ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్‌గా 94 ఏళ్ల వ్యాపారి కథ! | 94 year old mans roadside stall serves more than just sugarcane juice | Sakshi
Sakshi News home page

ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్‌గా 94 ఏళ్ల వ్యాపారి కథ!

May 29 2026 11:37 AM | Updated on May 29 2026 4:34 PM

94 year old mans roadside stall serves more than just sugarcane juice

నేటి ఉరుకులు పరుగుల జీవితాల్లో నిజాయితీ, దయ, నిరాడంబరత అన్నవి అరుదైనవిగా మారిపోతున్నాయి. ఎంతసేపు పెద్ద అవకాశాలు, క్షణాల్లో విజయం, తక్షణ సంతృప్తి తదితరాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. రోజువారీ జీవితంలో ఉండాల్సిన కరుణ, సహనం, వినయం, మానవ సంబధాలు ప్రాముఖ్యతను విస్మరిస్తున్నారో లేక మర్చిపోతున్నారో తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇంకా కొద్దరు ఆ విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా ఆచరిస్తూ అర్థవంతంగా, స్ఫూర్తిగా బతుకుతున్నవారు కూడా ఉన్నారు. ఈ 94 ఏళ్ల తాతగారు ఆ కోవకు చెందిన వ్యక్తే. అతడితో మాటలు కలిపితే మనసుకు హత్తుకునే ఎన్నో తియ్యటి జీవిత పాఠాలు తెలుసుకోవచ్చట. 

ఆ తాతగారితో కాసేపు సరదాగా సంభాషించిన వీడియోని కోల్‌కతాకు చెందిన డిజిటల్‌ క్రియేటర్‌ ఆరాధన ఛటర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. వీడియోలో కనిపిస్తున్న తాతగారి పేరు సాదిక్‌పాల్‌. ఆయన ముంబైలోని ఖార్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా 80 ఏళ్లకు పైగా చెరుకురసం దుకాణాన్ని నడుపుతున్నారట. అది ఆయన తండ్రి ప్రారంభించిన దుకాణమట. ఆ తర్వాత ఆయన దాన్ని మరింతగా అభివృద్ధి చేశారట. 

ప్రస్తుతం ఆ తాత గారు , ఆయన కుమారుడు ఆ దుకాణాన్ని నడుపుతున్నారు. ఆయన ఆ దుకాణ్నా నడిపేటప్పటికీ రెండో తరగతి చదువుతున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ వ్యాపంలో తన అపార అనుభవాన్ని వివరిస్తూ.. ఎన్నో జీవిత సంఘటనల తోపాటు గొప్ప జీవిత పాఠాలను కూడా చెప్పుకొచ్చారట. ఆయన దృఢ సంకల్పంతో ఉండటం, ధైర్యంగా ఉండటం, కష్టపడి పనిచయడం వంటి ప్రాముఖ్యతలు గురించి నొక్కి చెప్పారు. అలాగే నిజాయితీగా, సద్గుణవంతుడిగా ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు అందుకోగలమో కళ్లకు కట్టినట్లు వివరించాడు. 

ఎవ్వరూ మిమ్మల్ని, మీ నిజాయితీని గుర్తించకపోయినా..మోసం చేసినా సరే..ఎవ్వరినీ వంచించొద్దు అని అమూల్యమైన సలహా ఇచ్చారు. నిజానికి ఆ క్షణంలో మన నిజాయితీ, ఆత్మవిశ్వాసాన్ని గుర్తించి గౌరవించకపోవచ్చేమో గానీ, ఎప్పటికీ మాత్రం కాదని అంటున్నాడు. 

మన లక్ష్యాలను సాధించడానికి, కలలను నెరవేర్చుకోవడానికి ఒకే ఒక్క మార్గం కష్టపడటం అని, అందరూ మంచిగా కష్టపడి ప్రయోజకులుగా మారండని కోరుతూ తన సంభాషణను ముగించాడు వృద్ధుడు సాదికపాల్‌. ఈ వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకోవడమే గాక, ఆయన సలహా అద్భతంగా ఉందని ప్రశంసించారు. అలాగే ఆయనకున్న అభిరుచి, విలువలు నిజంగా ప్రశంసనీయం అంటూ పొగడ్తల జల్లు కురిపించారు.   

(చదవండి: ఒకే ఒక్కడు' సాధించిన ఘనత! జస్ట్‌ ఒక్కరోజులో..)
 

Advertisement
 
Advertisement
Advertisement