిబెటన్ బౌద్ధ భిక్షువు, రచయిత యోంగే మింగ్యూర్ రిన్పొచే కొన్ని సులభమైన సూచనలు చేశారు. ‘ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే వ్యక్తి’గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మెదడును శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు ప్రశాంతత, సంతోషానికి సంబంధించిన స్థాయిలు గణనీయంగా ఉన్నట్లు గుర్తించారు.ఖాళీ సమయాన్ని ఫోన్‌తో నింపొద్దు ఒంటరితనం, విసుగు, ఆందోళన వచ్చినప్పుడు వెంటనే ఫోన్ తీయడం, కాఫీ లేదా తిండి వైపు వెళ్లకుండా ఆ భావాలను గమనిస్తూ ఉంటే అవి నెమ్మదిస్తాయని రిన్పొచే సూచించారు.చిన్న మార్పులు చేసుకోండి ఉద్యోగం, జీవనశైలి అన్నీ మార్చాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్లే మార్గాన్ని మార్చడం, కొత్త వంటకం ప్రయత్నించడం, చాలాకాలంగా మాట్లాడని స్నేహితుడికి సందేశం పంపడం వంటి చిన్న కొత్త అనుభవాలను ప్రయత్నించాలి.నిశ్శబ్దం ధ్యానానికి తప్పనిసరి కాదు ట్రాఫిక్ శబ్దం, ఇతరుల మాటలు వంటి వాటినీ ధ్యానానికి అనువుగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ధ్యానం చేయవచ్చన్నారు.‘మూడు స్తంభాల’ పద్ధతిదృక్పథం, ధ్యానం, ఆచరణ అనే మూడు అంశాలను పాటించాలని సూచించారు. ఇతరుల్లో మంచి లక్షణాలను గుర్తించడం ద్వారా దీనిని ప్రారంభించవచ్చన్నారు.కృతజ్ఞతను స్పష్టంగా వ్యక్తం చేయండి ఆరోగ్యం, ఇల్లు, కుటుంబం, స్నేహితులు వంటి చిన్న విషయాల విలువను గుర్తించడం ద్వారా జీవితంపై ఆశ పెరుగుతుందని చెప్పారు.భయాందోళనను మేఘంలా చూడండి ఆందోళనతో పోరాడకుండా దాన్ని గమనించి, అంగీకరించి, దానిని తొలగించుకోవాలని సూచించారు.సంతోషాన్ని వెంటాడొద్దుకొత్త ఉద్యోగం, కొత్త ప్రదేశం లేదా కొత్త సంబంధం తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వవచ్చు. అయితే చైతన్యంతో శ్వాసించడం, తనపై, ఇతరులపై కరుణ చూపడం వంటి సాధనలు సంతోషభావాన్ని పెంచుతాయని తెలిపారు.కోపం వచ్చినప్పుడు కాసేపు ఆగండి‘నేను ఇప్పుడు కోపంగా ఉన్నాను’ అని గుర్తించడం ద్వారా వెంటనే స్పందించకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుందని వివరించారు.ఇతరులకు సహాయం చేయండి మన సమస్యలపై మాత్రమే దృష్టి పెట్టకుండా చిన్న సహాయం చేయడం, స్నేహితుడితో అతని పరిస్థితిని అడగడం వంటి చర్యలు మరింత ఆనందాన్ని అందిస్తాయని రిన్పొచే పేర్కొన్నారు.ఇదీ చదవండి: విశ్వ వీక్షణ నిలయం.. ఈ గణేశ మండపం -
గతం గతః! ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందా?
ఒక అడవికి రాజు సింహం. సింహం అంటేనే గజగజలాడే భయం. కానీ, ఇప్పుడు ఆ మృగరాజు ఒక చీకటి గుహలో దీనంగా పడి ఉంది. కొద్దిరోజుల కిందటే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక క్రూరమైన పులితో చేసిన పోరాటంలో సింహం తీవ్రంగా గాయపడింది. ఆ గాయాలు మానినా, ఆనాటి భయంకరమైన దృశ్యాలు సింహం మనసును వదలడం లేదు.రాజవైద్యుడైన ఎలుగుబంటి ఎన్ని ఔషధాలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. సింహం నిరాశతో, ‘నా పరాక్రమం ముగిసింది మిత్రమా! ఈ గాయాలే నా మరణానికి దారి తీస్తాయి. నేను మళ్ళీ గర్జించలేను.’ అంటూ నిట్టూర్చింది.అదే సమయంలో, పొరుగు అడవి నుంచి తన మిత్రుడైన ఏనుగును కలవడానికి ఒక కోతి వచ్చింది. ఏనుగు తన రాజు ఆరోగ్య పరిస్థితిని వివరించగా, అంతా విన్న కోతి గంభీరంగా ఇలా అంది: ‘మిత్రమా! మృగరాజుకు ఇప్పుడు కావాల్సింది మూలికల వైద్యం కాదు, మానసిక వైద్యం!’ఏనుగు ఆశ్చర్యపోయి, ‘వైద్యం గురించి నీకు ఇవన్నీ ఎలా తెలుసు?’ అని అడిగింది. అప్పుడు కోతి తన గతాన్ని వివరిస్తూ, ‘నేను ఒకప్పుడు గొప్ప వైద్యురాలిని. కానీ, ఒక చిన్న పొరపాటు వల్ల ఒక జీవి ప్రాణం పోయింది. ఆ అపరాధ భావంతో అప్పటి నుండి వైద్యం చేయడమే మానేశాను. ఎవరికీ ఈ విషయం చెప్పలేదు.’ అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది.ఏనుగు వెంటనే కోతి భుజంపై తొండం వేసి, ‘మిత్రమా! గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. మన పొరపాట్ల నుంచే మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు సింహాన్ని కాపాడటం నీ బాధ్యత. నీలో నిద్రాణమైన వైద్యుడిని నిద్రలేపు!’ అని ప్రోత్సహించింది.ఏనుగు మాటలతో కోతిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కోతి, ఏనుగు కలిసి సింహం గుహకు వెళ్లాయి. అవి రాజవైద్యుడు ఎలుగుబంటికి విషయం చెప్పాయి. ఎలుగుబంటి సంబరపడి, మృగరాజుకు వైద్యం చేయటానికి కోతిని అనుమతించింది. కోతి సింహాన్ని పూర్తిగా పరీక్షించి ఒక నిర్ణయానికి వచ్చింది. తనకు కావలసిన మూలికలు సేకరించడానికి గుహ బయటకు వెళ్ళింది.ఆ సమయంలో ఏనుగు ఇలా అంది: ‘మృగరాజా! గతం గతః. మీ పరాక్రమాన్ని మళ్ళీ చాటే సమయం వచ్చింది. ఈమె సామాన్యమైన కోతి కాదు, గొప్ప వైద్యురాలు.’మూలికలు సేకరించి తిరిగి గుహలోకి వచ్చిన కోతి, సింహం కళ్ళలోకి సూటిగా చూస్తూ, ‘రాజా! మీ వ్యాధి మీ దేహంలో లేదు, మీ ఆలోచనల్లో ఉంది. నాడు మీరు పులిని తరిమికొట్టినప్పుడు తగిలిన ఈ గాయాలు మీ వీరత్వానికి సజీవ సాక్ష్యాలు! అవి మిమ్మల్ని భయపెట్టకూడదు, మీ గుండెను మరింత బలంగా మార్చాలి.’ అని నొక్కి చెప్పింది. అనంతరం మూలికలతో ఒక లేహ్యం తయారుచేసి సింహానికి తాగించింది.ఆశ్చర్య కరంగా, మరుసటి రోజు ఉదయానికే మృగరాజు తన నిస్సత్తువను వదిలి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అడవి మొత్తం దద్దరిల్లేలా గర్జించాడు! నిజానికి కోతి ఇచ్చిన ఆ ‘మందు’ కేవలం తీపి పండ్ల రసం మాత్రమే. సింహం రోగం నయం కావడానికి కారణం ఆ రసం కాదు; కోతి తన మనసులో నింపిన ధైర్యం, గతాన్ని మర్చిపోవాలనే సంకల్పం మాత్రమే!సింహం తన తప్పు తెలుసుకుంది. ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందని గ్రహించింది. తనను మళ్ళీ కర్తవ్యోన్ముఖుడిని చేసిన కోతిని ఘనంగా సత్కరించి, తన ఆస్థాన వైద్యురాలిగా నియమించుకుంది. అలాగే కోతిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఏనుగును తన రాజ సలహాదారునిగా నియమించుకుంది. రాజవైద్యుడు ఎలుగుబంటి కూడా వారి సమయస్ఫూర్తిని చూసి మురిసిపోయాడు.హితవచనం..అసంవిభాగీ దుష్టాత్మా కృతఘ్నో నిరపత్రపఃతాదృగ్నరాధిపో లోకే వర్జనీయో నరాధిపఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వనివాడు, దుష్టబుద్ధి, కృతజ్ఞత లేనివాడు, సిగ్గులేనివాడు అయిన రాజును పరిత్యజించాలి.- ముద్దు హేమలతఇవీ చదవండి: బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా? -
తలుపు: ‘మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం’.. నెలకే ఏమైంది?
పగడాలు కుటుంబం తూర్పు గోదావరి జిల్లా నుంచి హైద్రాబాద్‌కి వలస వచ్చింది. వారిది కొంకుదురు అనే చిన్న పల్లెటూరు. పగడాలు, ఆమె భర్త వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు.పగడాలు తమ్ముడు కొంకుదురు వచ్చినప్పుడల్లా ‘హైద్రాబాద్‌కి వెళ్తే బాగుపడని వారు లేరు. ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటాం’ అని ఆమెతో పదేపదే చెప్పడంతో, పగడాలు ఓ రోజు తన భర్తతో చెప్పింది.‘‘వెళ్ళి చూద్దాం. నచ్చకపోతే మళ్ళీ కోతల సమయానికి వచ్చేద్దాం.’’‘‘సరే, ఇక్కడ ఎటూ మనకి సంవత్సరం పొడుగూతా పని దొరకటం లేదు కదా.’’ అతను ఒప్పుకున్నాడు.అతని బావమరిది ఓ బిల్డర్ దగ్గర పని చేస్తున్నాడు. తన సూపర్వైజర్తో మాట్లాడి అక్కా బావలకి పని ఇప్పించాడు. ప్రతి శనివారం ఆ వారానికి చేసిన పనికి డబ్బు ముట్టడం ఆ దంపతులు ఇద్దరికీ నచ్చింది.వాళ్ళు ఓ స్లమ్‌లోని చిన్న గుడిసె అద్దెకి తీసుకుని దిగారు. రెండు సంవత్సరాల తర్వాత ఆ దంపతులకి సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచన వచ్చింది. స్వంత స్థలం కొనేంత డబ్బు వారికి లేదు. మిగిలిన కూలీలు చేసే పనే వాళ్ళూ చేశారు. ఓ రౌడీకి నెల నెలా అద్దె చెల్లిస్తున్నంత కాలం ఓ పోరంబోకు స్థలంలో యాభై చదరపు గజాల మేర ఏదైనా కట్టుకోవచ్చు. రైలు పట్టాల పక్కనే కొత్తగా విస్తరించిన పట్టణంలో, అపార్ట్మెంట్స్ బాగా అభివృద్ధి చెందే చోటది. అది పనికి కూడా దగ్గర్లోనే ఉంటుంది.పగడాలు, ఆమె భర్త కాగితాలు లేని, నోటి మాట మీద నడిచే ఓ యాభైమంది గల చిట్టీలో చేరి, అవసరమైన సొమ్ముని తీసుకున్నారు.తనకున్న నైపుణ్యంతో పగడాలు భర్త, అతని బావమరిది ఆ ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. సిమెంట్ ఖర్చు కాబట్టి బంక మట్టిని ఉపయోగించి గోడలని లేపారు. పైన నల్లటి టార్పాలి¯Œ ని కప్పుగా వేశారు. ఆ ఇంటికి ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. తలుపుకి డబ్బు చాలక తెర కట్టారు. ఓ శుభముహూర్తంలో గృహప్రవేశం చేశారు.స్వంత ఇల్లు అనేది వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. క్రమంగా వాళ్ళు ఆ ఇంటిని అభివృద్ధి చేసుకోసాగారు. ముందుగా పగడాలు భర్త లోపలి మట్టి నేల మీద గచ్చు చేశాడు. తర్వాత వర్షాకాలంలో గోడలని కాపాడటానికి బయటివైపు సిమెంట్ చేశాడు. ఆ తర్వాత పైన టార్పాలిన్ స్థానంలో సెకండ్ హేండ్ ఇనుప రేకులను కొని కప్పాడు. వాటికున్న చిల్లుల్లోంచి వర్షం కారకుండా వాటిని సీసంతో మూసేశాడు.ఆ తర్వాత గోడల లోపలి వైపు సిమెంట్ చేశాడు. వారు కూలీకి వెళ్ళి చేసే ఈ పనులన్నీ తమ స్వంతానికి చేస్తూండటంతో ఆ పనులు మునుపు ఇవ్వని ఆనందాన్ని ఇవ్వసాగాయి.పగడాలు ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి తన భర్తని ఇంటికి తలుపు పెట్టించమని అడుగుతూనే ఉంది. తెర తీసుకుని ఎవరైనా, ఎప్పుడైనా లోపలికి రావచ్చు. రాత్రి తాము నిద్రలో ఉండగా దొంగ చొరబడొచ్చు. కాని ప్రతిసారి తలుపు కన్నా చేయాల్సిన ఇతర పనులే ముఖ్యం అవడం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది.ఇంట్లోని మట్టి నేలలో జెర్రులు తిరుగుతూండటంతో ఆ నేలని గచ్చు చేయించాల్సి వచ్చింది. వర్షాకాలంలో ఇటుకల మధ్య ఉన్న మట్టి కారి గోడలు కూలకుండా సిమెంట్ చేయాల్సి వచ్చింది. అరబస్తా సిమెంట్ మిగలడంతో అది వృథా కాకుండా దాంతో ఇంట్లో వంటకి ఓ చిన్న గట్టుని కట్టాడు. వర్షానికి కప్పు మీంచి గోడల మీదకి కారే నీటిని ఆపటానికి పైకప్పు వేయించాల్సి వచ్చింది. ఇలా వాళ్ళా ఇంట్లోకి ప్రవేశించాక తలుపు కన్నా మిగిలినవే ముఖ్యమైనవి అయ్యాయి.అవన్నీ పూర్తయ్యాక పగడాలు భర్త ముందు గోడకి గుమ్మం తెచ్చి పెట్టాడు. తర్వాతి సంవత్సరం తలుపుని అమర్చాడు.‘‘నాలుగేళ్లకి ఇది కుదిరింది. ఇంక దొంగలు ఎవరూ చొరబడరు. మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం.’’ పగడాలు ఆ రాత్రి తలుపు లోపల టవర్ బోల్ట్ పెట్టి సంతృప్తిగా చెప్పింది.తలుపు అమర్చిన నెల రోజులకి పగడాలు భర్త పనిలో జరిగిన ప్రమాదంలో మరణించాడు. అతని మరణం అందరికీ షాక్.∙∙ ఆ రాత్రి స్పర్శకి పగడాలుకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే ఓ మగాడు తనని తడుముతూ కనిపించాడు. ఆమె ఒక్క ఉదుటున బయటికి దూకి, తలుపు బయట గొళ్ళెం పెట్టి దొంగ అని అరవసాగింది. క్షణాల్లో ఆడ, మగ చాలామంది పక్క గుడిసెల్లోంచి లేచి వచ్చారు.ఆ దొంగ ఆమె పక్కింటివాడు. ఆమె భర్త వయసున్న అతను చిత్తూరు జిల్లా నుంచి వలస వచ్చాడు. అంతా అతనికి దేహశుద్ధి చేసి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలని తీర్పు చెప్పారు.మర్నాడు పగడాలు తన మరదలితో చెప్పింది.‘‘ఇంతకాలం నేను తలుపే రక్షణ ఇస్తుంది అనుకున్నాను. కాదు. తెర ఉండగా ఎన్నడూ వాడు రాలేదు. అప్పుడు నా భద్రతకి మా ఆయన అనే బలమైన తలుపు ఉందని నాకు తెలీలేదు. ఆడదానికి నిజమైన తలుపు మగాడే.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తిఇవి కూడా చదవండి: ఈ వారం కథ: 'ఆత్మబలం' -
ఈ వారం కథ: 'ఆత్మబలం'
‘నేను ఇప్పట్లో ఇండియా రాలేను. ఫుల్ బిజీగా ఉన్నాను. మీరే చూసుకోండన్నయ్యా!’ ఇక అంతకన్నా చెప్పాల్సిందేమీ లేదన్నట్లు ఫోన్ చేసి చెప్పాడు రాఘవ.‘అది కాదురా రాఘవా! నాన్న సంవత్సరీకానికయినా రాకపోతే ఎలారా? ఒకసారి ఆలోచించు.!’ ‘లేదన్నయ్యా! అర్థం చేసుకో! కావాలంటే వీడియో కాల్లో అటెండ్ అవుతానులే!’ అంటూ ఫోన్ కట్ చేశాడు రాఘవ.మాధవరావు, సుమతి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రామారావు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. చిన్న కొడుకు రాఘవ అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసుకుని, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్లిళ్లయి ఎవరికి వారు జీవిస్తున్నారు. తల్లి సుమతి పెద్ద కొడుకు రామారావు వద్దనే ఉంటుంది.మాధవరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొంది, అంతా సెటిల్ అయ్యారు అనుకుంటున్న తరుణంలో అనారోగ్యంతో సంవత్సరం క్రితం కాలం చేశాడు.యాభై సంవత్సరాల పాటు ఏమాత్రం అరమరికలు లేకుండా, అన్యోన్యంగా జీవించిన తమ బంధం భౌతికంగా వీడటంతో ఆనాటి నుంచి కుమిలి కుమిలి రోదిస్తూనే ఉంది సుమతి. అంత్యక్రియలు, కర్మకాండలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తే తన భర్త ఆత్మ శాంతిస్తుందని, ఆ విధంగానే శ్రాద్ధ కర్మలు నిర్వహించాలని కొడుకులను కోరింది సుమతి. పెద్ద కొడుకు రామారావు ఆచార వ్యవహారాలను అనుసరిస్తుంటాడు. కానీ చిన్న కొడుకు రాఘవ మాత్రం ఆస్తికులకు నాస్తికులకు మధ్యలో ఉండి, కొన్నింటిని అనుసరిస్తూ, కొన్నింటిని త్యజిస్తూ ఉండే స్వభావం. అదీగాక తన తండ్రి తనకేమీ చేయలేదనే కోపంతో ఉంటుంటాడు. అన్నను చూసుకున్నట్లుగా తనను చూసుకోలేదని బాధపడుతుంటాడు. మాధవరావు చనిపోయిన రోజు అన్న రామారావు బలవంతం మీద అమెరికా నుంచి వచ్చి చివరి చూపు చూసి, అంత్యక్రియల్లో పాల్గొని, వెంటనే వెళ్లిపోయాడు.అంత్యక్రియల తర్వాత మాధవరావు కుటుంబ స్నేహితుడు నారాయణ శాస్త్రిగారితో మిగతా కర్మకాండల విషయమై చర్చించిన విషయాలు ఒక్కొక్కటిగా రామారావు మదిని తొలుస్తున్నాయి.ప్రతి నెలా మాసికం పెడుతూ, శాస్త్రోక్తంగా సంవత్సరీకం వరకు జరపాలని అమ్మ కోరడంతో పాటు, శాస్త్రిగారు కూడా శాస్త్రం ప్రకారం నిర్వహించాలని కుటుంబ సభ్యులకు సూచించాడు. దీనికి అసహనానికి గురైన రాఘవ, ‘శాస్త్రిగారూ! మళ్లీ ఇండియా నేను రాలేను. నన్ను ఇబ్బంది పెట్టకండి’ అనడంతోశాస్త్రిగారికి కోపం వచ్చి, ‘చిన్నపిల్లోడిలా మాట్లాడకు రాఘవా! నాన్న ఎంత నిష్టాగరిష్ఠుడో అందరికీ తెలుసు. నాన్న ఆత్మ శాంతించాలంటే సంవత్సరం వరకు అన్ని తిథులూ పెట్టాల్సిందే. ఆ విధంగా చేయకపోతే మీ కుటుంబానికే అరిష్టం.’ అని హెచ్చరించారు.‘భయపెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? ఇక్కడ ఉన్నవాళ్లు చేస్తే చేసుకోండి.. నాకవసరం లేదు.’ అని రాఘవ కరాఖండిగా చెప్పాడు.‘కర్మాధికారంతో పెద్దవాడు కర్మ చేస్తున్నప్పటికీ, ఒకే చోట అన్నదమ్ములిద్దరూ ఈ క్రతువును చేయాల్సిందే. అంతేకాదు ఏటి సూతకం కూడా ఉంటుంది. సంవత్సరం పాటు మరే శుభకార్యాలు చేపట్టకూడదు. పితరుల ఆత్మశాంతికి, కుటుంబ సభ్యుల అభివృద్ధికి తర్పణాలు విడవాల్సిందే రాఘవా!’ హెచ్చరించాడు శాస్త్రిగారు.‘శాస్త్రిగారూ! ప్రతినెలా మాసికం, మధ్యలో వచ్చే తిథులు, ఇవన్నీ కాకుండా సంవత్సరానికి ఒకసారే పెట్టుకోవచ్చు కదా! మాకంతా టైం వేస్ట్. వ్యయ ప్రయాసలతో కూడినది. కాస్త ఆలోచించండి మా వైపు కూడా!’ రాఘవ తనకు అనుకూలమైన సమాధానాన్ని తెప్పించుకునేందుకు ప్రయత్నించాడు.‘పురాణాల ప్రకారం అంత్యక్రియలు, కర్మ కాండలు మరణానంతరం జీవికి శాంతి చేకూర్చడమే కాక, కుటుంబ సభ్యుల శ్రేయస్సు, ధార్మిక సంప్రదాయాన్ని చాటుతాయి. సంవత్సరం వరకు కూడా ఆత్మ కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతూనే ఉంటుంది. విధిగా అన్ని తిథులలో శ్రాద్ధాలు పెట్టాల్సిందే. సంవత్సర దీక్ష తప్పదు.’ అని శాస్త్రిగారు మరింత వక్కాణించడంతో, గుటకలు మింగిన రాఘవ..‘సరేలెండి! ఏం చేస్తాం!? నేను లేకపోయినా ప్రతినెలా అన్నయ్య ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. నేను సంవత్సరీకానికి వస్తాను. వీలైతే ప్రతి నెలా నేనక్కడ పెట్టుకుంటాలేండి.’ అసహనంగా చెప్పాడు రాఘవ.‘లేదు రాఘవ! అన్నదమ్ములిద్దరూ ఒకే చోట కలిసి చేయాల్సిందే. ఇది శాస్త్రమే కాదు. కలిసి మెలిసి ఉండే కుటుంబ ఐక్యత సూత్రం, మాసిక ధర్మాన్ని చాటుతుంది. నాన్నగారి ఆత్మశాంతికి ఆ మాత్రం సమయం కేటాయించలేవా..?‘ నిలదీస్తున్నట్లు ప్రశ్నించడంతో, చేసేది చేయొచ్చు ఈయనతో వాదనెందుకని మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవ.కొత్తగా పెళ్లయిన తన తమ్ముడిని ఇబ్బంది పెట్టటం ఎందుకనుకుని..‘సరే రాఘవ! కనీసం నాన్నగారి సంవత్సరీకానికైనా తప్పనిసరిగా నువ్వు, వనజ వచ్చేయండి.’ అన్నాడు. ముసిరిన జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాడు రామారావు. సంవత్సరీకానికైనా తమ్ముడొస్తే బాగుండు అనుకుంటూ, వచ్చే నెలలో వున్న నాన్న సంవత్సరీకం ఏర్పాట్ల ఆలోచనలో నిమగ్నమయ్యాడు.∙∙ ‘ఏవండీ! మామగారి సంవత్సరీకం వచ్చేనెల ఉంది కదా! ఇండియా వెళ్దామండి.’‘నీకేమైనా పిచ్చా? ఇక్కడ బోలెడన్ని పనులున్నాయి. అదేదో వాళ్లే చేసుకుంటారు. ఏదో ఒక సాకు చెప్పొచ్చులే.’ విసుగ్గా అన్నాడు రాఘవ.‘అదేంటండి అలా అంటారు? తండ్రికి శ్రాద్ధ కర్మలు పెట్టకపోతే, మనకు మంచిది కాదండి. ప్లీజ్ కొన్ని పాటించాలి. అయినా తండ్రి ఋణం తీర్చుకోవడం, ఆయన ఆత్మశాంతికి ఈ మాత్రం చేయడానికి వెనుకాడటం ఏమాత్రం బాగోలేదు.’ వనజ గట్టిగానే అంది.‘వనజా...నీకేం తెలియదు ఊరుకో! నాకేం చేశాడని మా నాయన? అందరిలాగే చదువుకున్నాను. సొంతంగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాను. అన్నయ్యను చూసినట్లు నన్నేమైనా చూశాడా? ఆ రోజు ఏదో ఒకటి చెప్పి, అక్కడి కార్యక్రమం వీడియో కాల్లో చూసి ఓ నమస్కారం పెట్టేద్దాం సరిపోతుంది. ఎటువంటి సంస్కారాలు చేయనవసరం లేదు. ఇక నన్ను విసిగించకు.’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు రాఘవ.‘జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఏంచేస్తే ఋణం తీరుతుంది? జీవించినంత కాలం సేవ చేయాలి. చనిపోయిన తర్వాత శ్రాద్ధకర్మలు పెట్టి వారి ఆత్మను శాంతింపచేయాలి.’ అంటూ రాఘవను కన్విన్స్ చేయబోయింది వనజ.‘ఏమోలే! పనికిరాని టాపిక్. ఎట్టి పరిస్థితుల్లో నాన్న తిథికి తిరిగి ఇండియాకు వెళ్ళేది లేనేలేదు.ఉన్నాడుగా అన్న... ఆయన చూసుకుంటాడులే. ఇక దాని గురించి వదిలేయ్! అవునూ! నాన్న అంత్యక్రియలకు వెళ్లినప్పుడు హైదరాబాదులో ఒక విల్లా చూశాను కదా! దానికి అడ్వాన్స్ ఇవ్వాలి. ఈ వారం రోజుల్లో చెల్లిస్తాను.’ ‘అదేమిటండీ! మీకు మొన్ననే ఉద్యోగం కూడా పోయింది కదా, మళ్లీ ఇంకో ఉద్యోగం వచ్చేవరకు ఆగుదాం. పైగా మామగారు పోయి సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరం లోపు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కదా! ఇప్పుడు డబ్బు కట్టడం అంత శ్రేయస్కరం కాదు, ఆలోచించండి.’ భర్తకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది వనజ.‘ఛత్! చాదస్తం మాటలు మాట్లాడకు. ఇవన్నీ ట్రాష్. మానసిక బలహీనతతో ఆడుకునే శాస్త్రాలు. వీటిని నమ్మను. సిద్ధాంతాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, మూఢత్వాలతో ప్రాక్టికల్ లైఫ్‌కు అడ్డం చెప్పకు. ఇప్పటివరకు నేను దాచుకున్న డబ్బుతో వచ్చేవారం అడ్వాన్స్ చెల్లిస్తాను.’ అంటూ ఒంటి కాలిపై లేచాడు రాఘవ. ఇక ఆ విషయం కొనసాగిస్తే భర్త సీరియస్ అవుతున్నాడని గ్రహించింది వనజ.‘సర్లేండి... రేపు ఆదివారం ఎక్కడికో వెళ్దామని చెప్పారు.’ టాపిక్ మార్చడానికి ప్రయత్నం చేసింది వనజ.‘యస్. బాగా గుర్తు చేశావు. మనం రేపు పిక్నిక్కి వెళ్దామనుకున్నాము. కాస్త మనసన్నా రిలాక్స్డ్గా ఉంటుంది, వెళదాం.’ ఉద్యోగం, సంవత్సరీకం ఈ రంధి నుంచి కాస్తంత ఉపశమనం కావాలనుకున్నాడు రాఘవ.∙∙ ఆరోజు ఆదివారం సమీపంలోని వాటర్ ఫాల్ సైట్ సీయింగ్‌కు వచ్చారు రాఘవ, వనజలు. వాటర్ ఫాల్స్ సమీపంలో ఓ నది ప్రవహిస్తోంది. అందులో పర్యాటకులు బోటింగ్ షికారు చేస్తున్నారు.‘ఏవండీ..! మనం కూడా బోటింగ్ చేద్దామండి.‘ గోముగా అడిగింది వనజ.‘వామ్మో! నాకు నీళ్లంటే భయం. ఆడపిల్లవైనా మీ నాన్న నీకు ఈత నేర్పాడు. మీ మామగారున్నారే– అదే– మా నాయన– మా ఊరి చెరువులో కొన్ని రోజులే సగం వరకే ఈత నేర్పారు. పూర్తిగా నేర్చుకోకముందే నుమోనియా రావడంతో, ఇక నేర్పలేకపోయాడు. దాంతో నాకు ఈత రాకుండా పోయింది. అందులో కూడా ఆయన వల్లే ఫెయిలయ్యాను.’ అని గతాన్ని గుర్తు చేసుకుంటూ...‘వెళితే నువ్వు వెళ్ళు. నేను ఇక్క డే ఉంటాలే’ అన్నాడు.‘అదేంటండి చోద్యం కాకపోతే! షికారు ఎవరైనా ఒక్కరే చేస్తారా? జంటగా వెళితేనే సరదా ఉంటుంది. అయినా ప్రతి ఒక్కరికి బెల్టు పెడతారు. భద్రంగానే ఉంటుంది. మగవారయుండి అంత భయపడితే ఎలా? పదండి పోదాం.’ అనగానే తన ఇగో పనిచేసి, బోటింగ్‌కు సిద్ధమయ్యాడు రాఘవ.బోట్లో నదిలో కొద్ది దూరం వెళ్లేసరికి ఒకచోట ప్రవాహం ఉద్ధృతమై, బోటులో చివర కూర్చున్న రాఘవ బెల్టు ఊడి అదుపు తప్పి నీళ్లలో పడిపోయాడు. పడీ పడగానే నీటిలో మునుగుతూ హాహాకారాలు చేస్తున్నాడు. భర్త ప్రమాదాన్ని గమనించిన వనజ వెంటనే నీటిలో దూకింది. కానీ ఇద్దరికీ పోను పోను చాలా దూరం పెరగడంతో, ఆమె రాఘవను అందుకోలేకపోతుంది. రాఘవ నీటిలో మునుగుతూ తేలుతూ, నీళ్లు మింగుతూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.కాకతాళీయంగా పైకి ఒక్కసారి ఆకాశం వైపు చూపు పడిన రాఘవకు నాన్న ఆకారం కనిపించినట్లయింది. ఆనాడు తమ ఊరి చెరువులో నాన్న ఈత నేర్పిన దృశ్యం గుర్తుకొచ్చింది. టైరు మధ్యలో తనను కట్టి ఈత ప్రాక్టీస్ చేయించిన దృశ్యం కళ్ళ ముందు కదలాడింది.పైనుంచి నాన్న...‘కమాన్ రాఘవా! కమాన్! అలాగే చేతులు, కాళ్లు ఆడించి పైకి తేలు... మునగకు... శరీరాన్ని తేలికగా చేసుకో... కాళ్లు చేతులు వేగంగా ఆడించు కమాన్... కమాన్... అలాగే... ఇంకా ముందుకు... ఇంకా ముందుకు... అంటున్నట్లుగా, ఉత్సాహపరుస్తూ, తనకు మరోసారి ఈత నేర్పుతున్నట్లుగా అనిపించి తన శక్తినంత కూడ తీసుకొని ఈత కొడుతూనే ఉన్నాడు రాఘవ. ‘నీకు ఈత బాగా వచ్చు... బాగా ఈదుతున్నావు. వెరీ గుడ్... అలాగే వచ్చేయ్..! అలాగే...’ అంటూ వెన్ను తడుతున్నట్లుగా నాన్న ఆత్మదర్శనంతో రాఘవ మరింత బలాన్ని కూడతీసుకొని చేతులు కాళ్లు వేగంగా కదిలిస్తూ, నీటిపై తెలియాడటం మొదలెట్టాడు. ఇంతలో ఎవరో ఒకరు బలంగా ఒక్క తోపు తోసినట్లు అనిపించడంతో, ఒక్కసారిగా ఒడ్డు సమీపంలోని చిన్న చెట్టును అందుకోగలిగాడు. ఆ చెట్టు ఆసరాతో నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు రాఘవ. ఒడ్డుకు చేరిన రాఘవ అంత చల్లదనంలో కూడా చెమటలు కక్కుతూ, ప్రాణ భయంతో వణుకుతూ ఆయాసపడుతూ కూర్చున్నాడు. ఇంతలో వెనకనుంచి వచ్చి భర్తను పట్టుకున్న వనజకు దుఃఖం కట్టలు తెంచుకుంది.లోపల నుంచి పీలగా వస్తున్నట్లుగా, జీర గొంతుతో, రోప్పుతూ...‘వనజా... వనజా..! నాన్న కనిపించాడు. ఆత్మదర్శనమైంది.’ అంటూ తల పైకెత్తి చూపించాడు.‘నన్ను రక్షించింది... పునర్జన్మ నిచ్చింది నాన్నే వనజా..! ఆనాడు సగం నేర్పిన ఈత, ఈనాడు పైనుంచి పూర్తిగా నేర్పాడు. అంతేకాకుండా అదృశ్య శక్తిగా, నేను కొట్టుకుపోకుండా బలంగా ఒడ్డుకు నెట్టడంతో నేను బతికాను వనజా..!’ అంటూ వల వల ఏడుస్తున్న భర్త వైపు లాలనగా చూసింది వనజ.అంత బాధలోనూ ఆమె మోములో ఓ చిరుదరహాసం మెరిసింది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, ‘మీ సంకల్పం గొప్పది మామగారు..! ఎవరితో ఏ పని చేయించాలో ఆ పని చేయించే ఆత్మబలం మీది. మీ కుమారుడిని కాపాడటానికి ఆత్మ శక్తిగా సగం మీరు పనిచేస్తే, వేగంగా డైవ్ చేసుకుంటూ నా భర్తను రక్షించుకునే మిగతా సగం బాధ్యతను నేను పూర్తి చేశాను. నేను చేసిన ఆ సగం మీ అదృశ్య శక్తిగా విశ్వసిస్తున్న నా భర్తకు, మీపై కలకాలం అదే గౌరవం, నమ్మకం ఉండే విధంగా, ఈ విషయాన్ని మనసులోనే దాచుకుంటాను మామగారు.’ అంటూ వనజ చేతులెత్తి నమస్కరించింది.∙∙ ‘అన్నయ్యా..! నాన్న తిథికి నేనూ వనజ ఇద్దరం వచ్చేస్తున్నాం! అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయండి..! టికెట్లు కూడా తీసుకున్నాం.’ రామారావుకి ఫోన్ చేసి చెప్పాడు రాఘవ.‘వనజా..వనజా.’ అంటూ గట్టిగా పిలిచాడు రాఘవ.‘ఏంటండీ..! ప్రతిదానికి హడావుడే... మీకు ఏదొచ్చినా తట్టుకోలేము. ఏంటో చెప్పండి.’ అంటూ వంటింట్లో నుంచి వచ్చింది వనజ.‘ఏం లేదు వనజా! గత నెల నాకు లేఆఫ్‌లో ఉద్యోగం పోయిందిగా... ఈ రోజు మెయిల్ వచ్చింది వేరే కంపెనీలో మరింత ప్యాకేజ్‌తో పైస్థాయి ఉద్యోగం వచ్చింది.’ అంటూ సంతోషంతో వనజను కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేశాడు రాఘవ.‘ఓహ్! సూపర్... మంచి వార్త చెప్పారు. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. హైదరాబాదులో విల్లాకు అడ్వాన్స్ చెల్లించవద్దని మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. అదేదో డబుల్ రిజిస్ట్రేషన్ వివాదంలో ఉందట.’ వనజ చెప్పడంతో మరింత ఆనందంతో మరోసారి నాన్నను మనసులో తలచుకున్నాడు రాఘవ.‘యస్... వనజా..! సంవత్సరంలోపు శుభకార్యం మన చేత చేయించకుండా అడ్డుపడి, మనకు మేలు చేసింది మీ మామగారే. శాస్త్రాన్ని నమ్మకపోవడంతో చేయాల్సిన కర్మలు సరిగా చేయలేదేమో, అందుకే ఆ రోజున నాకు ఉద్యోగం పోయింది. నాన్న ఆత్మ దర్శనం కావడంతో, నాన్నపై విశ్వాసం పెరగడంతో, మళ్లీ పాత దానికన్నా పెద్ద ఉద్యోగం వచ్చింది. నిజంగా ఇది నాన్న ఇచ్చిన వరప్రసాదమే కదా వనజ!’ అంటూ ఆత్మ సంతృప్తితో ఆనందాన్ని వ్యక్తం చేశాడు రాఘవ. మంచి పరివర్తనతో తన భర్తలో వచ్చిన మార్పుకు వనజ లోలోన సంతోషించి, మామగారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. మాధవరావు సంవత్సరీకానికి రాఘవ, వనజలు ఇండియా బయలుదేరారు.∙∙ ఇల్లు చేరీ చేరగానే అమ్మను పట్టుకొని, కుమిలి కుమిలి ఏడ్చాడు రాఘవ. ‘నాన్నను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా! నాకు నాన్న ఆత్మ దర్శనమైంది.’ అంటూ జరిగిందంతా చెప్పాడు. నేను మళ్ళీ బతికి నీ ముందున్నాను అంటే, నాన్న ఇచ్చిన పునర్జన్మేనమ్మా!’ అంటున్న రాఘవను పొదివి పట్టుకుని ఓదార్చింది సుమతి.‘నీకు ఇంకో విషయం చెప్పనా రాఘవా! నాన్న విషయంలో ఇంకోటి కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయావు. నాన్న నీకు చెరువులో ఈత నేర్పుతున్న కాలంలో, నాన్నకు న్యుమోనియా వచ్చింది. దాంతో పూర్తిగా ఈత నేర్పలేకపోయాడు.కాలం గడుస్తున్నా కొద్దీ, వ్యాధి ముదిరి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఆ పరిస్థితుల్లోనే నీ అమెరికా ప్రయాణం రావడంతో చికిత్సకు వెచ్చించాల్సిన డబ్బును నీ అమెరికా ప్రయాణానికి, చదువుకు పెట్టాడు. సరైన సమయంలో చికిత్స లేకపోవడంతో, వ్యాధి ముదిరి ప్రాణాంతకమైంది. ఒక రకంగా తన ప్రాణాన్ని నీ చదువు, ఉన్నతికి పణంగా పెట్టాడు.అంతే కాదు రాఘవా..! నువ్వు అనుకున్నట్లు అన్నయ్యను ఎక్కువగా ఏమీ చూడలేదు. ఇంకా.. అన్నయ్యే నీకోసం త్యాగం చేశాడు తెలుసా..? మీ ఇద్దరికీ సమానంగా వచ్చిన వాటాలో, అన్నయ్యకు వచ్చిన ఎకరం పొలంలో సగం అమ్మి నీ చదువుల ఖర్చుకు పెట్టాడు. నీకు నాన్న, అన్నయ్యల పట్ల అపోహలు ఉండటంతో, ఇప్పటివరకు ఈ విషయాలు చెప్పలేకపోయాను. నీ అంతట నీవే పరివర్తన చెందావు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు చెప్పగలిగాను.’ అమ్మ చెబుతున్న విషయాలు వింటున్న రాఘవ ఒక్కసారిగా నిలువెల్లా ద్రవించిపోయాడు. అంతలో అప్పుడే అటుగా వస్తున్న రామారావును పరుగు పరుగున వెళ్లి గాఢంగా హత్తుకున్నాడు.‘నన్ను మన్నించు అన్నయ్యా...! నన్ను క్షమించు నాన్నా..!’ అంటూ పశ్చాత్తాపంతో కుంగిపోతూ గుక్కపట్టి ఏడుస్తుంటే, అమ్మ, అన్నయ్యలు మరింత ప్రేమ పూర్వకంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు.‘ఇదే రాఘవా..! మన ఆత్మ బలం’ అని రామారావు తమ్ముడిని ఆప్యాయంగా నిమిరాడు.మాధవరావు సంవత్సరీకానికి కావలసిన ఏర్పాట్లను చర్చించటానికి అక్కడికి వచ్చిన నారాయణ శాస్త్రిని చూసిన రాఘవ కన్నీటిని ఆపుకోలేకుండానే‘శాస్త్రిగారూ...! నా మూర్ఖత్వానికి మన్నించండి.’ అంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. జరిగిందంతా తెలుసుకున్న నారాయణ శాస్త్రి ‘మాధవా..నీ ఆత్మ సంకల్పం గొప్పది.’ అనుకుంటూ మనసులోనే అభినందించాడు.‘కర్మాణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచనా... కర్తవ్యాన్ని చేయడమే నీ బాధ్యత, ఫలములపై ఎప్పుడూ హక్కు లేదు. ఇది నిష్కామ కర్మ సిద్ధాంతం రాఘవా!’ అంటూ వేదాంత ధోరణిలో వివరించాడు నారాయణ శాస్త్రి. ‘అంతేకాదు..! శాస్త్రం, శాస్త్రీయత, విశ్వాసం, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, విలువలు, కుటుంబ బంధాల మేళవింపే జీవిత సారం..! అదే మన ఆత్మబలం..!’ అని సత్ జీవన విధాన బోధ చేసిన నారాయణ శాస్త్రికి వినమ్రంగా నమస్కరించారు అందరూ.- మంత్రిప్రగడ శ్రీనివాసరావుఇవీ చదవండి: 104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ -
‘చిన్న ముల్లుకే ఏడుస్తావా?’.. కోతికి చివర్లో దిమ్మతిరిగే గుణపాఠం!
అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. ఆ కోతి చాలా తుంటరిది. ఎప్పుడూ చెట్ల మీద గంతులు వేస్తూ అడవిలో ఉన్న జంతువులను వెక్కిరిస్తూ ఉండేది. ఏవైనా జంతువులు కష్టంలో ఉంటే సహాయం చేయకపోగా, వాటిని ఎగతాళి చేస్తూ కాలక్షేపం చేసేది.ఒకరోజు కోతి విహారానికి నడుచుకుంటూ వెళుతుండగా, దారిలో ఒక ఎలుగుబంటికి కాలికి ముల్లు గుచ్చుకొని బాధపడుతూ కనిపించింది. ఎలుగుబంటి ఆ ముల్లును బయటకు తీయడానికి నానా ఇబ్బందులు పడుతోంది. అది చూసిన కోతి, ‘ఛీ! ఇంత చిన్న ముల్లుకి ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నువ్వు చాలా పిరికిదానివి!’ అని ఎలుగుబంటిని చూసి ఎగతాళి చేసింది. ఎలుగుబంటి బాధగా, ‘ఇది నీకు చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ, నొప్పి ఎలా ఉంటుందో తెలిస్తే ఇలా అనవు!’ అని అక్కడి నుండి కుంటుతూ వెళ్లిపోయింది. కోతి మాత్రం నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది.దారిలో ఒక ఏనుగు గుండ్రంగా తిరుగుతూ, తొండాన్ని ఊపుతూ కనిపించింది. తొండానికి తేలు కుట్టడంతో ఏనుగు నొప్పిని భరించలేక అల్లాడిపోతోంది. అప్పుడు అక్కడికి వచ్చిన కోతి, ‘ఏంటీ? ఒక చిన్న తేలు కుడితేనే కొండలా ఉన్న నువ్వు ఇంతలా విలవిల్లాడిపోతున్నావా? నేనైతే అస్సలు పట్టించుకోను. నువ్వు ఎంత పిరికి దానివి!’ అని ఏనుగును కూడా వెక్కిరించింది. కోతి మాటలకు ఏనుగు ఎంతో బాధపడింది. ఏనుగు బాధను చూసి కోతి ఏమాత్రం కనికరించకుండా తన దారిలో వెళ్ళిపోయింది.మరో రోజు, ఒక నెమలి వర్షంలో తడిసి రెక్కలు బరువెక్కడంతో ఎగరలేక కిందపడి ఇబ్బంది పడుతుంటే, కోతి చెట్టు మీద నుండి పండ్లు విసురుతూ, ‘పురివిప్పి నాట్యం చేయలేని నెమలి దేనికీ పనికిరాదు. రెక్కలు మొద్దుబారిన నువ్వు అడవిలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే!’ అని వెక్కిరించింది. ఇలా ఎదుటివారి బాధను చూసి కోతి ప్రతిసారీ నవ్వుకుంటూనే ఉండేది.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఒకరోజు కోతి చెట్టు మీద నుండి కిందకు దూకుతుండగా, ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. ఆ వలలో ఉన్న పదునైన ఇనుప ముళ్లు కోతి కాలికి, తోకకు బలంగా గుచ్చుకున్నాయి. కోతి నొప్పి తట్టుకోలేక, ‘అమ్మో! ఎంత నొప్పి! ఎవరైనా నన్ను కాపాడండి! నేను భరించలేకపోతున్నాను!’ అని పెద్దగా అరుస్తూ ఏడవసాగింది.కోతి అరుపులు దూరంగా ఉన్న ఏనుగుకి, ఎలుగుబంటికి, నెమలికి వినిపించాయి. అవి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. కోతి తన కాలికి ముళ్లు గుచ్చుకుని, విలవిల్లాడుతుండటం చూశాయి.అప్పుడు కోతికి అర్థమైంది, ఎదుటివారి బాధను తక్కువ చేసి మాట్లాడటం తప్పు అని. ఎలుగుబంటి, ఏనుగు, నెమలి అన్నీ కలిసి కోతి దగ్గరకు వచ్చాయి. ఆ జంతువులన్నింటినీ చూసి కోతి కళ్లు చెమ్మగిల్లాయి. ఎలుగుబంటి, ఏనుగు జాగ్రత్తగా వల నుండి కోతిని విడిపించి, ఆ ముళ్లను తొలగించి దానికి సహాయం చేశాయి.తను చేసిన తప్పుకు చాలా సిగ్గుపడింది కోతి. ‘మిమ్మల్ని ఇంతకుముందు నేను ఎంతగానో ఆటపట్టించాను. కానీ, మీరు ఇప్పుడు నాకు సహాయం చేశారు. ఎవరి బాధ ఎంతటిదో, అది మనదాకా వస్తేనే తెలుస్తుంది!’ కన్నీళ్లతో అంది కోతి. అప్పటి నుండి కోతి ఏ జంతువునూ తక్కువ చేసి మాట్లాడలేదు. ‘ఎదుటివారి కష్టాన్ని చూసి నవ్వడం కంటే, ఆదుకోవడం మిన్న!’ అని తెలుసుకుంది. హితవచనం..అపకృత్య బుద్ధిమతో దూరస్థోస్మీతి నాశ్వసేత్దీర్ఘా బుద్ధిమతో బాహూ యాభ్యాం హింసతి హింసితః - బుద్ధిమంతుడికి అపకారం చేసి, దూరంగా పారిపోయి, ‘అతడికి దూరంగానే ఉన్నాను కదా, నాకేం భయంలేదు’ అనుకోవడం బుద్ధితక్కువ పని. బుద్ధిమంతుడు తనను హింసించినవాడు ఎక్కడున్నా పట్టుకుని, ప్రతీకారం తీర్చుకోగలడు.- శోభా సురేష్ -
తండ్రిని కాపాడిన 10 ఏళ్ల కూతురు.. కథ తెలిస్తే కన్నీళ్లు వస్తాయి!
ఒక చిన్న గ్రామంలో రాము, అతని పదేళ్ల కూతురు చైత్ర నివసిస్తున్నారు. రాముకు చదువు రాదు. ఊళ్లో చిన్న కిరాణా కొట్టు నడుపుతుంటాడు. కానీ, అతనికి ఒక చెడ్డ అలవాటు ఉంది. రోజంతా సంపాదించిన డబ్బుతో సాయంత్రం కాగానే స్నేహితులతో కలిసి పేకాట ఆడుతూ కూతురు చదువు గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు.కానీ చైత్ర చాలా చురుకైన పిల్ల. ఎలాగైనా చదువుకుని గొప్ప ఆఫీసర్ అవ్వాలని, నాన్నను మార్చాలని అనుకునేది. ఒకరోజు రాము పేకాటలో ఓడిపోయి, ఇంటికి వచ్చాడు. చైత్ర చేతిలో ఒక స్టాంప్ కాగితం పెట్టి, ‘చైతూ.. ఇందులో ఏముందో చదువు. మా స్నేహితుడు దీనిపై సంతకం పెడితే వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు‘ అన్నాడు. చైత్ర ఆ కాగితం చదివి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అది వాళ్ల కిరాణా కొట్టును ఆ స్నేహితుడికి రాసిచ్చే పత్రం!చైత్ర నాన్న చేతులు పట్టుకుని, ‘నాన్న! చదువుకోకపోతే సమాజం మనల్ని ఎలా మోసం చేస్తుందో చూశావా? నువ్వు సంతకం పెడితే మనకున్న ఒకే ఒక్క ఆధారం పోయేది. నువ్వు మారాలి నాన్న‘ అంటూ ఏడ్చేసింది. రాముకు ఒక్కసారిగా కళ్లు తెరుచుకున్నాయి. ఆ రోజు నుంచి రాము పేకాట మానేశాడు. ప్రతి సాయంత్రం చైత్ర పక్కన కూర్చుని, కూతురి దగ్గరే అక్షరాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కూతురిని బాగా చదివించాడు. కొన్నేళ్ల తర్వాత చైత్ర పెద్ద ఆఫీసర్ అయ్యింది. ఆ రోజు రాము అందరితో, ‘నన్ను దారికి తెచ్చిన నా గురువు నా కూతురే‘ అని గర్వంగా చెప్పుకున్నాడు.ఇవి కూడా చదవండి: నిచ్చెన ఎక్కేప్పుడు కాళ్లు ఎందుకు వణుకుతాయి? -
ధైర్యం వదిలేస్తే ఏం జరుగుతుంది?
వేమన ధైర్యాన్ని మనిషి అసలైన ఆభరణంగా చెప్పాడు.పద్యం... ధైర్యమే పురుషునకు భూషణంబురా ధైర్యహీనునకు దైవమైన తోడురాడురా వేమనాఅర్థం: ధైర్యమే మగవాడికి అసలైన అలంకారం. ధైర్యం లేనివాడికి దేవుడే వచ్చినా సహాయం చేయడు.మరొక పద్యంలో... ధైర్యము గలవానికి ధరణిలో సుఖమురా ధైర్యము లేనికి దరిద్రమే గతిరాధైర్యం ఉన్నవాడికి ఈ లోకంలో సుఖం దొరుకుతుంది. ధైర్యం లేనివాడికి దరిద్రమే దిక్కు.భాస్కర శతకంలో..ధైర్యము గలవాడె ధన్యుడీ లోకానధైర్యమున జయమెల్ల దక్కునురాధైర్యమే లేనిచో దైవమే వచ్చిన కార్యము సాగదురా భావం.. ధైర్యం ఉన్నవాడే ఈ లోకంలో ధన్యుడు. ధైర్యంతోనే అన్ని పనుల్లో జయం వస్తుంది. ధైర్యం లేకపోతే దేవుడే వచ్చినా పని జరగదు.సుమతీ శతకం...బద్దెన సుమతీ శతకంలో ధైర్యాన్ని నేరుగా మగతనంతో పోల్చాడు.‘ధైర్యము విడువకుము ధరణిలో నరుడుధైర్యమున జయమెల్ల దక్కునురా సుమతీధైర్యమే మగతనంబురా సుమతీ‘ మనిషి ఎప్పుడూ ధైర్యాన్ని వదలకూడదు. ధైర్యంతోనే అన్నీ సాధించవచ్చు. ధైర్యమే అసలైన మగతనం.మరొక చోట...ధైర్యము లేనివానికి దైవము తోడుపడడు సుమతీ అని అంటాడు ధీరుని లక్షణాన్ని, గొప్పతనాన్ని ప్రస్తావిస్తాడు, పద్యంలో ధీరులెప్పుడూ న్యాయ మార్గాన్ని వదలరు అని అంటాడు భర్తృహరి.చివరిగా...ధైర్యం అనే అంశాన్ని మంచి పనులకే ముడి పెట్టాలి.. చెడ్డపనులకు చేసే ప్రయత్నం లో చూపిన తెగువ ధైర్యం కాదు. ధర్మం కోసం యుద్ధం చేసినందుకే శ్రీ కష్ణుడు, శ్రీరాముడు, పాండవులు, శివాజీ, ఝాన్సీ భాయి, అల్లూరి సీతారామరాజు... ఎందరో స్వతంత్ర సమర యోధులు ‘దైర్యవంతులు’గా శాశ్వత కీర్తి సంపాదించారు.– డా. కందాళ సత్యనారాయణ మూర్తిఇవి కూడా చదవండి: నిజమైన మార్పు ఎక్కడ మొదలవుతుంది? -
రోజూ విమానం కోసం ఎదురుచూసే బాలుడు! చివరికి..
భారతదేశ విమానయాన రంగానికి పితామహుడిగా పిలవబడే జె.ఆర్.డి. టాటాకు పదేళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం ఉత్తర ఫ్రాన్స్‌లోని ఒక బీచ్ రిసార్ట్ పక్కన నివసించేది. అక్కడ వారి పొరుగున ప్రపంచంలోనే మొదటిసారిగా విమానంలో ఇంగ్లీష్ ఛానల్‌ను దాటి రికార్డు సృష్టించిన ప్రసిద్ధ విమానయాన పైలట్ లూయిస్ బ్లెరియట్ ఉండేవాడు.ఆయన తరచూ ఆ బీచ్‌లోని ఇసుకపై విమానాన్ని ల్యాండ్ చేస్తూ ఉండేవారు. బీచ్‌లో ఆడుకునే చిన్నారి టాటా ప్రతిరోజూ ఆ విమానం రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేవాడు. ఆ పైలట్ సాహసాలు చూసి, చిన్నారి టాటాలో ఒక బలమైన కోరిక నాటుకుంది. నేను కూడా పెద్దయ్యాక ఖచ్చితంగా పైలట్ అవ్వాలి, ఆకాశంలో ఎగరాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు.ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత 1929లో భారతదేశంలోనే మొట్టమొదటి కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించి తన బాల్యపు కలను నిజం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనే భారతదేశపు మొదటి ఎయిర్‌లైన్స్ సంస్థను స్థాపించారు.సందేశం: బాల్యంలో మనసులో నాటుకునే బలమైన లక్ష్యాలే భవిష్యత్తులో మనల్ని గొప్ప శిఖరాలకు చేరుస్తాయి!ఇవి చదవండి: సముద్రాన్నే సవాల్ చేసిన ఈతగాడు.. కేవలం వారికోసమే! -
మోయకూడని బరువు..
ఒక వ్యక్తి, ఒక ముని వద్దకు వచ్చాడు. ‘అయ్యా! ఈ భారాన్ని, భయాన్ని నేను భరించ లేకపోతున్నాను. నాకు విముక్తి ప్రసాదించండి’ అని ఆవేదన చెందాడు. ముని అతనితో ‘సరే, నీకు దారి చెబుతాను. దానికి ముందు, ఈ దారిలో ఉన్న రెండు పెద్ద రాళ్లను నీ రెండు చేతుల్లో పట్టుకుని, ఈ తోట చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసి రా’ అన్నాడు.అతను రెండు చేతుల్లో రాళ్లను ఎత్తుకుని నడవటం ప్రారంభించాడు. మొదటి చుట్టులోనే చేతులు వణికి పోయాయి. రెండో చుట్టులో నరాలు ఉబ్బిపోయాయి. మూడో చుట్టులో నొప్పితో అరిచాడు. నాలుగో చుట్టులో ‘గురుదేవా, నా వల్ల కావడం లేదు. చేతులు పడిపోతున్నాయి, నా ప్రాణం పోతోంది’ అన్నాడు. ముని ప్రశాంతంగా, ‘అయితే, ఆ రాళ్లను కింద పడేయ్’ అన్నాడు. అతను వెంటనే ఆ రెండు రాళ్లను కింద పడేశాడు. మరుక్షణమే, అతని చేతుల్లో భారం తగ్గి, శరీరమూ మనస్సూ తేలికపడినట్లు అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.‘రాళ్లను పట్టుకుని నొప్పితో అరిచిందీ నువ్వే, వాటిని కింద పడేసి ప్రశాంతతను పొందిందీ నువ్వే. రాళ్లు నిన్ను బలవంతం చేసి నీ చేతులకు అతుక్కున్నాయా? నువ్వే వాటిని పట్టుకున్నావు కదా. అలాగే నీ గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు కూడా. గడిచిపోయిన కాలం ఎప్పుడో ముగిసిపోయింది, రాబోయే కాలం ఇంకా రాలేదు. రాళ్లను కింద పడేయడానికి నీకు ఎవరి అనుమతి అవసరం లేదు కదా? అలాగే నిన్ను గాయపరిచే జ్ఞాపకాలను, అనవసరమైన భారాన్ని మనస్సు నుంచి వదిలేయడం నీ చేతుల్లోనే ఉంది’ అని వివరించాడు ముని.– యామిజాల జగదీశ్ -
మీ కష్టాలను సామాజిక మాధ్యమాలలో పంచుకుంటున్నారా?
కడుపులో ఉన్న కష్టాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో చాలామంది తమ వ్యక్తిగత బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దానివల్ల వారికి తాత్కాలిక ఉపశమనం లభించవచ్చేమో కానీ ముందు ముందు అనేక రకాల కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.చాణక్యుడి ప్రకారం, ఐదు రకాల వ్యక్తులకు మన సమస్యలకు చెప్పుకోవడం వల్ల లేనిపోని తలనొప్పులను కొని తెచ్చుకున్నట్టే! ఇంతకీ ఆ అయిదు రకాల వ్యక్తులెవరో తెలుసా? ఓర్వలేనివారు... నెగటివ్ ఆలోచనలు ఉన్నవారు, కుత్సిత, కుట్ర స్వభావులు, తెలివి హీనులు, దేనినీ దాటడం చేతకాని వాళ్లు.. వీరు అయిదుగురితో ఏ విషయాన్నీ పంచుకోకూడదు.మరి ఎవరితో పంచుకోవచ్చునంటారా... అక్కడికే వస్తున్నాం... సమస్యలు వచ్చినప్పుడు వాటిని గుండెల్లోనే దాచుకోవడం కూడా కష్టమే. అందుకే చాణక్యుడు ఒక పరిష్కారం చెప్పారు. మీకు అత్యంత నమ్మకమైన స్నేహితుడు, మీ గురువు లేదా మీ కుటుంబ సభ్యులతో మాత్రమే మీ మనసు విప్పి మాట్లాడండి. వీరు మాత్రమే మీకు సరైన దిశానిర్దేశం చేసి, సమస్య నుంచి గట్టెక్కించగలరు. -
లెమనేడింగ్ ఏడో రుచి.. కష్టాలను తట్టుకునే శక్తి!
మానవాళికి ప్రకృతి షడ్రుచులను ప్రసాదించింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏడో రుచిని కనిపెట్టారు. ఆ ఏడో రుచి పేరే... ‘లెమనేడింగ్’! నిజానికి ఇది రుచి కాదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సరదాగా తీసుకుని... చేదు అనుభవాల నుండి తీపి అనుభూతులను పొందే జీవన విధానం. ఈ స్వభావం మానవుల్లో మునుపు లేదని కాదు. దాన్నిప్పుడు పరిశోధకులు ఉందని రూఢీగా వెల్లడించారు. చెడు కాలంలోనూ చెదరని గుండెతో ఉండటమే లెమనేడింగ్.‘‘జీవితం మీకు నిమ్మకాయలను ప్రసాదిస్తే, నిమ్మరసమే చేసుకుని తాగండి’’ : 20వ శతాబ్దపు ప్రముఖ అమెరికన్ రచయిత, తత్త్వవేత్త, వ్యాపారవేత్త ఎల్బర్ట్ హబ్బర్డ్ చెప్పిన మాట ఇది. 1909లో ‘లిటరరీ డైజెస్ట్’ అనే పత్రికలో ఎల్బర్ట్ ఇలా రాశారు : ‘విధి తనకిచ్చిన నిమ్మకాయలను తీసుకుని, వాటితో నిమ్మరసం వ్యాపారం మొదలుపెట్టేవాడే అసలైన మేధావి’ – అని. అప్పట్నుంచీ ఈ మాట పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులలో వాడుకగా వినిపిస్తోంది. నిమ్మరసాన్ని ‘లెమనేడ్’ అంటారు. కనుక ఇది ‘లెమనేడ్ ఫిలాసఫీ’ అయింది. తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో లెమనేడ్ ఫిలాసఫీ మానవ జీవితానికి ప్రశాంతతను చేకూర్చే మాట నిజమే అని నిర్థారణ అవటం విశేషం!నవ్వుతూ బతకాలిరా..!జీవితాన్ని సరదాగా తీసుకునే అలవాటు వల్ల కష్టాలను తట్టుకునే శక్తి పెరుగుతుందట! కష్టాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు మనుషులు ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనం కోసం వారు కోవిడ్–19 సమయంలోని 503 మంది అమెరికన్ల ప్రవర్తన, వారి భావోద్వేగాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. జీవితాన్ని కాస్త సరదాగా, ప్రశాంతంగా తీసుకునే మనస్తత్వం ఉన్నవారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిజాయితీగా అంగీకరిస్తూనే, భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని తేలింది. వీరు తమకు ఎదురయ్యే సవాళ్లకు త్వరగా అలవాటు పడటమే కాకుండా, రోజువారీ పనులను ఆనందంగా, ఆ పనుల్లో లీనమై మరీ చేయగలిగారు. ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే శక్తిని (రెజిలియన్స్) కనబరచారు.ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చుకుంటూ, సృజనాత్మకంగా ఆలోచిస్తూ, అనుకూలమైన ఫలితాల కోసం ప్రయత్నించే ఈ అలవాటుకు శాస్త్రవేత్తలు ‘లెమనేడింగ్’ అని పేరు పెట్టారు. అంటే ‘చేదు’ లాంటి కష్టాలను కూడా నిమ్మరసంలా తీపిగా/సానుకూలంగా మార్చుకోవడం. దీనినే ఇంకోలా చెప్పాలంటే – జీవితంలో మనకు ఏది ఎదురైతే దానినే, దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వీకరించటం.చేదులోనే తియ్యని రుచి!జీవితాన్ని కాస్త సరదాగా తీసుకోవడం అంటే, మనం ఉన్న పరిస్థితిని తేలికగా తీసుకుంటున్నామని కాదు, ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతోందని అర్థం అని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో ప్రజల అనుభవాలను వీరు అధ్యయనం చేసినప్పుడు ఓ నిజం వెల్లడైంది. సరదా మనస్తత్వం ఉన్నవారు భవిష్యత్తు పట్ల సానుకూలంగా ఉంటూ, సమస్యలను చాలా చురుగ్గా, సృజనాత్మకంగా ఎదుర్కొన్నారు. అంటే, జీవితం వారికి చేదు వాస్తవాలను (నిమ్మకాయలు) ఇచ్చినప్పుడు, వారు వాటిని తీపి అనుభవాలుగా (నిమ్మరసం) మార్చుకున్నారు!దీనికి సంబంధించిన పరిశోధనా వ్యాసం ‘ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ’ పత్రిక తాజా సంచికలో అచ్చయింది. ‘‘మా పరిశోధనలో తేలిందేమిటంటే సరదా మనస్తత్త్వం, మానసిక స్థైర్యం అనేవి ‘లెమనేడింగ్’ అనే భావన ద్వారా ఒకదానికొకటి చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. కష్ట సమయాల్లో కూడా సానుకూల అనుభవాలను సృష్టించుకునే సామర్థ్యమే ఈ లెమనేడింగ్’’ అని వ్యాసకర్త, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ షియాంగ్యూ ‘షారన్’ షెన్ అంటున్నారు.‘‘పాండమిక్ (మహమ్మారి) సమయంలో సరదా మనస్తత్వం ఉన్నవారు, లేనివారు ఇద్దరూ ఒకే రకమైన భయాన్ని, ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉండే వ్యక్తులు ఆ కష్టతరమైన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పోగొట్టుకున్న వాటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు, అడ్డంకులను ఎదిగే అవకాశాలుగా చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఆ పరిస్థితికి ఎలా స్పందించాలన్న విషయాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు’’ అని షెన్ తెలిపారు.‘లెమనేడింగ్’ పరిశోధన వెనుకడాక్టర్ షెన్, ఆమె సహచర శాస్త్రవేత్తలు మనుషుల సరదా మనస్తత్త్వం (ప్లేఫుల్నెస్) అనేది కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆసక్తితో చూస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వారికి ఆ విషయాన్ని పెద్ద ఎత్తున పరిశోధించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇందుకోసం వారు అమెరికాలో నివసిస్తున్న 503 మంది వయోజనులను ఎంచుకుని, 2021 ఫిబ్రవరి (కోవిడ్ రెండవ వేవ్, వ్యాక్సిన్ ప్రారంభ సమయం) ఒక సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో పాల్గొన్నవారిని – కరోనా సోకుతుందేమో అనే భయం ఎంతవరకు ఉంది? పరిస్థితులు బాగుపడతాయని నమ్ముతున్నారా? వారికి ఇతరుల మద్దతు ఉందా? వారి భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు, వారు ఎంత సరదాగా ఉంటారు? ఎంత స్పాంటేనియస్‌గా (సహజంగా / వెంటనే) స్పందిస్తారు? ఆనందంగా ఉండటానికి ఎంతవరకు ప్రయత్నిస్తారు? అనే అంశాల ఆధారంగా వారి సరదా మనస్తత్వాన్ని కొలిచారు.ఈ వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు, సర్వేలో పాల్గొన్న వారిని వారి సరదా మనస్తత్వ స్థాయిని బట్టి నాలుగు భాగాలుగా విభజించారు. సరదా మనస్తత్వం అనేది మనుషుల ఆలోచనలను, ప్రవర్తనను ఎలా మారుస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అత్యంత సరదాగా ఉండే మొదటి 126 మందిని, అసలు సరదా లేని చివరి 126 మందితో పోల్చి చూశారు.సానుకూల అవకాశాలపై దృష్టిఅత్యంత సరదాగా ఉండే వ్యక్తులు భవిష్యత్తు పట్ల చాలా ఆశావాదంతో ఉన్నారని, వ్యాక్సిన్ విజయవంతంగా అందుబాటులోకి వస్తుందని; జీవితం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని నమ్మారని ఈ పరిశోధన వివరాలు స్పష్టం చేశాయి. అయితే దీని అర్థం వారు అప్పటి పరిస్థితిని పట్టించుకోకుండా, ఊహల్లో బతికారనడం కాదు!‘‘అతిగా ఆశావాదంతో ఉన్నవారు వాస్తవాలను గుర్తించకుండా ప్రతిదీ బాగుందని భ్రమిస్తుంటారు. కానీ మేము గమనించిన ‘స్పాట్లైట్’ (దృష్టి) ప్రభావం అలా కాకుండా చాలా స్పష్టంగా ఉంది’’ అని డాక్టర్ షెన్ వివరించారు. ‘‘సరదా మనస్తత్వం ఉన్నవారు కోవిడ్–19 ప్రమాదాలను తేలికగా తీసుకోలేదు, అలాగని రక్షణ చర్యల ప్రభావంపై అతిగా అంచనాలూ వేసుకోలేదు. వారు తమ ‘స్పాట్లైట్’ ని కేవలం సానుకూల మార్పులు, మెరుగవటానికి ఉండే అవకాశాలపైకి మళ్లించారు. చీకటి లాంటి కష్టసమయాల్లో కూడా ముందుకు సాగే మార్గాలను వెలుగులోకి తెచ్చుకున్నారు’’ అంటారు షెన్.అధిక సరదా మనస్తత్త్వం కలిగినవారు ఆనందాన్ని వెతుక్కోవడానికి ఎక్కువ ఉత్సాహపడ్డారు, సంకోచించకుండా ఆలోచించారు. ఇది అనిశ్చిత పరిస్థితుల్లో కూడా అనేక సానుకూల అవకాశాలను ఊహించడానికి వారికి సహాయపడింది. దీనికి తోడు వారి ప్రవర్తనలో ఉన్న సరళత, పనుల్లో వారు చూపించే శ్రద్ధ.. కష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని అందించాయి.చిన్న చిన్న మార్పులు చేసుకున్నారుపాండమిక్ సమయంలో ఇరు వర్గాల వ్యక్తులూ సమానంగానే ఒంటరితనాన్ని, భయాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉన్నవారు ఆ పరిస్థితులను తట్టుకోవడానికి సృజనాత్మక, క్రియాశీలక అడుగులు వేశారు. వారు వేరే ఏవో కొత్త వినోద కార్యక్రమాలలో పాల్గొనలేదు, కానీ తాము చేసే పనుల్లోనే సమయాలను మార్చుకోవడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం లేదా చురుగ్గా ఉండటానికి కొత్త మార్గాలు వెతకడం ద్వారా పరిస్థితులకు అనుగుణంగా మారారు. వారు తమ రోజువారీ జీవితంలో మరింత చురుగ్గా, ఆనందంగా, లీనమై గడిపారు.‘‘మా పరిశోధన సరదా మనస్తత్త్వాన్ని కొలవడంపైనే దృష్టి పెట్టినప్పటికీ, ఈ గుణాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మార్గాలను పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, మీకు ఆనందాన్నిచ్చే పనుల్లో పాల్గొనండి, కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని నవ్వించే వ్యక్తులతో సమయం గడపండి. సరదాగా ఉండటానికి ఆటలే ఆడాల్సిన పనిలేదు. మన రోజువారీ క్షణాల్లో కాస్త ఆనందం, స్వేచ్ఛ, అనుకూలమైన ఆలోచనా విధానాన్ని తెచ్చుకుంటే చాలు’’ అని షెన్ చెబుతున్నారు. జీవితంలో సరదాలు ఉండాలి‘‘ముఖ్యంగా కష్టకాలంలో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరదా మనస్తత్వం అనేది చాలా కీలకమైనది. కానీ చాలామంది దీని ప్రాముఖ్యతను గుర్తించరు’’ అని అంటారు షెన్. ‘‘సరదాగా ఉండే వ్యక్తులు.. కష్టాలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారో అర్థం చేసుకోవడం వల్ల, ఇతరులు కూడా ఒత్తిడిని, అనిశ్చితిని జయించే వ్యూహాలను రూపొందించవచ్చు. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రపంచ స్థాయి సవాళ్లకు వాస్తవిక అంచనా, సృజనాత్మకమైన సర్దుబాటు రెండూ అవసరం కాబట్టి, ఈ విషయం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పరిశోధన ఫలితాలను ప్రతి పరిస్థితికీ లేదా అందరికీ ఒకేలా వర్తింపజేయలేమని షెన్, ఆమె సహచరులు హెచ్చరిస్తున్నారు. వేర్వేరు పరిస్థితుల్లో ఈ సరదా మనస్తత్త్వం వేర్వేరు వ్యక్తులపై భిన్నమైన ప్రభావం చూపవచ్చు. అలాగే, అత్యంత సరదాగా ఉండేవారికి, లేనివారికి మధ్య ఉన్న తేడాలన్నీ కేవలం ఈ ఒక్క గుణం వల్లే వచ్చాయని చెప్పలేము. ‘‘మనుషుల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను మేము గుర్తించినప్పటికీ, రోజువారీ సంఘటనలకు వారు ఎలా స్పందిస్తారనే దానిపై ప్రభావం చూపే ఈ సరదా మనస్తత్త్వం ఇతర పరిస్థితులకు కూడా (రోజువారీ కానివీ, వివిధ రంగాలకు చెందినవీ) వర్తిస్తుందని చెప్పలేం అని షెన్ పేర్కొన్నారు. ‘‘ఈ ‘సరదా ఆలోచనా విధానం’ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో జీవితంలోని ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు జరపవలసి ఉంది’’ అని షెన్ అంటున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్- షియాంగ్యూ ‘షారన్’ షెన్, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ -
కూలీ నుంచి రాజకొలువుకు... కారణం ఇదే!
కోసల రాజ్యంలోని ముకుందపురం గ్రామంలో కేశవుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బతికేవాడు. పగలంతా కూలి పనులు చేసుకుంటూ రాత్రి ఊరి గుడి దగ్గర అరుగు మీద పడుకునేవాడు. చిన్ననాటి నుంచి గుడి పూజారి దగ్గర ధర్మబద్ధంగా జీవితం ఎలా గడపాలో నేర్చుకున్నాడు. తను ఒక చోట కూలీ పనికి ఒప్పుకుంటే మరొకరు వచ్చి ఎక్కువ కూలీ ఇస్తామన్నా ససేమిరా ఒప్పుకునే వాడు కాదు. ఊరి వాళ్ళు, తోటి కూలీలు ఇతని నిజాయతీని చూసి నవ్వుకునే వాళ్ళు. కేశవుడు మాత్రం ధర్మం, నిజాయతీ ఎప్పటికైనా గెలుస్తాయని నమ్మేవాడు.ఒకరోజు కోసల రాజు విక్రమసేనుని ఉద్యానవనంలో తోటపని చేయడానికి ముకుందపురం నుంచి కూలీలతో పాటు కేశవుడు కూడా వెళ్ళాడు. కేశవుడు తోటలో పని చేస్తున్నప్పుడు ఒక రంగురాయి దొరకటంతో దాని గురించి ఎవరికీ చెప్పకుండా బొడ్లో జాగ్రత్తగా దాచుకున్నాడు. సాయంత్రం వరకు తోటలో పనిచేసి, కూలి డబ్బులు తీసుకున్నాడు. ఇంటికి బయలుదేరుతూ, మెల్లగా రాజప్రాసాదంవైపు అడుగులు వేశాడు. సింహద్వారం వద్ద భటులతో తను రాజుగారిని కలవాలి అని చెప్పాడు. విషయం ఏమిటని భటులు ప్రశ్నిస్తే విషయం కేవలం రాజుగారికి మాత్రమే చెబుతాను అనటంతో ఒక భటుడు అంతఃపురంలోకి వెళ్ళి వచ్చి, ‘‘రేపు ఉదయం వరకు రాజుగారిని కలవటం కుదరదు, పొద్దున్నే రాపో’’ అని చెప్పారు.కేశవుడు చేసేది లేక ఊరికి వెళ్లకుండా, సింహద్వారం పక్కగా ఒక చోట ఒదిగి కూర్చొని రాత్రంతా అక్కడే గడిపాడు. అలసిపోయి అక్కడే పడుకున్న కేశవుడిని ఉదయాన్నే ఒక భటుడు నిద్రలేపి, ‘‘రాజుగారు పిలుస్తున్నారు’’ అని చెప్పటంతో భయం భయంగా కోటలోకి అడుగు పెట్టాడు. కోసల రాజు విక్రమసేనుడు కేశవుడిని చూసి ‘‘నన్ను ఎందుకు కలవాలనుకున్నావు?’’ అని అడిగాడు. కేశవుడు రాజుగారికి నమస్కరించి, ‘‘మహారాజా! నిన్న తమరి తోటలో పనిచేస్తుంటే, నాకు ఈ రంగురాయి దొరికింది. తమరి వస్తువు తమరికే అప్పగించి పోదామని వచ్చాను’’ అని చెప్పి, తన బొడ్లో జాగ్రత్తగా దాచుకున్న రంగురాయిని విక్రమసేనుడికి అప్పగించాడు. రంగురాయిని తీసుకున్న విక్రమసేనుడు ‘‘దీని విలువ ఎంతో నీకు తెలుసునా?’’ అని అడిగాడు. ‘‘నాది కాని వస్తువు విలువ ఎంత అయితే నాకెందుకు మహారాజా!’’ అన్నాడు కేశవుడు వినయంగా.ఇంతలో అక్కడకు వచ్చిన మహామంత్రి సూరవర్మ ‘‘ప్రభూ! మన ఖజానాలో పని చేయటానికి నిజాయతీ గల వ్యక్తి కావాలన్నారు కదా, అందుకు ఇతనే సరైన వ్యక్తి. నిజాయతీ గల వ్యక్తి కోసం వెదుకులాటలో భాగంగా తమరి తోటలో చాలా రంగు రాళ్లని నేనే కావాలని భూమిలో పాతించి, కూలీలను అందులో పనికి పురమాయించి, దూరం నుంచి గమనిస్తూనే వున్నాను. ఇతనితో పాటు మరికొందరికి ఈ రంగురాళ్ళు దొరికాయి.ఇవి విలువ చేయని రంగురాళ్ళు అని తెలియక మిగతా అందరూ లోలోపల సంతోషపడుతూ వాటిని తీసుకుని వెళ్లిపోయారు. కాని, ఇతను మాత్రం ఆశకు లోను కాకుండా నిజాయతీగా ఈ రంగురాయిని తమకు అప్పగించడానికి వచ్చాడు. నిన్న రాత్రి కూడా నేను కావాలనే ఇతనికి తమ దర్శన భాగ్యం కలిగించలేదు. ఆ రంగురాయి ఒక రాత్రంతా ఇతని దగ్గర వుంటే ఇతని మనసు ఏమైనా చాంచల్యానికి లోనవుతుందేమో అనుకున్నాను. అయినా, ఇతను తన నిజాయతీని కోల్పోలేదు’’ అని చెప్పాడు.‘‘మహామంత్రీ! మీరు చెప్పింది నిజమే, తక్షణమే ఇతనిని మన ఖజానా ఉద్యోగిగా నియమించండి. వెంటనే ఇతని నివాసానికి రాజోద్యోగుల భవంతిని ఒకటి సిద్ధం చేయండి’’ అని చెప్పి విక్రమసేన మహారాజు లోనికి వెళ్లిపోయాడు.ముకుందపురం చేరుకున్న కేశవుడు గుడి పూజారిని కలుసుకొని, తనకు వచ్చిన కొలువు గురించి చెప్పి, పాదాలకు నమస్కరించాడు. ‘‘నీ నిజాయతీనే నిన్ను కాపాడింది. లే నాయనా!’’ అని కేశవుడిని లేవదీసి, ఆలింగనం చేసుకున్నాడు పూజారి.- ఎన్.వి.శ్రీధర శర్మ -
ప్లీజ్ రూపాన్ని చూసి అంచనా వేయొద్దు..!: అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ ఘటన నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. తప్పు చేయడం సహజమే అయినా..దాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం తోపాటు తనలా చేయొద్దని హితవు పలకడానికి చాలా ధైర్యం కావాలి. ఇక్కడ నటుడు అనుపమ్ సరిగ్గా అలాంటి పనే చేశారు అసలేం జరిగిందంటే..గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో ఓ అధిక బరువు ఉన్న వ్యక్తితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ..అతడితో తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు అనుపమ్ ఖేర్. ఆ విమానంలో డేవిడ్ అనే వ్యక్తి పెద్ద మొత్తంలో చాక్లెట్లు, స్వీట్లు పట్టుకుని రావడం చూస్తారు. నిజానికి డేవిడ్ విమానంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ప్రయాణికుల అందరి చూపులు అతని మీదే ఉంటాయి. నటుడు అనుపమ్ కూడా పక్క వ్యక్తివైపు చూస్తూ అతను అంతలా స్వీట్లు, చాక్లెట్లు తినకూడదని అంటాడు. అది కూడా కేవలం ఒక శ్రేయోభిలాషిలానే చెప్పినట్లు తెలిపారు ఖేర్. దానికి ఆ వ్యక్తి నవ్వి..బహుశా అందుకే అతడు అంతలా కనిపిస్తున్నాడేమో అని సమాధానమిచ్చారని రాసుకొచ్చారు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో. అయితే కాసేపటి తర్వాత డేవిడ్ తిరిగి వచ్చి ఆ స్వీట్లన్నింటిని తీసుకుని క్యాబిన్ సిబ్బందికి ఇచ్చాడు. అది చూసి తాను ఆశ్చర్యపోయానంటూ రాసుకొచ్చారు ఖేర్. వెంటనే ఆ తర్వాత తాను ఆ చాక్లెట్లన్నీ చూసి మీరు తింటారనుకున్నా, అందుకే ఇంత అధిక బరువు ఉన్నారని అనుకున్నా అంటూ అసలు విషయం చెప్పాడు ఖేర్. అందుకు డేవివ్ నవ్వి, తనకు అనారోగ్య సమస్య ఉందని, అందువల్లే ఇలా లావుగా కనిపిస్తున్నట్లు తెలిపాడు. తాను గతంలో ఎయిర్‌లైన్‌లో పనిచేశానని, ప్రయాణికులకు సేవ చేయడానికి క్యాబిన్ సిబ్బంది ఎంతలా కష్టపడతారో తనకు బాగా తెలుసునని అన్నారు. అందుకే వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇలా ప్రయాణించిన ప్రతిసారీ వారికి ఏదైన తీపి పదార్థాన్ని ఇవ్వడం ఒక అలవాటుగా మార్చుకున్నానని అన్నాడు. ఒక్కసారిగా ఖేర్ ఇతడు ఎంత గొప్ప మనిషి, నాకెంత గొప్ప పాఠం నేర్పాడు అని ఆశ్చర్యపోయానంటూ ఆ సంఘటన గురించి వివరించారు ఖేర్. ఈ ఘటన ఇతరుల రూపాన్ని బట్టి ఒక అంచనాకు రావడం ఎంత ప్రమాదకరమైందో తెలియజేసిందన్నారు. ఒక్కసారిగా రూపంబట్టి చాలా సులభంగా అంచనా వేసి, కథలు అల్లేస్తుంటాం..వాళ్లు ఆ మార్గంలో పయనించడానికి దాని వెనుకున్న కారణం, వారి జీవితాల గురించి ఏమి తెలియకుండానే తేలిగ్గా అంచనాకు వచ్చేస్తాం అన్నారు. దయచేసి తనలా అలా చేయొద్దు అని చెబుతూ డేవిడ్‌తో ఒక సెల్ఫీ కూడా దిగినట్లు తెలిపారు. అలాగే అతడికి ఇంత మంచి జీవిత పాఠం నేర్పినందుకు ధన్యవాదాలు చెప్పినట్లు రాసుకొచ్చారు పోస్ట్‌లో. అయితే నెటిజన్లు ఖేర్ మీరు చాలాగ్రేట్ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, అలాగే బాహ్య రూపం బట్టి అంచనాకు రాకూడదనే లోతైన జీవిత పాఠం ఇది అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఘటన "డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్" అనే సామెతకు అసలైన అర్థం కదూ..!.THANK YOU DAVID FOR THE LESSON! 🥹❤️Life is full of lessons. Last week, on a flight from Goa to Mumbai, I learned one.In the picture is David.When David boarded the flight, many people looked at him because he was overweight. He came and sat across the aisle from me. In the… pic.twitter.com/Yw7rjm4qcu— Anupam Kher (@AnupamPKher) June 11, 2026 (చదవండి: పిల్లలను మానసికంగా స్ట్రాంగ్‌గా మార్చే ‘10-10-10’ రూల్..!) -
ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్‌గా 94 ఏళ్ల వ్యాపారి కథ!
నేటి ఉరుకులు పరుగుల జీవితాల్లో నిజాయితీ, దయ, నిరాడంబరత అన్నవి అరుదైనవిగా మారిపోతున్నాయి. ఎంతసేపు పెద్ద అవకాశాలు, క్షణాల్లో విజయం, తక్షణ సంతృప్తి తదితరాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. రోజువారీ జీవితంలో ఉండాల్సిన కరుణ, సహనం, వినయం, మానవ సంబధాలు ప్రాముఖ్యతను విస్మరిస్తున్నారో లేక మర్చిపోతున్నారో తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇంకా కొద్దరు ఆ విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా ఆచరిస్తూ అర్థవంతంగా, స్ఫూర్తిగా బతుకుతున్నవారు కూడా ఉన్నారు. ఈ 94 ఏళ్ల తాతగారు ఆ కోవకు చెందిన వ్యక్తే. అతడితో మాటలు కలిపితే మనసుకు హత్తుకునే ఎన్నో తియ్యటి జీవిత పాఠాలు తెలుసుకోవచ్చట. ఆ తాతగారితో కాసేపు సరదాగా సంభాషించిన వీడియోని కోల్‌కతాకు చెందిన డిజిటల్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న తాతగారి పేరు సాదిక్పాల్. ఆయన ముంబైలోని ఖార్ రైల్వే స్టేషన్ ఎదురుగా 80 ఏళ్లకు పైగా చెరుకురసం దుకాణాన్ని నడుపుతున్నారట. అది ఆయన తండ్రి ప్రారంభించిన దుకాణమట. ఆ తర్వాత ఆయన దాన్ని మరింతగా అభివృద్ధి చేశారట. ప్రస్తుతం ఆ తాత గారు , ఆయన కుమారుడు ఆ దుకాణాన్ని నడుపుతున్నారు. ఆయన ఆ దుకాణ్నా నడిపేటప్పటికీ రెండో తరగతి చదువుతున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ వ్యాపంలో తన అపార అనుభవాన్ని వివరిస్తూ.. ఎన్నో జీవిత సంఘటనల తోపాటు గొప్ప జీవిత పాఠాలను కూడా చెప్పుకొచ్చారట. ఆయన దృఢ సంకల్పంతో ఉండటం, ధైర్యంగా ఉండటం, కష్టపడి పనిచయడం వంటి ప్రాముఖ్యతలు గురించి నొక్కి చెప్పారు. అలాగే నిజాయితీగా, సద్గుణవంతుడిగా ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు అందుకోగలమో కళ్లకు కట్టినట్లు వివరించాడు. ఎవ్వరూ మిమ్మల్ని, మీ నిజాయితీని గుర్తించకపోయినా..మోసం చేసినా సరే..ఎవ్వరినీ వంచించొద్దు అని అమూల్యమైన సలహా ఇచ్చారు. నిజానికి ఆ క్షణంలో మన నిజాయితీ, ఆత్మవిశ్వాసాన్ని గుర్తించి గౌరవించకపోవచ్చేమో గానీ, ఎప్పటికీ మాత్రం కాదని అంటున్నాడు. మన లక్ష్యాలను సాధించడానికి, కలలను నెరవేర్చుకోవడానికి ఒకే ఒక్క మార్గం కష్టపడటం అని, అందరూ మంచిగా కష్టపడి ప్రయోజకులుగా మారండని కోరుతూ తన సంభాషణను ముగించాడు వృద్ధుడు సాదికపాల్. ఈ వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకోవడమే గాక, ఆయన సలహా అద్భతంగా ఉందని ప్రశంసించారు. అలాగే ఆయనకున్న అభిరుచి, విలువలు నిజంగా ప్రశంసనీయం అంటూ పొగడ్తల జల్లు కురిపించారు. (చదవండి: ఒకే ఒక్కడు' సాధించిన ఘనత! జస్ట్ ఒక్కరోజులో..) -
ఆటో పాఠాలూ... జీవిత సత్యాలు!!
రాంబాబుగాడి ఇంటికి చేరే సమయానికి వాడు ఆటో ఫొటోకు దండేసి, ఊదుకడ్డీలు వెలిగించి ప్రార్థన చేస్తున్నాడు. విచిత్రం... పైగా అది వెనక్కు తిరిగి ఉన్న ఆటో!! వాడి సంగతి తెలిసిందేగా. ఏదైనా ఎక్స్ట్రీమ్. అందుకే మొదట పెద్దగా పట్టించుకోలేదుగానీ... చివరాఖరికి ఆగబట్టుకోలేక అడిగేశా... ‘ఏంట్రా ఇదీ?’ అని. ‘‘మహా మహా వ్యక్తిత్వ వికాస నిపుణులకు లక్షలాది రూపాయలిచ్చీ, పెద్ద పెద్ద హోటళ్లలో ఖరీదైన రూములిప్పించీ, భారీ భారీ కాన్ఫరెన్సు హాళ్లు బుక్ చేసీ వాళ్ల చేత పనికిమాలిన పర్సనాలిటీ డెవలప్మెంటు స్పీచులెన్నో ఇప్పించుకుంటారుగానీ... పైసా తీసుకోకుండా జీవితపాఠాలెన్నో చెప్పేదేరా ఆటో... మన మంచి ఆటో’’ అంటూ కొన్ని లైఫ్ లెసన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. అవీ... ‘‘నన్ను చూసి ఏడ్వకురా... అప్పు చేసి కొన్నా’’ → అంటే ఏమిటీ? ఏడుస్తూ ఉండటం వల్ల లాభముండదు. హాయిగా నవ్వుతూ బతకాలి. అప్పుడే సంతోషం. ఎవరినీ చూసి అసూయ పడకు. వీలైతే జాలి పడు. కడుపుకు తిన్నా తినకున్నా వాడు కడుపు కట్టుకుని మరీ ఈఎమ్ఐలు కట్టాలి కదా.‘‘స్టీరింగు తిరగనీ, చక్రాలూ తిరగనీ, కళ్లు మాత్రం తిరగనీకు’’→ జీవితంలో కొన్ని తిరగడం వల్ల ప్రయోజనం ఉంటుందనీ... మరికొన్ని తిరగకపోతేనే మంచిదనేదే ఇక్కడ సూక్తి! మొదటి రెండూ తిరిగితే గమ్యం చేరగలం. కళ్లు తిరిగితే ఆ డ్రైవర్‌కే కాదు... సదరు సెవన్సీటరు ఆటోలోని అందరికీ ముప్పు. ఇక్కడ ఇంకో సూక్తీ దాగుంది. రోడ్డు మీద నుంచి నీ కళ్లను పక్కకు తిప్పకూ... తిరగనీకు! అలా తిరిగితే యాక్సిడెంటు కావచ్చు. అది బోలెడంత ప్రమాదం. ‘‘రోడ్ కింగ్’’ → ఇదెన్ని లారీల మీదా ట్రక్కుల మీదా ఉంటుందో తెలుసా! రెండు ముక్కల్లోనే ఎంత లైఫ్ ఫిలాసఫీ!! నువ్వెక్కడ బతికినా సరే రాజాల బతుకు. ఇంట్లోనూ రాజే... రోడ్డెక్కినా రాజులాగే. ఇలా బతికేవాడు జీవితం పట్ల ఏ ఫిర్యాదూ లేకుండా హాయిగా మొనగాడి బతుకు బతుకుతాడని అర్థం.‘‘పడకు పడకు వెంట పడకు... కీప్ డిస్టాన్స్’’ → ఎన్ని ఆటలో మీదా, మరెన్ని ట్రక్కులూ, లారీల వెనకాల రాసుంటుందీ కొటేషన్! వాహనం నడిపేటప్పుడూ ఎవ్వరి వెనకా పడొద్దు. యాక్సిడెంట్లు కావచ్చు. ఇక జీవితం విషయానికి వస్తే ఏ అమ్మాయి వెనకా పడకు. సామాన్యుల నుంచి సహాయ మంత్రుల కొడుకుల వరకూ వర్తించేదీ కొటేషన్. ఇది లాస్ట్‌లో ఎందుకు చెబుతున్నానంటే... ఈ కొటేషన్ పాటించి ఉంటే ఇవ్వాళ మహామహా మాన్యులూ మంత్రుల కుమారుల దగ్గర్నుంచి, సాధారణ సామాన్యుల కొడుకుల వరకూ అందరూ ఇళ్లల్లోనే... కిలకిల నవ్వుతూ కలకల తుళ్లుతూ కళ్లముందే హాయిగా ఉంటారని చెప్పేందుకే ఈ సూక్తి. లిస్టులో లాస్ట్దే అయినా బట్ నాట్ లీస్ట్దీ కొటేషన్. తమ మీటర్లను గిర్రున తిప్పేందుకు దూరం దారుల్లో తీసుకెళ్లి తిప్పుతారనీ, మీటర్ల మీద ఎడాపెడా ఎగస్ట్రాలడుగుతారనీ... వాళ్లను ‘ఆటో’వికులంటూ ఆడిపోసుకుంటాంగానీ... ఇంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా వాటిని గమనించని మనమే ఆటవికులమని తెలియడం లేదా. లోక విద్యార్థుల కోసం తన వీపునే బ్లాక్‌బోర్డు చేసుకుని జ్ఞానమందించేదే ఆటో! అందుకే జై ఆటో. జైజై ఆటో! అందమైన ఆటో కొటేషన్లు రాయించే అందరికీ ఇవే నా జేజేలంటూ లైఫ్లెసన్ ముగించాడు మా రాంబాబుగాడు.– యాసీన్ -
ఇతరుల ఆకాంక్షలకు బందీ కావొద్దు!
‘మీ సమయం పరిమితం. కాబట్టి వేరొకరి జీవితం కోసం దాన్ని వృథా చేయవద్దు’ అని స్టీవ్ జాబ్స్ చెప్పిన మాట నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో మరింత ఎక్కువగా వినిపిస్తోంది. సమాజం నిర్ణయించిన బాటలోనే నడవాలా? లేక మనకంటూ ఒక కొత్త పంథాను నిర్మించుకోవాలా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టీవ్‌జాబ్స్ తత్వాన్ని విశ్లేషిస్తూ ప్రత్యేక కథనం.పరిమిత సమయం.. అపరిమిత లక్ష్యాలుజీవితం అనేది ఒకసారి మాత్రమే లభించే అవకాశం. స్టీవ్ జాబ్స్ తన కోట్లో ‘సమయం పరిమితం’ అని నొక్కి చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే.. మరణం అనేది తథ్యం, కాబట్టి ఉన్న కొద్ది కాలంలోనే మనం ఎంచుకున్న రంగంలో ప్రత్యేకంగా నిలవాలి. కెరీర్ ఎంపికల నుంచి వ్యక్తిగత నిర్ణయాల వరకు మనకు నచ్చని పనులను కేవలం ఇతరుల కోసం చేస్తూ పోతే మన అంతరాత్మను చంపుకున్నట్లే.మన దేశంలో ముఖ్యంగా విద్య, వృత్తి పరమైన విషయాల్లో కుటుంబం, సమాజం ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. ఫలానా చదువే చదవాలి, ఫలానా ఉద్యోగమే చేయాలి అనే నిబంధనల మధ్య వ్యక్తిత్వం మరుగున పడిపోతోంది. స్టీవ్ జాబ్స్ ఈ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. ‘ఇతరుల సలహాలను వినడం తప్పు కాదు, కానీ వాటిని విమర్శనాత్మకంగా అంచనా వేయాలి. సమాజం నిర్ణయించిన విజయ సూత్రాలను ప్రశ్నించినప్పుడే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి’ అన్నారు.స్వీయ అవగాహన.. విజయానికి తొలిమెట్టుమన బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? మనకు అసలు ఏం కావాలి? అనే విషయాలపై స్పష్టత లేనప్పుడు ఇతరుల అభిప్రాయాలే మన నిర్ణయాలను శాసిస్తాయి. స్వీయ అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే బాహ్య ఒత్తిళ్లను తట్టుకొని నిలబడగలడు. సోషల్ మీడియా యుగంలో తోటివారిని పోల్చుకొని బతుకుతున్న నేటి యువతకు తమను తాము తెలుసుకోవడం అత్యంత అవసరం.స్టీవ్ జాబ్స్ జీవితం ఆచరణాత్మక పాఠంజాబ్స్ జీవితమే ఆయన సిద్ధాంతానికి నిదర్శనం. రీడ్ కాలేజీ నుంచి డ్రాపౌట్ అయినప్పటికీ కాలిగ్రఫీ వంటి కోర్సులను నేర్చుకోవడం ద్వారా డిజైనింగ్‌లో కొత్త ఒరవడిని సృష్టించారు. యాపిల్ సంస్థ నుంచి బహిష్కరణకు గురైనా నీరసించకుండా ‘నెక్స్ట్’, ‘పిక్సర్’ వంటి సంస్థలను స్థాపించి మళ్లీ శిఖరాగ్రానికి చేరారు.నిర్ణయాధికారానికి కావాల్సిన నైపుణ్యాలుభావోద్వేగాలకు లోనుకాకుండా వాస్తవాలను విశ్లేషించడం.పరిస్థితులు మారినప్పుడు మనల్ని మనం మలచుకోవడం.వైఫల్యాలు ఎదురైనప్పుడు విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగడం.‘డిజైన్ అంటే కేవలం అది ఎలా కనిపిస్తుంది అనేదే కాదు, అది ఎలా పనిచేస్తుంది అనేదే ముఖ్యం’ అని జాబ్స్ అన్నట్లుగా.. మన జీవితం కూడా బయటకు ఎలా కనిపిస్తుందనే దానికంటే, లోపల మనమెంత తృప్తిగా ఉన్నామనేదే ముఖ్యం. నిరంతరం నేర్చుకుంటూ, మనకంటూ ఒక సొంత మార్గాన్ని ఏర్పరచుకోవడమే స్టీవ్ జాబ్స్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!
బాలీవుడ్ నటి, రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ తన విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. ఫ్యాషన్ పరంగానూ ఆమెకు సాటిలేరవ్వరూ. రెట్రో స్టైల్‌తో అందర్నీ మెప్పించి..అందరూ ఆ బాటలో పయనించేలా స్ఫూర్తిగా నిలిచిందామె. అలాంటి ఆలియా ఓ మీడియా ఇంటర్వ్యూలో తనకెంతో ఇష్టమైన పిల్లుల నుంచి గొప్ప జీవిత పాఠాలు నేర్చుకున్నానంటూ పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఆలియాకు తన పెంపుడు జంతువులు ఎడ్వర్డ్, జునిపర్లంటే ఎంతో ఇష్టమో తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తరుచుగా షేర్ చేస్తుంటుంది ఆలియా. అవి తనకు అద్భుతమైన జీవిత పాఠాలు నేర్పించాయంటూ వాటి గురించి చెప్పుకొచ్చింది ఆ ఇంటర్వ్యూలో. అవేంటంటే..మిమ్మల్ని మీరు సీరియస్‌గా తీసుకోకండి, అలాగే ఎవరి నుంచి ఎలాంటి అంచనాలు పెట్టుకోకండి. ఎంత తక్కువగా ఆశ పెట్టుకుంటే అంత తక్కువగానే నిరాశే చెందుతామని అంటోందామె. హాయిగా నిద్రపోండి. జీవితం చాలా అందమైనది అంటూ ఆమె తన పెంపుడు పిల్లుల నుంచి నేర్చుకున్న వాటి గురించి వివరించింది. అలాగే తన చిన్నతనాన్ని ఉద్దేశించి ఒక హృదయపూర్వక లేఖను పంచుకుంది. బాల్య స్వభావం ప్రకారం..చిన్నారులు ఎక్కువ కలలు కంటుంటారు. ఆ లేఖలో దాన్నే ప్రోత్సహిస్తూ..చిన్నా నువ్వు ఎప్పుడు కలలు కంటూనే ఉంటావని తెలుసు. దయచేసి అలా చేయడం ఆపకండి. మీలోని కలలు కనేవాడే మీ సూపర్ పవర్ అంటూ చెప్పిన మాట కూడా తనకు అద్భుతంగా పనిచేసిందని అంటోంది ఆలియా. ఇక, ఆలియా తన కుమార్తె రాహా గురించి మాట్లాడుతూ..మనకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన కూమార్తె పుడుతుంది. మన జీవితం ఊహించలేని విధంగా మారుతుంది. పైగా ఆమె న్యాయవాది ఆకావాలని అనుకుంటుంది కూడా అని నవ్వుతూ అన్నారామె. కాగా, ఏప్రిల్ 14, 2022న పెళ్లి బంధంతో ఆలియా, రణబీర్ కపూర్లు ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) (చదవండి: శెభాష్ బామ్మ..! ఆ ధైర్యమే అందరికీ కావాల్సింది..) -
ఆ ఆటో డ్రైవర్ ఆంగ్ల భాష వాక్పటిమకు.. ఆస్ట్రేలియన్ డ్రైవర్ ఫిదా..!
సాధారణ మనుషుల ఉండే కొందరూ దగ్గర అపార జ్ఞానం ఉంటుంది. వాళ్లని పలకిరిస్తే లేదా మాట కలిపితే గానీ మనకు తెలియదు. మంచి మనసు అనేది విద్య, డబ్బు, హోదా వల్ల వస్తుందనుకుంటే పొరపాటే అని ఆయా వ్యక్తులు తారసపడగానే అర్థమవుతుంది. అలాంటి అపురూపమైన భావోద్వేగ ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..విదేశీ పర్యాటుకులు మన సుందర నగరాలకు ఆతిధ్యానికి వస్తుంటారనే విషయం తెలిసిందే. అలానే ఆస్ట్రేలియాకు చెందిన విల్ స్ట్రోల్స్ మన భారతదేశంలోని నగరాలను వీక్షిస్తూ..ఓ ఆటోలో ప్రయాణించాడు. ఆ ఆటో డ్రైవర్‌తో కాసేపు మాటలు కలిపాడు. ఆ డ్రైవర్ అతడిని చూసి మీరు ఆస్ట్రేలియన్ నుంచి వచ్చారా..?అని ఆంగ్లంలో చాలా చక్కగా ప్రశ్నిస్తాడు. అందుకు విల్ అవునని సమాధానం ఇవ్వడం తోపాటు అంతలా సులభంగా అతడిని ఆస్ట్రేలియన్ అని ఎలా గెస్ చేయగలిగాడో కూడా వివరిస్తాడు. తాను ఆస్ట్రేలియాకు వెళ్లానని, అక్కడ కొన్నాళ్లు చెఫ్‌గా పనిచేశానని అంటాడు. వెంటనే విల్ అయితే మీరు ప్రస్తుతం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారా అని ప్రశ్నించగా.. అందుకు డ్రైవర్ భలే అద్భుతంగా మాట్లాడాడు. అవి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన గొప్ప జీవిత పాఠాలు. ఇంతకీ ఆ డ్రేవర్ ఏమన్నాడంటే..తాను ఆనందంగా జీవించే వ్యక్తినని సగర్వంగా చెప్పాడు. తాను డబ్బు మనిషిని కానని, జీవితానికి డబ్బు అవసరమే కానీ, డబ్బే జీవితం కాదు. అని చాలా చక్కగా చెబుతాడు. అతడి ఆంగ్ల వాక్ చాతుర్యానికి సదరు ఆస్ట్రేలియన్ విల్ అబ్బురపడతాడు. అంతేగాదు మంచి చాయ్ తాగుతారా తీసుకెళ్తాను అంటూ మంచి ఆఫర్ కూడా ఇస్తాడు ఆ డ్రైవర్. విల్ అతడి సహృదయతకు ఇప్రెస్ అయ్యి అందుకు అంగీకరిస్తాడు. వెంటనే డ్రైవర్ తనకు ఎంతో ఇష్టమైన చాయ్ కేఫ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ టీ సర్వ్ చేసే వ్యక్తి కూడా చక్కగా ఆంగ్లంలో మాట్లాడి విల్ని ఆశ్చర్యపరుస్తాడు. ఇక ఆ టీ చెఫ్ కూడా తాను స్పెషల్‌గా తయారు చేసి టీ అని కాసింత గర్వంగా చెబుతాడు. ఆ తర్వాత ఆటో డ్రేవర్ ఆ ఆస్ట్రేలియన్ నివాసి విల్ని తన గమ్యస్థానానికి చేర్చగానే ..అతడు ఇంతలా తనకోసం కష్టపడినందుకు ఈ డబ్బులు తీసుకోవాల్సిందే అంటూ చేతిలో కొంత మొత్తం పెట్టి మరి వెళ్లిపోతాడు.అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయగానే..అంతా ఆ ఆటో డ్రైవర్ ఆంగ్ల భాష వాక్పటిమ అదుర్స్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడమే కాదు ఇవాల్టి గొప్ప జీవిత పాఠం.."జీవితానికి డబ్బు అవసరం అంతే డబ్బే జీవితం కాదు". అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by India Flipside (@india_flipside) (చదవండి: భాగ్యనగరంలో లెర్న్ విత్ భీమ్..!) -
6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!
టెక్ప్రపంచంలో చాట్ జీపీటీ ఒక విప్లవం. విద్యార్థులనుంచి మేధావుల దాకా ఏఐ ఒక షార్ట్‌కట్‌గా మారిపోయింది. తాజాగా బరువు తగ్గే విషయంలో కూడా ఇదొక గేమ్ చేంజర్లా మారుతోంది. తాజాగా ఒక యూట్యూబర్ AI సహాయంతో అధిక బరువును విజయవంతంగా తగ్గించుకోవడంతోపాటు, ఆరోగ్యాన్ని ఎలా పొందాడో, జీవితంలో గొప్ప పాఠాన్ని ఏలా నేర్చుకున్నాడో షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ChatGPT ప్రోగ్రామ్ ద్వారా ‘మై లైఫ్ బై AI’ అంటూ తన ఆరు నెలల సుదీర్ఘ ప్రయాణాన్ని వెల్లడించాడు. చాట్‌జీపీటీ లాంటి ఏఐ ద్వారా రూపొందించిన డిజిటల్ అసిస్టెంట్, ఫిట్నెస్ కోచ్ లేదా వర్చువల్ కోచ్‌కి ‘ఆర్థర్’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఆర్థర్ సహాయంతో తన రొటీన్ డైట్ ప్లాన్ చేసుకునేవాడు. భోజనం, వర్కౌట్స్ ఇలా ప్రతీ అంశాన్ని నియంత్రించే సమగ్ర ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేసుకున్నాడు. అదే అతని వెయిట్‌లాస్ జర్నీకి నాంది పలికింది. కేవలం ఆరు నెలల్లోనే కీలక పురోగతిని సాధించాడు. చాట్ జీపీటీ ఇచ్చిన సలహాలతో ఆరు నెలల్లో సుమారు 27 కిలోలు తగ్గాడు. అంతేకాదు తన మెంటల్ హెల్త్, ఎనర్జీ స్థాయిల్లో కూడా మార్పును గమనించాడు. ఇది తన ఫిట్నెస్ ప్రయాణాన్ని మెరుగుపరచడమే కాకుండా, కంటెంట్ సృష్టిపై అభిరుచి మరింత పెంచిందనీ చెప్పాడు. దీంతో ఇప్పుడు పూర్తి సమయం యూట్యూబర్‌గా మారిపోవాలని ఆలోచిస్తున్నాడు. అయితే ఈ జర్నీ అంత సజావుగా లేదు. ఆరంభంలో చాలా కష్టపడ్డాడు. వీకెండ్ మజాగా భావించే ఫాస్ట్ ఫుడ్ - బర్గర్లు, ఫ్రైస్, బీర్ లాంటి అనారోగ్య కరమైన అలవాట్లను మానుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డాడు. ప్రతిరోజూ కిలోమీటర్లు, కిలోమీటర్లు నడవడం, బరువులు ఎత్తడం లాంటి కఠిన వ్యాయామాలపై దృష్టిపెట్టాడు.AI-ఆధారిత భోజన ప్లాన్‌తో క్లీనర్ ఛాయిసెస్, స్మార్టర్ మీల్స్ అంటే శుభ్రమైన, పోషకాహారంపై దృష్టిపెట్టాడు. ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలను పూర్తిగా మానేశాడు. తినే ఆహారంలో పోషకాలు మాత్రమే ఉండేలా చూసుకున్నాడు. అల్పాహారంలో గుడ్లు, పర్మేసన్ చీజ్, టోస్ట్‌లు చేర్చుకున్నాడు. భోజనంలోచిల్లీ బీఫ్, బియ్యం ,రిఫ్రైడ్ బీన్స్ తీసుకునేవాడు. డిన్నర్లో కాల్చిన చికెన్ఒక రకమైన చిలగడదుంప, కాల్చిన ఎర్ర క్యాప్సికమ్, కోర్జెట్లు , గ్రీకు యోగర్ట్ ఇదే డిన్నర్.ఏఐ తన జీవితంలో లైఫ్‌స్టైల్ రీబూట్‌గా మారిందని, స్థిరంగా, పట్టుదలగా ఉండటంలోని పవర్ గురించి ఆర్థర్ తెలియచెప్పిందనీ మొత్తంగా , ఏఐ తన జీవితాన్ని పెర్ఫెక్ట్గా మార్చడమే కాదు ఎదురు దెబ్బలను ఎదుర్కోవడం ఎలాగో నేర్పించింది. నాలైఫ్ మొత్తాన్ని మార్చేసిందని చెప్పుకొచ్చాడు సంతోషంగా. -
రతన్ టాటా నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలివే..!
బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మన మధ్య లేకున్నా..తన మంచితనంతో అందరి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి. భావితరాలకు స్ఫూర్తి. వ్యాపారా సామ్రాజ్యంలో పారిశ్రామిక వేత్తలకు గురువు. వ్యక్తిత్వ పరంగా విద్యార్థులకు, యువతకు ఆదర్శం ఆయన. అలాంటి వ్యక్తి నుంచి ప్రతి చిన్నారి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలెంటో చూద్దామా..!నిరాడంబరత..టాటా గ్రూప్‌నే కాకుండా మన దేశం స్వరూపాన్నే తీర్చిదిద్దిన.. ఆ మహనీయుడి జీవన విధానం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆయన అంత పెద్ద వ్యాపార దిగ్గజమే అయినా సాధారణ జీవన విధానాన్నే ఇష్టపడతారట. అందుకు ఉదాహరణ ఈ కథ..ఒకరోజు ఎల్ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్‌లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్‌తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ!సమస్యలను స్వీకరించే గుణం..రతన్ టాటా పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటారు. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్‌లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్‌నకు వ్యతిరేకంగా, ఓ యూనియన్ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు. అల్లరిమూకలతో టాటా మోట్సార్లో దాడులకు తెగపడ్డాడు. ఆఖరికి ప్లాంట్‌లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేశాడు. అయినా రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. దీంతో గ్యాంగ్‌స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో..దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. అయితే కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్‌లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.నైతిక విలువలు..టాటా వ్యాపారంలో నైతిక విలువలకు పెద్దపీట వేశారు. కష్టమైన వ్యాపార నిర్ణయాలను ఎదుర్కొన్నప్పుడు కూడా నిజాయితీ విషయంలో రాజీ పడేందుకు నిరాకరించారు. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. కఠిన పరిస్థితులు ఎదురైన మన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకుండా వ్యవహరించడం అనేది అత్యంత గొప్ప విషయం. ఇది విశ్వసనీయతకు నిదర్శనం. అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది అనేందుకు టాటానే నిదర్శనం. దానగుణం..ముఖ్యంగా టాటా ట్రస్ట్‌ల ద్వారా చేసిన రతన్ టాటా దాతృత్వ ప్రయత్నాలు.. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే అతని నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. అతను ఆరోగ్య సంరక్షణ, విద్య , సామాజిక కారణాలపై అధికంగా పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ ఒక వ్యక్తి విజయం అనేది వ్యక్తిగత లాభం మాత్రమే కాదని, దాంతో ఇతరుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావచ్చని.. తన ఆచరణతో చూపించారు.పట్టుదల..టాటా తన పదవీ కాలంలో ఆర్థిక మాంద్యం నుంచి వ్యాపార వైఫల్యాల వరకు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎక్కడ పట్టు సడలించక.. విజయం దక్కేవరకు పట్టు వదలని విక్రమార్కుడిలా కష్టపడి ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఎదురు దెబ్బలనేవి జీవితంలో భాగమని, వాటికే కుదేలవ్వకూడదని చాటిచెప్పారు. ఇన్నోవేషన్, విజన్ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు అయిన టాటా నానో లాంచ్ వంటి వినూత్న ఆలోచనలకు రతన్ టాటా పేరుగాంచారు. మధ్యతరగతి భారతీయులు కూడా కారు కొనుక్కో గలిగేలా చేయడమే ఈ కారు లక్ష్యం. ఇక్కడ టాటా ఫార్వర్డ్-థింకింగ్, రిస్క్ తీసుకేనే ధైర్యం మనకు కనిపిస్తున్నాయి. అవసరమనుకుంటే రిస్క్ తీసుకోవాలి. ఒకవేళ ఫెయిలైన ఒక మంచి అనుభవం లభించడమే గాక సృజనాత్మకంగా ఆలోచించేందకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే అందులో ఎదురయ్యే లాభ నష్టాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్లే సామార్థ్యం పెరుగుతుంది. చివరి వరకు ఆయన జీవితాన్ని చాలా అపరూపంగా తీర్చిదిద్దుకున్నారు. అంతేగాదు మరణం సమీపించే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండేవారని సన్నిహిత వర్గాల సమాచారం. కెరీర్‌ని, వ్యక్తిగత జీవితాన్ని ఎలా మమేకం చేసుకోవాలో ఆచరించి చూపిన వ్యక్తి. వయసు అనేది శరీరానికే గానీ మనసుకు గాదు అంటూ ఆరు పదుల వయసులోనూ యువకుడిలా చురుకుగా పనిచేస్తూ యువతకు, ఎందరో వ్యాపారా దిగ్గజాలకు స్ఫూర్తిగా నిలిచారు. పైగా ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా బతికే ఉండటం అంటే ఏంటో చేసి చూపించారు టాటా. (చదవండి: రతన్ టాటా ఎలాంటి వంటకాలు ఇష్టపడేవారంటే..!) -
అలాంటి వాళ్లతో స్నేహం, విరోధం రెండూ వద్దు
దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. వాళ్ళతో విరోధం కూడా కూడదు. వారిని పట్టించుకోకుండా ఉండడమే మేలు. నిప్పును పట్టుకుంటే కాలుతుంది. చల్లారిన తర్వాత పట్టుకున్నా మసి అవుతుంది. కనుక దాని జోలికి పోకపోవడమే మేలు. విలువలేని దుమ్ము కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి విలవిలలాడేలా చేస్తుంది. విలువ లేని కొందరు మనుషులు కూడా చాలాసార్లు తమ మాటలతో బాధపెడతారు. ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముల లక్షణం. నమ్మకం అనేది గాజు పాత్ర లాంటిది. గాజు పాత్ర ఒక్కసారి చేతి నుండి కింద పడితే దాన్ని అతికించడం ఎలా అసాధ్యమో, ఒకసారి మనం ఒక వ్యక్తి దగ్గర నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి ఆ నమ్మకాన్ని సంపాదించడం అలా అసాధ్యం... అసంభవం. కాబట్టి కలుషితమైన ఈ రోజుల్లో కల్మషం లేకుండా నిన్ను ఎవరైనా నమ్మితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నీ ప్రాణాన్ని అయినా పణంగా పెట్టు తప్పులేదు కానీ నమ్మకాన్ని కోల్పోకు... -
వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే!
వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. అంటే.. మనం ఏ పని చేయ తలపెట్టినా.. ముందు వినాయకున్ని పూజిస్తే మనకు ఆ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడవన్నమాట. అందుకనే ఎప్పుడూ తొలి పూజ వినాయకుడికే చేస్తారు. చదువు దగ్గర నుంచి కళల వరకు ఏది మొదలుపెట్టాలన్న ఆయన అనుగ్రహం ఉంటేనే సాధ్యం. ఇవాళే గణనాథుని జన్మదినోత్సవం ఈ సందర్భంగా ..ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో చూద్దామా! విధి నిర్వహణే ముందు.. పార్వతి గణేషుడి బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి తన ఇంటికి ఆయన్ను కాపలా ఉంచి స్నానానికి వెళ్తుంది కదా. అప్పుడు శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్లబోతే గణేషుడు అడ్డుకుంటాడు. శివుడు తాను ఫలానా అని చెప్పినా గణేషుడు వినడు. తన కర్తవ్యం ఇంట్లోకి ఎవరినీ రాకుండా చూసుకోవాలి. అదే విషయం పార్వతి కూడా వినాయకుడికి చెబుతుంది. కనుకనే సాక్షాత్తూ శివుడే వచ్చినా సరే… గణేషుడు తన ప్రాణాలు పోయినా విధి నిర్వహణను పూర్తి చేసి తీరుతాడు. ఆయనలో ఉన్న ఆ గుణాన్ని నిజంగా మనం కూడా అలవాటు చేసుకుంటే లక్ష్యసాధనలో, కెరీర్లో మనం దూసుకెళ్లవచ్చు. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుంది. ఎలా పని తప్పించుకుని తిరగాలనే చూసే ఉద్యోగులు ప్రమోషన్లు, బోనస్‌లు మాత్రం కావాలని గోల చేస్తుంటారు. ముందు మీ డ్యూటీ సంక్రమంగా చేస్తే మనం కచ్చితంగా ఉన్నత పదవులను పొందగలుగుతాం. తల్లిదండ్రుల కన్నా ఎవరూ ఎక్కువ కాదు.. గణేషుడు, కుమారస్వామిలలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు వారికి ఒక పరీక్ష పెడతారు. వారిద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలను చుట్టి వస్తారో వారే గణాధిపతి అంటారు. దీంతో కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై యాత్రలకు బయల్దేరతాడు. కానీ గణేషుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులనే దేవుళ్లుగా భావించి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గణాధిపతి అవుతాడు. నిజంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని మనకు గణేషుడి జీవితంలో జరిగిన ఈ సంఘటన చెబుతుంది. పూజలు అనగానే ఆర్భాటాలు పలికే మనం తల్లిదండ్రుల వద్దకు వచ్చేటప్పటికి ఎంతమంది వినాయకుడిలా అనుసరిస్తున్నారో ఆలిచిస్తే మంచిది. దేవుడు కూడా తల్లిదండ్రులను సేవ తర్వాతే దేవుడు పూజ అని నర్మగర్భంగా చెబుతున్నాడని అర్థం చేసుకోవాలి. తప్పుచేసిన వారిని క్షమించడం.. వినాయకుడు ఒకసారి సుష్టుగా భోజనం చేసి ఆపసోపాలు పడుతూ వెళ్తుంటే అతన్ని చూసి చంద్రుడు నవ్వుతాడు. దీంతో వినాయకుడు కోపోద్రిక్తుడై చంద్రున్ని ఆకాశంలో నుంచి పూర్తిగా కనిపించకుండాపొమ్మని చెప్పి శాపం పెడతాడు. అయితే వెంటనే తన తప్పు తెలుసుకున్న గణేషుడు చంద్రుడికి ఆ శాపం నుంచి విముక్తి కలిగిస్తూ కేవలం ఒక్క రోజు మాత్రమే కనిపించకుండా పొమ్మని శాపాన్ని మారుస్తాడు. అలా ఎవరు ఏ తప్పు చేసినా క్షమించాలన్న విషయాన్ని వినాయకుడి జీవితం చెబుతుంది. చేపట్టి పనిని వెంటనే పూర్తిచేయడం.. వేద వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు తాళపత్ర గ్రంథాలపై రాశాడన్న సంగతి తెలిసిందే. అయితే తాను ఆ పురాణం మొత్తాన్ని చెప్పడం పూర్తి చేసే వరకు మధ్యలో ఆగకూడదని వ్యాసుడు చెబుతాడు. దీంతో వినాయకుడు మధ్యలో కనీసం విశ్రాంతి అయినా లేకుండా నిరంతరాయంగా అలా మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లుగా రాస్తూనే ఉంటాడు. ఓ దశలో గ్రంథం రాసేందుకు ఉపయోగించే ఘంటం (పెన్ను లాంటిది) విరుగుతుంది. అయినా గణేషుడు తన దంతాల్లోంచి ఒక దాన్ని విరిచి గ్రంథం రాయడం పూర్తి చేస్తాడు. కానీ మధ్యలో ఆగడు. దీన్ని బట్టి మనకు తెలుస్తుందేమిటంటే.. ఏ పనిచేపట్టినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి. మధ్యలో ఆగకూడదన్నమాట..! చేపట్టిన పనిని చాలా త్వరగా పూర్తి చేయాలని తెలుపుతోంది ఆత్మ గౌరవం కోల్పోకూడదు.. ఒకసారి శ్రీమహావిష్ణువు ఇంట్లో జరిగే శుభ కార్యానికి దేవతలందరూ వెళ్తారు. స్వర్గలోకానికి గణేషున్ని కాపలా ఉంచి అందరూ వెళ్తారు. అయితే వినాయకుడి ఆకారం తమకు నచ్చనందునే ఆయన్ను అక్కడ ఉంచి వారు వెళ్లిపోయారన్న సంగతి గణేషుడికి తెలుస్తుంది. దీంతో దేవతలకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్న గణేషుడు వారు వెళ్లే దారిలో అన్నీ గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు. మూషికం దేవతలు వెళ్లే దారినంతా తవ్వి గుంతలమయం చేస్తుంది. దీంతో ఆ దారిలో వెళ్తున్న దేవతల రథం ఒకటి ఒక గుంతలో దిగబడుతుంది. వారు ఎంత ప్రయత్నించినా ఆ రథాన్ని బయటకు లాగలేకపోతారు. అటుగా వెళ్తున్న ఓ రైతును పిలిచి సహాయం చేయమంటారు. అతను వచ్చి గణేషున్ని ప్రార్థించి ఒక్క ఉదుటున గుంతలో దిగబడి ఉన్న రథాన్ని బయటకు లాగుతాడు. దాంతో దేవతలు ఆశ్చర్యపోతారు. వినాయకుడు అన్ని అవరోధాలను తొలగించే దైవం కనుక ఆయన్ను ప్రార్థించి రథాన్ని లాగానని రైతు చెప్పగానే దేవతలు సిగ్గుతో తలదించుకుంటారు. వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది. దీంతో వినాయకుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కోరతారు. అయితే దేవతలు అందరూ తన ఆకారం పట్ల అయిష్టతను ప్రదర్శించినా వినాయకుడు మాత్రం అందుకు ఏమీ బాధపడకుండా ఆత్మ గౌరవంతో అలా వ్యవహరించడం.. మనకూ ఆదర్శనీయమే. ఆయనలోని ఆ గుణాన్ని కూడా మనమూ అనుసరించాల్సిందే. ఎవరేమన్నా.. ఏ పరిస్థితిలోనైనా ఆత్మ గౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన మనకు ఆ సత్యాన్ని తెలియజేస్తుంది..! ---ఆర్ లక్ష్మీ లావణ్య (చదవండి: వినాయకుని పూజకు ముఖ్యంగా అవి ఉండాల్సిందే!) -
ఆ సమోసాల అమ్మే వ్యక్తి..ఓ గొప్ప జీవిత పాఠాన్ని నేర్పాడు!
మనకు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే.. మేధావులు, జీనియస్‌లు, పండుతుల వద్దకే వెళ్లాల్సిన అవసరం లేదు. మన చుట్టూ జరుగుతున్న వాటిని గమనించినా.. లేదా కష్టజీవులను చూసినా ఎంతో నేర్చుకోవచ్చు. మనం పడుతున్నదే కష్టం కాదు అంతకు మించి ఉందని అర్థం అవుతుంది. అందుకు ఉదహరణే ఈ ఉదయ్‌పూర్ వృద్ధుడు. ఆ వృద్ధుడు ఉదయ్‌పూర్‌లోని కోర్టు సర్కిల్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డుపక్కనే సమోసాలు అమ్ముతుంటాడు. సరిగ్గా ఆ సమయానికి అటుగా ఆర్యాన్ష్ అనే వ్యక్తి కారులో వస్తున్నాడు. కరక్ట్‌గా ఆ టైంలో మంచి జోరుగా వర్షం వస్తుంది. దీంతో ఆర్యాన్ష్ కారు పక్కకు పార్క్ చేసి నేరుగా అతని వద్దకు వచ్చాడు. గట్టిగా వర్షం కురుస్తుండటంతో ఏదైనా తిందామనిపించి చూడగా ఆ వృద్ధుడు అక్కడే సమోసాలు, పోహా అమ్మడం చూసి అతని దగ్గరకు వెళ్లాడు. కొన్ని సమోసాలు ఆర్డర్ చేసి తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ వయసులో ఇంకా ఎందుకు కష్టపడుతున్నావు అని ఆర్యాన్ష్ ప్రశ్నిస్తాడు. దానికి ఆ వ్యక్తి బదులుగా..ఈ వయసులో డబ్బు సంపాదించేందుకు కష్టం పడటం లేదు బేటా!. నా మనసును సంతోషంగా ఉంచుకునేందుకు నాకు నచ్చిన పని చేస్తున్నాను. ఇలా నేను వండిన వంటకాల రుచిని ఆస్వాదించిన ముఖాలను చూస్తే నా మనసు సంతోషంతో నిండిపోతుంది. నేను ఒంటరిగా ఇంటి వద్ద కూర్చొవడం కంటే ఇదే మేలని చెబుతాడు ఆ వృద్ధుడు. దానికి రియలైజ్ అయిన అర్యాన్ష్ ఇది జీవితానికి ఉపయోగపడే విలువైన పాఠం ఇది. వయసులో ఉన్న యువత సైతం ఒళ్లు వంచడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇంతటి పండు ముదుసలి వయసులో ఎంతో ఉషారుగా పనిచేస్తున్నాడు. పైగా పనిచేస్తేనే సంతోషంగా ఉంటుందని చెబుతున్నాడు. అతని దృక్పథాన్ని వింటే ఎందరో యువత తమ జీవన విధానాన్ని మార్చుకుంటారు కదా అని ట్విట్టర్ వేదికగా ఈ విషయన్ని నెటిజన్లతో పంచుకున్నాడు ఆర్యాన్ష్. దీంతో నెటిజన్లు సదరు వృద్ధుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేశారు. It was raining heavily when I parked my car beside a traffic signal near court circle udaipur, where I saw an old uncle selling hot samosa and poha. I placed an order and curiously asked him why he didn't take a rest today, considering his age. He told me something that… pic.twitter.com/CCIutZv23Z — Aaraynsh (@aaraynsh) July 25, 2023 (చదవండి: 600 మిలియన్ల ఏళ్ల నాటి సముద్రం..భూమి పుట్టుకకు ముందు..) -
Viral: ఈ తాత కథ మీలో ఎవరికైనా ఎరుకేనా?
Viral Photo: కొందరి క(వ్య)థలు.. ఇట్టే ఆకట్టుకుంటాయి. కదిలిస్తాయి. భావోద్వేగానికి గురి చేస్తాయి. ఆ కథలను చెప్పడానికి పెద్దగా వర్ణనలు అక్కర్లేదు. కేవలం అక్కడ కనిపించే పరిస్థితులు చాలూ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య ఒక ఫొటో విపరీతంగా వైరల్ అవుతుండడం చాలామంది చూసే ఉంటారు. ఒక వృద్ధుడు ఒక పాత కిరాణ దుకాణంలో ఉండగా.. పైన కనిపించే రాతలు ఆకట్టుకునేలా.. అంతకు మించి ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘‘నమ్మండి.. నేను వ్యాపారంలో నష్టపోలే. బదలు ఇచ్చి.. మధ్యవర్తిగా ఉండి నష్టపోయాను. నా సాయం తీసుకున్నవారు పొలాలు కొన్నారు. నేను మాత్రం పొలం అమ్ముకున్నాను’’ అని ఆ చిన్న కిరాణంపైన రాసి ఉంది. ఇది ఏ కాలానికైనా వర్తించే కఠిన వాస్తవం ఇదని పలువురు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది నెటిజన్స్.. ఈ దుకాణం తమకు తెలుసని, వరంగల్ పక్కన నెక్కొండ అనే చిన్న పల్లెటూరిలో ఈ తాత ఉన్నాడని, తన అనుభవమే ఆయన అలా రాతలుగా చూపించారని అంటున్నారు. ఇంతకీ ఈ తాత పేరు, ఆయన కథ ఏంటి?.. ఆయనకు జరిగిన నష్టం ఏంటో ఎవరికైనా తెలిస్తే చెప్పరు! ఇదీ చదవండి: చావు అంచుల దాకా వెళ్తే.. రక్షించాడు -
భక్త కోటికి తారక మంత్రం.. తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక ఈ వేడుక
శ్రీరామ చంద్రమూర్తి జీవిత కథే రామాయణం. ఆ రామాయణాన్ని అనుసరిస్తే చాలు మనం ఎలా వ్యవహరించాలో అర్ధం అయిపోతుంది. ఎలా ఉండకూడదో ఎలా నడుచుకోకూడదో కూడా తెలిసిపోతుంది. మనకి కర్తవ్య బోధ చేస్తూ దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్లే కాంతి బాటే రామాయణం. అందుకే యుగాలు గడిచినా ఇప్పటికీ రామనామమే భక్తకోటికి తారక మంత్రంగా ఉండిపోయింది. ఎన్ని యుగాలు దాటినా అదే మంత్రం లోకాన్ని ముందుకు నడిపిస్తుంది. రామ రాజ్యం రావాలంటే రాముడు చూపిన బాటలో ధర్మాన్ని ఆచరించడమొక్కటే మార్గం అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. రామరాజ్యం యావత్ ప్రపంచానికే ఆదర్శ రాజ్యం ఏ రాజ్యం అయితే సుభిక్షంగా ఉంటుందో ప్రజలంతా ఏ చీకూ చింతా లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారో ఏ రాజ్యంలో అయితే ప్రజలు మానసిక క్షోభలు పడకుండా మనశ్శాంతిగా ఉంటారు ఏ రాజ్యంలో అయితే ప్రజలు ఆకలి దప్పులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారో దాన్ని రామరాజ్యం అంటారు. ధర్మం నాలుగు పాదాల మీద నడిచేదే రామరాజ్యం. అందుకే రాముడి పాలనలో అందరూ పిల్లా పాపలతో హాయిగా జీవించారు. వన వాసం పూర్తి చేసుకుని తండ్రి మాటను దక్కించాడు. సత్య నిష్ఠ పాటించాడు. తిరిగి అయోధ్య చేరి రాజ్యాధికారం చేపట్టాడు. పాలకులు ప్రజల అభిప్రాయాలను గౌరవించాలన్న సూత్రాన్ని రాముడు పాటించాడు. తన రాజ్యంలో ఓ మామూలు మనిషి తన సతీమణి సీత గురించి చేసిన వ్యాఖ్యలకు కూడా గౌరవం ఇచ్చాడు. సీత గురించి తనకు తెలిసినా ప్రజల నుండి ఓ విమర్శ వచ్చినపుడు పాలకుడిగా తాను జవాబుదారుగా ఉండాలనుకున్నాడు రాముడు. అందుకే గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతోన్నా.. కడలి అంతటి దుఖాన్ని దిగమింగుకుని సీతను అడవుల్లో వదిలి రావల్సిందిగా తమ్ముడు లక్ష్మణుణ్నే ఆదేశించాడు రాముడు. అందులో ఓ మంచి పాలకుడు ఎలా వ్యవహరించాలన్న నీతి ఉంది. అది పాలకులందరికీ ఆదర్శమే అంటారు మేధావులు. అధికారం తమ చేతుల్లో ఉంది కదా అని ప్రజల మాటలు పట్టించుకోకుండా ఉంటే అది ధర్మ బద్ధమైన పాలన అనిపించుకోదని రాముడు అనుకున్నాడు కాబట్టే సీతను అడవులకు పంపాడు. సీతారాముల జీవన యానమే రామాయణం. అది పరమ పవిత్రం. తర తరాలకూ ఆదర్శనీయం. అందుకే అది నిత్య పారాయణ గ్రంధం కూడా. రామాయణాన్ని ఒక్కసారి చదివితే చాలు తెలీని ఆనందం ఆవహించేస్తుంది. ఒక్క సారి చదివితే మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా ఉంటుంది. చదువుతున్న కొద్దీ కొత్తగానే ఉంటుంది. అదే సమయంలో మధురంగా అమృతంలా ఉంటుంది. అందుకే యుగాల తరబడి రామాయణం కల్పవృక్షంలా వెలుగుతూనే ఉంది. శ్రీరామ నవమి అంటే లోకానికి పండగ. జనులందరికీ పండగ. సీతారాముల కళ్యాణం అంటే అదో వేడుక. తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక. -
ఎలన్ మస్క్ చేసిన తప్పిదాలివే! మీకు తెలుసా?
ఎలన్ మస్క్.. విపరీతమైన ధోరణులతో నిత్యం వార్తల్లో నిలుస్తూ అశేష అభిమానుల్ని సంపాదించుకున్న మల్టీబిలియనీర్. ప్రపంచంలోనే అంత్యంత ధనవంతుడిగా.. నిత్యం ఏదో ఒకరంగా వార్తల్లో నిలుస్తూ సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటారు. అయితే.. చరిత్రలోనే విజయవంతమైన వ్యాపారిగా పేరు దక్కించుకున్న ఎలన్ మస్క్.. గుడ్డిగా అనుసరించడం ఏమాత్రం సరికాదన్నది మేధావులు అభిప్రాయం. అందుకు ఆయన చుట్టూరా ముసురుకునే వివాదాలే కారణం. 1. అనవసరపు జోక్యాలు! వ్యాపారంలో ఓర్పు చాలా అవసరం. అది లేకుంటే ఇబ్బందులు ఎదురుకాక తప్పదు. ఈ సోషల్ మీడియా కాలంలో విమర్శలను సైతం తేలికగా తీసుకోవాలి. కానీ, ఎలన్ మస్క్ అలా కాదు. తనపై వచ్చే విమర్శలతో పాటు తనకు సంబంధం లేని వ్యవహారాల్లోనూ జోక్యం ద్వారా వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ వివాదాలతోనూ వ్యాపారాలను దారుణంగా దెబ్బ తీశాడు కూడా!. టెస్లాపై వివాదాస్పద కథనాలు ప్రచురిస్తున్న ఓ రైటర్‌కు.. స్వయంగా ఫోన్లు చేసిన మస్క్.. అంతుచూస్తానంటూ బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మీడియాలో టెస్లా ఆదాయం మీద వచ్చిన కథనాలపై అనుచితంగా కామెంట్లు చేయడంతో.. టెస్లా షేర్లు ఆరు శాతం ఢమాల్ అన్నాయి. ఇక.. 2018 థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుపోయిన చిన్నారుల బృందాన్ని రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌ను ఉద్దేశించి మస్క్ చేసిన కామెంట్లు కలకలమే రేపాయి. బ్రిటిష్ డైవర్‌ను ఉద్దేశించి అనుచిత కామెంట్లు చేసి.. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్నాడు మస్క్. అయితే.. ఆ దావాలో మస్క్‌దే పైచేయి అయినా వ్యక్తిగతంగా మాత్రం ఎంతో డ్యామేజ్ జరిగింది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయ్ మస్క్ఖాతాలో.. సహనం ఎంతో అవసరం అనే పాఠం నేర్పిస్తుంటుంది ఇలాంటి సందర్భాల్లో!. 2. ఆదాయవ్యయాలను కనిపెట్టాల్సిందే! ఆదాయం మాటొచ్చేసరికి ప్రముఖంగా వినిపించే పదం పొదుపు. అయితే.. అంతకు మించి ఆదాయవ్యయాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండాలి. అంతా సవ్యంగా ఉంటుందని అనుకుంటున్న టైంలోనూ ఆర్థికవసరాలు.. నిల్వకన్నా ఎక్కువ అవసరం పడొచ్చు. టెస్లా సీఈవో మస్క్.. నగదు ప్రవాహం అంచున ఉండడం అలవాటు చేసుకున్నాడు. బహుశా ఏ బిలీయనీర్ ఇలా డబ్బు రాకపోకల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండడేమో!. ముఖ్యంగా టెస్లా మోడల్ 3 టైంలో.. కంపెనీని చావో రేవో అనే స్థితికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో ఆర్థిక నిపుణులు పరిస్థితి ఇలాగే కొనసాగితే.. టెస్లా ఇబ్బందులు ఎదుర్కొవచ్చని సలహా ఇచ్చారు. ఒకానొక సమయంలో టెస్లా దివాలా తీసే స్థాయికి వచ్చిందంటూ మస్క్ స్వయంగా అంగీకరించాడు. బహుశా ఈ అనుభంతోనే.. నష్టాల్లో కొనసాగుతున్న ట్విటర్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టాడేమో. ఉద్యోగుల తొలగింపు అనే వివాదాస్పద నిర్ణయం ఇందులోనే భాగమేమో!. వ్యాపారాల్లో వచ్చేపోయే ఆదాయం కోసం ఒక ప్రణాళికను అభివృద్ధి చేయాలి. అంతా సవ్యంగా ఉన్న సమయాల్లో.. ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తే పరిస్థితి మరోలా మారవచ్చనే పాఠం ఎలన్ మస్క్ నేర్పించాడు కూడా. 3. తొందరపాటు వద్దు ట్విటర్‌తో సాగిన డీల్ ఇందుకు పెద్ద ఉదాహరణ. ఏప్రిల్ 2022లో.. ఓ ఇంటర్వ్యూలో ట్విటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఆలోచన బయటపెట్టాడు. ఆ తర్వాత అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాడు. అయితే.. ఫేక్ అకౌంట్ల తాకిడి మరీ ఎక్కువగా ఉందని గుర్తించి.. ఈ డీల్ గాడికి ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సుమారు 40 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఒప్పందం.. అదీ అర్థాంతరంగా ఆగిపోయిందని జోరుగా చర్చ నడిచింది. ఆపై స్వయంగా మస్క్ ఒప్పంద రద్దు ప్రకటన చేయడంతో.. ట్విటర్ ఆయన మీద దావాకు కూడా సిద్ధమైంది. ఈ తరుణంలో గత్యంతరంగా లేనిస్థితిలోనే అనూహ్యంగా ట్విటర్ డీల్‌ను క్లోజ్ చేసి టేక్ఓవర్ చేశాడు మస్క్. ఎలన్ మస్క్-ట్విటర్ డీల్ నేర్పే పాఠం.. ఎలాంటి వ్యవహారాల్లోనైనా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం. ముఖ్యంగా ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో. ఒకటికి పదిసార్లు అన్నీ కూలంకశంగా పరిశీలించుకున్నాకే ముందుకెళ్లాలి. 4. సోషల్ మీడియా వాడకం ఎలన్ మస్క్ విషయంలో అత్యంత చర్చనీయాంశం ఇదే. పదకొండున్నర కోట్ల మంది యూజర్లు ట్విటర్లో ఆయన్ని ఫాలో అవుతున్నారు. ఇక సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ సంగతి మాత్రం ఒక మిస్టరీ!. సోషల్ మీడియాలో ఆయన వైఖరి.. ఎప్పటికప్పుడు హాట్ టాపిక్. పోటీదారు కంపెనీలపై చేసే వెకిలి కామెంట్లు.. విభిన్నంగా చేసే ప్రమోషన్లు, నర్మగర్భంగా నడిపించే వ్యవహారాలు.. ఎలన్ మస్క్ గురించి నెటిజన్స్‌లో ఒకరకమైన క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. అయితే.. ఊహకందని చేష్టలతో ‘థగ్ లైఫ్’ ట్యాగ్ తగిలించుకున్న ఎలన్ మస్క్.. అదే సోషల్ మీడియా ద్వారా వివాదాల్లో నిలుస్తుంటాడు. మీమ్స్, కుళ్లు జోకులు, డబుల్ మీనింగ్ డైలాగులు.. ఒక్కోసారి స్థాయిని దాటేసి విమర్శలకు దారి తీస్తుంటాయి కూడా. అయితే స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే వంకతో సోషల్ మీడియాలో ఆయన చేసే పనులు.. ఆయన్ని చిక్కుల్లో పడేసిన సందర్భాలు కోకొల్లలు. తద్వారా ఆయనకి ఆర్థికంగా జరిగిన నష్టమే ఎక్కువ కూడా!. సోషల్ మీడియా పవర్ఫుల్ టూల్. ఆ విషయం తన ఫాలోయింగ్ ద్వారా మస్క్ ఏనాడో అర్థం చేసుకుని ఉండొచ్చు. అయితే అది సహేతుకంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలనే మంత్రాన్ని మస్క్ ఏనాడూ జపించింది లేదు. అందుకే ఏదైనా లిమిట్లో ఉండాలని పెద్దలు అంటుంటారు. అది సోషల్ మీడియా వాడకం అయినా కూడా!. 5. నిశిత పరిశీలన.. ముందు జాగ్రత్త ఓవర్కాన్ఫిడెన్స్.. జీవితంలో కొంప ముంచే ప్రధాన అంశం. విజయానికి ఇదొక అడ్డుపుల్లగా కూడా అభివర్ణించాడు తత్వవేత్త అరిస్టాటిల్. 2019లో టెస్లా సైబర్ ట్రక్‌ను ఆవిష్కరించే క్రమంలో.. ఇదొక బుల్లెట్ ప్రూఫ్ వాహనమని, కావాలంటే పరీక్షించుకోవాలని సవాల్ విసిరాడు మస్క్. అయితే.. పరీక్షలో ఓ పెద్ద బేరింగ్ రాయి విసరగా.. అది బద్ధలైంది. హ్యూమనాయిడ్ రోబో ‘ఆప్టిమస్’ దాదాపు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది ఎలన్ మస్క్‌కి. లక్ష్యాలు నిర్ధేశించుకోవడం తప్పేం కాదు. కానీ, నిశిత పరిశీలన తప్పనిసరి. సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకోవడంలో తప్పు జరిగితే అది విఫలం వైపు అడుగులు వేయిస్తుంది. భారీ ఎత్తున్న నష్టం కూడా కలగజేస్తుంది. పరిశీలన.. ముందుజాగ్రత్తలు లేకుంటే ఎలన్ మస్క్‌కు ఎదురైన నష్టం.. అవమానాలు ఎవరికైనా ఎదురుకావొచ్చు. ఎలన్ మస్క్.. ఓ అసాధారణ వ్యక్తి. ముమ్మాటికీ ఓ అపారమేధావే. లేకుంటే టెస్లా, స్పేస్ఎక్స్.. ఇలాంటివి ప్రపంచాన్ని శాసించేవా?. విచిత్రమైన ఆలోచనలు ఆచరణలోకి వచ్చేవా?.. సంపాదనలో అతన్ని కొట్టేవాళ్లు దరిదాపుల్లో లేరు కావొచ్చు. కానీ, ప్రతీ మనిషిలో కొన్ని లోపాలు ఉంటాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆయన ఎంత గొప్ప సాధించిన ఆయన జీవితం నుంచి లోపాలను మినహాయించుకోవడం.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగితే మిస్టర్ పర్ఫెక్ట్గా విజయాల్ని అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. -
వైరల్ వీడియో: పిల్లి వేషాలు... దెబ్బకు దిగొచ్చింది
-
సమంత గొప్ప పాఠం ఇదేనట.. ఇన్‌స్టాలో సామ్ స్టోరీ
Samantha Shared A Instagram Story About Life Lesson: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సోషల్ మీడియాలో తాను ఏం పోస్ట్ చేసిన చర్చకు తావిస్తోంది. సామ్ కూడా తన మనసులోని భావాలను, అనుభూతులను తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పంచుకుంటుంది. అప్పుడప్పుడు మోటివేషనల్ కోట్స్, జీవితపు సత్యాలు పెడుతూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. ఇటీవల ఆమెను ఇన్‌స్టాలో ఫాలో అయ్యేవారి సంఖ్య 20 మిలియన్లకు (2 కోట్లు) చేరుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సామ్ తన ఇన్‌స్టా వేదికగా 'తాను నేర్చుకున్న పాఠం'పై స్టోరీ షేర్ చేసింది. ఏం రంగంలోనైన నిత్య విద్యార్థులుగా ఉండాలంటారు. ఎంత నేర్చుకున్నా.. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందంటారు. సామ్ కూడా అదే అంటోంది. హీరోయిన్‌గానే కాదు వ్యక్తిగతంగా కూడా తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్తోంది. 'జీవితం నాకు నేర్పిన గొప్ప పాఠం ఏంటంటే.. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.' అని సమంత తన ఇన్‌స్టా ఖాతాలో స్టోరీ షేర్ చేసింది. అలాగే అమెరికన్ రైటర్ చెరిల్ స్ట్రాయ్డ్ రచించిన ఒక కొటేషన్‌ను కూడా యాడ్ చేసింది. ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత ఇంటర్నేషనల్ చిత్రంలో నటించనుంది. అలాగే ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ 'యశ్ రాజ్ ఫిలిమ్స్'లో మూడు ప్రాజెక్ట్స్‌కు సామ్ ఓకే చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: తగ్గని సమంత దూకుడు.. అందులోనూ రికార్డు -
'ఆనందం' ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో..
జీవితంలో ఆనందంగా ఉండటం నిజంగానే కష్టమైన పనా? అసలు ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలి అంటూ మనలో చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే ఆనందం అనేది ఆన్లైన్లో దొరికే వస్తువు కాదు, అది స్వతహాగా మనమే పెంపొందించుకోవాలి ఇలాంటి పాజిటివ్ స్పిరిట్‌తో ఉన్న ట్వీట్‌ను గురువారం ఆనంద్ మహింద్రా షేర్ చేశారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహింద్రా..తాజాగా జీవిత పాఠానికి సంబంధించిన ఓ విలువైన పోస్టును నెటిజన్లతో పంచుకున్నారు. ఇందులో..'ఇది (ఆనందం) నీకు ఎక్కడ దొరికింది? దీని కోసం నేను ప్రతీచోట వెతుకుతూనే ఉన్నాను అని ప్రశ్నించగా, ఎక్కడో లేదు..దీన్ని నేనే సృష్టించుకున్నాను' అంటూ మరొకరు సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన సింపుల్ లైన్ డయాగ్రమ్‌ను ఆనంద్ మహింద్రా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. (వైరల్: ‘పులి’ని చూసి పారిపోయిన జంతువులు! ) ఒక్క ఫోటో వెయ్యి పదాల కన్నా విలువైనది అంటారు కదా..అలాగే ఈ సింపుల్ డ్రాయింగ్ కూడా వెయ్యి చిత్రాలకంటే విలువైనది అంటూ ఓ క్యాప్షన్‌ను జతచేశారు. ఆనంద్ మహింద్రా షేర్ చేసిన ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే వేలల్లో లైకులు, రీట్వీట్లు వచ్చాయి. అవును. మీరు చెప్పింది నిజమే..ఆనందం అనేది స్పూన్ ఫీడింగ్ కాదు..దాన్ని మనమే సృష్టించుకోవాలి అంటూ ఓ యూజర్ పేర్కొనగా, సంతోషంగా ఉండటమన్నది చాలా సులభమైన విషయమే కానీ చాలామంది ఇదేదో కష్టమైన పని అని భావిస్తుంటారు అని మరొకరు రిప్లై ఇచ్చారు. (అతని పేరు చెప్పనందుకు సంతోషంగా ఉంది) They say a picture is worth a thousand words? Yes and a simple line drawing is sometimes worth a thousand pictures. pic.twitter.com/cnlBwZrQNz — anand mahindra (@anandmahindra) November 12, 2020 -
ముందు మీ నీడను ధైర్యంగా ఎదుర్కోండి
ఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా జీవిత సూత్రం తెలిపే ఒక ఆసక్తికర ట్వీట్‌తో ముందుకొచ్చారు. ప్రతీ ఒక్కరు జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని.. అందుకే ఎంత జ్ఞానం సంపాదిస్తే జీవితంలో అంత ఎత్తుకు ఎదుగుతారని తెలిపారు. 'నీకు కనిపించే నీ నీడను నువ్వే ఎదుర్కోలేకపోతే.. బయటి వ్యక్తులను కూడా అదే కోణంలో చూస్తావు. ఎందుకంటే బయటి ప్రపంచంలో కనిపించేదంతా నీ లోపల ఉండే ప్రతిబింబమే. అందుకే లోపలి జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలించు. ఎంత జ్ఞానం సంపాదిస్తేనే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.' అంటూ ట్వీట్ చేశాడు.(చదవండి : క్వారంటైన్ సెంటర్లో మహిళను దోచేశారు) ప్రస్తుతం హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్‌గా మారింది. హర్షా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. హర్షా గోమెంకా.. మీరు చెప్పింది అక్షరాల నిజమే.. ఎంతసేపు బయటి ప్రపంచం గురించి ఆలోచించాం తప్ప మనలో ఉన్న లోపలి ప్రపంచం గురించి ఎప్పుడు ఆలోచించలేదు. వెల్ సెడ్ సర్.. నిజజీవితం అర్థం కావాలంటే లోపలి జీవితాన్ని మరింత లోతుగా చూడాలి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : కలయిక లేకుండానే గుడ్లు పెట్టింది..ఎలా సాధ్యం) -
‘కర్మకు సరైన నిర్వచనం ఇదే’
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడయాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఫన్నీ మీమ్స్, తన వర్క్‌కు సంబంధించిన కోట్స్ షేర్ చేస్తుంటారు. గత కొద్ది రోజులుగా జీవిత సత్యాలకు సంబంధించి ఆసక్తికరమైన కోట్స్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తున్నారు స్మృతి ఇరానీ. తాజాగా కర్మకు సంబంధించి ఆమె షేర్ చేసిన ఓ కోట్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. కర్మ అద్దలాంటిది అంటున్నారు ఇరానీ. అద్దం ముందు నిల్చుని మనం ఏం చేస్తే... అదే కనిస్తుందని తెలిపారు. ‘ఇతరులకు నీవు చేసే కీడు నీకు ఎప్పుడు అర్థం అవుతుంది అంటే.. అదే నష్టం నీకు జరిగినప్పుడు.. అందుకే నేను ఇక్కడ ఉన్నాను-కర్మ’ అంటూ ఇరానీ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ కోట్‌ను ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు. అందుకనుగుణంగానే పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దీనికి 20 వేల లైక్‌లు వచ్చాయి. చాలా మంది నెటిజనులు ‘బాగా చెప్పారు మేడం.. నిజం’ అంటూ కామెంట్ చేస్తున్నారు. (చదవండి: ‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’) View this post on Instagram Karma is not a ***** , it’s a mirror ... #duniyagolhai 🙏 A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Aug 31, 2020 at 11:11pm PDT కొద్ది రోజుల క్రితం స్మృతి ఇరానీ ఓ సందేశాత్మక కోట్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘మీలోని భయాలు తొలగపోవడానికి కొంత సమయం పడుతుంది. గాయపడిన మీ హృదయం కోలుకోవడానికి కొంత సమయంల పడుతుంది. విధితో తలపడే బలాన్ని కనుగొనడానికి కొంత సమయం పడుతుంది. ఇవన్ని జరగడానికి సమయం పట్టవచ్చు.. కానీ కోరుకున్నది తప్పక జరిగి తీరుతుంది’ అంటూ పోస్ట్ చేశారు స్మృతి ఇరానీ. -
అమ్మ కోసం అన్నీ ఇష్టంగానే చేస్తా..
బేల్దారి పనులతో మా అమ్మ ఎంతో కష్టపడుతోంది. కరోనా కారణంగా పనిలేకుండా పోయింది. కష్టాలు చుట్టుముట్టాయి. ఇల్లు గడవటం కష్టంగా మారింది. అందుకే అమ్మకు సాయంగా ఉంటున్నా.. ఇది నాకు ఏమాత్రం కష్టం కాదు. – ఓ పదకొండేళ్ల కుర్రాడు చెప్పిన జీవిత పాఠం ఆ చిన్నారికి నిండా పదకొండేళ్లు లేవు. తన వయస్సు పిల్లలంతా టీవీ చూడ్డమో.. సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకోవడమో చేస్తుంటారు. కానీ ఆ బడతడు ఆటలకు దూరమయ్యాడు. తండ్రి దూరమై తల్లడిల్లుతున్న తల్లికి తోడయ్యాడు. కరోనా కష్టకాలంలో కుటుంబ బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. ఇళ్లిళ్లూ తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నాడు. తల్లి, ఇద్దరు అక్కలకు ఆర్థిక ఆసరానిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. వయస్సులో చిన్నోడయినా బాధ్యత నెత్తికెత్తుకోవడంలో అందరికన్నా మిన్న. అందుకే అందరూ శభాష్ సుదర్శనా అంటున్నారు. ఎవరీ చిన్నారి..ఏమా కష్టం..తెలుసుకుందాం.. స్ఫూర్తి పొందుదాం. గుత్తి: గుత్తి పట్టణంలోని గాంధీ నగర్ కాలనీలో వెంకటేష్, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి యశోద, వెంకట లక్ష్మి, రమణి, పద్మావతి, సుదర్శన్ అనే ఐదుగురు సంతానం. ఈ దంపతులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. విధి వక్రించడంతో ఆరేళ్ల క్రితం వెంకటేష్ మరణించాడు. దీంతో సుజాత కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించింది. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కూడా చేసింది. ఈ క్రమంలో కుటుంబం గడవడం కష్టంగా మారగా... పదకొండేళ్ల కుమారుడు సుదర్శన్ తల్లికి తోడుగా నిలిచాడు. మూడు సంవత్సరాలుగా తల్లితో పాటు శ్రమిస్తున్నాడు. తల్లి తయారు చేసిన దోశలు, ఇడ్లీలు, వడలు బకెట్లో పెట్టుకుని ఊరంతా తిరుగుతూ విక్రయిస్తూ వచ్చిన కొద్దిపాటి మొత్తంతో కుటుంబానికి ఆర్థిక చేయూతనిస్తున్నాడు. మరోపక్క చదువు కూడా కొనసాగించాడు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో ఆ కుటుంబానికి కొత్త కష్టం వచ్చి పడింది. సుదర్శన్ వద్ద ఆకుకూరలు కొంటున్న మహిళలు.. కరోనా కష్టాలతో జీవితం తలకిందులు.. కరోనా కారణంగా ఐదు మాసాలుగా లాక్డౌన్ విధించగా...వీరి జీవితం తలకిందులైంది. దోశలు, వడలు, ఇడ్లీలు విక్రయించడం కష్టమైంది. ఆర్థిక పరిస్థితి దిగజారగా ఇళ్లు గడవడం ఇబ్బందిగా మారింది. దీంతో సుదర్శన్ నిత్యావసరాలైన కూరగాయలు, ఆకుకూరలు విక్రయించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఓ సైకిల్లో ఆకుకూరలు, కూరగాయల బుట్ట పెట్టుకుని ఊరంతా తిరుగుతూ విక్రయిస్తున్నాడు. రోజూ రూ.150 నుంచి రూ.200 దాకా సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా...రేపు పాఠశాలలు తిరిగి తెరిస్తే సుదర్శన్ జీవితం ప్రశ్నార్థంగా మారనుంది. కుటుంబ బాధ్యతా..? భవిష్యత్ వైపు అడుగులా తేల్చుకోలేని కష్టం ఎదురుకానుంది. మనసున్న మనుషులు కాస్త చేయూతనిస్తే ఇంటిపెద్దగా మారిన ఈ చిన్నారి జీవితం ఒడ్డునపడుతుంది. నాన్న చనిపోవడం బాధించింది.. మేము ఐదుగురు సంతానం. అనారోగ్యంతో నాన్న చనిపోవడం నన్ను ఎంతగానో బాధించింది. అప్పుడు నా వయస్సు ఐదేళ్లు. ఏడవద్దని అమ్మను మేమంతా ఓదార్చాం. అమ్మ ఎంతో కష్టపడి ముగ్గురు అక్కలకు పెళ్లిళ్లు చేసింది. మూడు సంవత్సరాల క్రితం నుంచి అమ్మకు తోడుగా నేనూ చిరు వ్యాపారం చేస్తున్నా. అమ్మచేసే ఇడ్లీలు, వడలు, దోశలు ఊరంతా తిరిగి అమ్ముతున్నా. కరోనా వల్ల వ్యాపారం లేక... బుట్టలో కూరగాయలు, ఆకుకూరలు పెట్టుకొని విక్రయిస్తున్నా. నేను బరువు మోయలేనని అమ్మ ఈ మధ్యనే చిన్న సైకిల్ కొనిచ్చింది. నేను చిన్న పిల్లోడిని కావడంతో అందరూ నా వద్దే కొంటున్నారు. ప్రస్తుతం నేను కోట ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నా. బడి తెరిచినా..కూరగాయలు విక్రయించడం కష్టమవుతుందేమో...అయినా అమ్మ కోసం అన్నీ ఇష్టంగానే చేస్తా. సాయం చేయాలనుకుంటే.. సుజాత, సుదర్శన్ జాయింట్ అకౌంట్ అకౌంట్ నెం.31262250092754 ఐఎఫ్ఎస్సీ కోడ్ : SYNB0003126 సిండికేట్ బ్యాంకు, గుత్తి అర్బన్ -
87 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఇలా..
వృద్ధాప్యం అనేది వయస్సుకు గానీ మనస్సుకు కాదని చెప్పడం గురించి మనకు తెలుసు. అలా చెప్పడమే కాదు, అందుకు రుజువు తమ జీవన విధానమేనని నిరూపిస్తున్న వాళ్లు ఇప్పుడు ఎందరో ఉన్నారు. 82వ ఏట ప్రేమించి పెళ్లి చేసుకోవడం, 85వ ఏటా ప్రతి రోజు మధ్యతరహా సముద్రంలో కొన్ని కిలోమీటర్లు ఈతకొట్టడం, 87వ ఏటా రోజు రెండు, గంటల పాటు టెన్నిస్ ఆడుతున్న వద్ధుల గురించి తెలిస్తే ఆశ్చర్యమే కాదు, ఈర్ష్య కూడా కలుగుతుంది. తాము గతంలో కన్నా ఈ వయస్సులోనే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నామని చెబుతుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. కెనడాలోని అంటారియోకు చెందిన 87 ఏళ్ల మఫ్వీ గ్రీవ్ ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రతి రోజు టెన్నీస్ ఆడుతారు. ఆమె గత 70 ఏళ్లుగా టెన్సీస్ ఆడుతూనే ఉన్నారు. ‘‘కెరీర్లో అన్ని అవార్డులు, రివార్డులు గెలుచుకున్నామన్నది ముఖ్యం కాదు. మానవ జీవితం అన్నాక ఒడిదుడుకులు, సమస్యలు తప్పవు. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్నదే ముఖ్యం. అందుకు జీవితం పట్ల సానుకూల దక్పథం అవసరం. ఈ విషయంలో ప్రముఖ రచయిత, తత్వవేత్త బెర్టాండ్ రస్సెల్ నాకు ఆదర్శం. సమస్యలు వస్తే కుంగిపోవద్దని, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలని, పరిష్కారం లభించదనుకుంటే ఆ సమస్యలను పక్కన పడేసి ముందుకు పోవాలని ఆయన చెప్పారు. నేను నా జీవితంలో అలాగే చేశాను. నా వయస్సు గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. నాకు 30 ఏళ్లా, 60 ఏళ్లా అని ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు 62 ఏళ్ల వయస్సులో మెదడులో ట్యూమర్ వచ్చింది. కంగిపోలేదు. పోరాడాను. ఓసారి బిజినెస్ ట్రిప్పులో బయటకు వెళ్లినప్పుడు కారు దిగి నడవలేక పోయాను. మేజర్ ఆపరేషన్ జరిగింది. మనోధైర్యంతో కోలుకున్నాను. టెన్నీస్, గోల్ఫ్ ఆడడం వల్లనే నేను ఇప్పటికీ ఫిట్నెస్తో ఉన్నాను. ఆ ఆటలు ఇప్పటికీ ఆడడమేకాదు, ఎక్కడికైనా నడిచే వెళతాను. అదే నా ఆరోగ్య రహస్యం’’ అని ఆమె వివరించారు. ఆరు గంటల వ్యవధిలో 80 స్కై డైవింగ్‌లు ఆస్ట్రేలియాకు చెందిన పాట్ (87), అలీసియా మూర్హెడ్ (72) వద్ధ దంపతులు ఇప్పటికీ దృడంగా ఉంటారు. స్కై డైవింగ్‌లో వారికి వారే సాటే. పాట్ ఇప్పటికీ పదివేల స్కై డైవింగ్‌లు చేశారు. 80వ ఏటా ఒక్క రోజులో ఆరు గంటల వ్యవధిలో 80 స్కై డైవింగ్‌లు చేసి ప్రపంచ రికార్డు సాధించానని పాట్ తెలిపారు. వయస్సు మీరాక ఎవరైనా స్కై డైవింగ్లకు స్వస్తి చెబుతారని, అయితే అలా తాను చేయదల్చుకోలేదని అన్నారు. తాను లిఫ్టులేని ఇంటి మేడపైకి మెట్లెక్కే పోతానని, ఆ ఆలోచన వల్లనే ఇంటికి లిఫ్టు కూడా పెట్టించలేదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో ఉన్నప్పుతే తాను జిమ్నాస్టని, ఆ తర్వాత 30వ ఏటా స్కై డైవింగ్ నేర్చుకున్నానని పాట్ భార్య అలీసియా తెలిపారు. అందుకనే స్కై డైవింగ్ పట్ల ఆసక్తి కలిగిన పాట్ చేసుకొని ఇప్పటికీ డైవింగ్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాలి నడకతోనే ఎక్కువ సంచరిస్తా ఛానల్ ఐలాండ్స్‌లోని ఆల్డెర్నీకి చెందిన రీటా గిల్మోర్కు 87 ఏళ్లు. ఆమె భర్త మోరిస్ 74వ ఏట మరణించారు. అప్పటి వరకు ఆయన చూసుకున్న అతిపెద్ద రెస్టారెంట్‌ను ఇప్పుడు ఆమె చూసుకుంటున్నారు. తాగుడు, స్మోకింగ్ అలవాటు లేని తాను, కార్లలో కంటే కాలి నడకనే ఎక్కువ సంచరిస్తానని, అదే తన ఆరోగ్య రహస్యమని తెలిపారు. ఇలాంటి వాళ్లందరి గురించి ‘లైఫ్ లెస్సన్స్ ఫర్ పీపుల్ ఓల్డర్ అండ్ వైజర్ ద్యాన్ యూ’ పేరిట హార్డీగ్రాంట్ ప్రచురించిన పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు -
వివేకమే విజయసూత్రం
అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఎవరికీ తెలియదు. జరిగాక మాత్రం వాటిని సాధించిన వారి జీవితాలు పాఠాలు అవుతాయి. వారి ఆలోచనలు అపురూపం అనిపిస్తాయి. వారి మాటలు స్ఫూర్తిమంత్రాలవుతాయి. పుణెకి చెందిన ఫర్హద్ అసిద్వాలా విజయం కూడా అలాంటి ఓ అద్భుతమే! ‘‘నువ్వు వేసే తొలి అడుగే అత్యంత ముఖ్యమైన అంశం. తర్వాత నీ శ్రమే నిన్ను నడిపిస్తుంది, విజేతగా నిలుపుతుంది...’’. తను నమ్మే సూత్రం ఇదేనంటాడు ఫర్హద్. దీన్ని నమ్మి, ఆచరించి, విజయం సాధించాడు కాబట్టే అంత కచ్చితంగా చెబుతున్నాడు. పుణెలోని ఒక ప్రముఖ విద్యాసంస్థలో బిజినెస్ మేనే జ్మెంట్ కోర్సును చదువుతున్న ఫర్హద్ సాధించిన విజయం... బిజినెస్ ‘మేనేజ్మెంట్ గురూ’ లనే ఆశ్చర్యపరుస్తోంది. ఎనిమిది సంవత్సరాల కిందట... ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్‌లు ఇంటింటికీ ప్రవేశించని, గ్రామీణ భారతానికి ఇంకా ఇంటర్నెట్తో పరిచయం లేని రోజుల్లో... పట్టణాల్లో కూడా అరుదుగా మాత్రమే ఇంటర్నెట్ కేఫ్‌లు కనిపించే సమయంలో ‘డొమైన్ రిజిస్ట్రేషన్’ బిజినెస్‌ను ప్రారంభించాడు ఫర్హద్. ఐటీ, ఇంటర్నెట్ ఆధారిత టెక్నికల్ కోర్సులు నేర్చుకొంటే మంచి ఉద్యోగం వస్తుంది అని ఎక్కువమంది యువతీయువకులు భావిస్తున్న ఆ రోజుల్లోవారందరికీ భిన్నంగా ఇంటర్నెట్ ఆధారంగా వ్యాపారం చేసేందుకు ప్లాన్ వేశాడు ఫర్హద్. ఇదే అతడు వేసిన తొలి అడుగు... వైవిధ్యమైన అడుగు. అప్పటికి ఫర్హద్ వయసు కేవలం 12 సంవత్సరాలు! తిరిగి చెల్లించే షరతులతో అమ్మానాన్నల దగ్గర ఆరు వందల రూపాయలు అప్పుగా తీసుకొని, ఒక డొమైన్‌నేమ్ రిజిస్టర్ చేయించుకొని, తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మొదట్లో డొమైన్ రిజిస్ట్రేషన్లు చేయించి అమ్మాడు. తర్వాత ఇంటర్నెట్లో కమ్యూనిటీలు క్రియేట్ చేసి వాటిని అమ్మడం మొదలెట్టాడు. ఇలా వెబ్ ఆధారిత వ్యాపారంలో ఒక్కో మెట్టూ ఎదిగాడు. తెలివితేటలను మాత్రమే పెట్టుబడి పెట్టే వ్యాపారాలను చేశాడు. తను చేస్తున్న పనంతా వ్యవస్థీకృతంగా ఉండాలనే ఉద్దేశంతో ‘రాక్‌స్టా మీడియా’ అనే కంపెనీని స్థాపించాడు. అనేక మందికి ఉపాధి కల్పించాడు. అదృష్టం కోసం వెతుకులాడకుండా... వివేకమే విజయసూత్రంగా ఫర్హద్ చేసిన ఎనిమిదేళ్ల ప్రయాణం అతడిని అంతర్జాతీయ అవార్డులను అందుకొనే స్థాయికి చేర్చింది. ఒకవైపు చదువుతూనే వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఇతడి బిజినెస్ ఐడియాలు సక్సెస్ కావడమే కాదు, ఆ సక్సెస్‌కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. సీఎన్ఎన్ ఐబీఎన్ దగ్గర నుంచి అనేక మీడియా సంస్థలు ఫర్హద్‌ను యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తించాయి. ప్రస్తుతం ఇండియాలోని టాప్ టెన్ యంగ్ బిజినెస్ మ్యాగ్నెట్లలో అతడూ ఒకడు!


