శతకనీతి
వేమన ధైర్యాన్ని మనిషి అసలైన ఆభరణంగా చెప్పాడు.
పద్యం... ధైర్యమే పురుషునకు భూషణంబురా
ధైర్యహీనునకు దైవమైన తోడురాడురా వేమనా
అర్థం: ధైర్యమే మగవాడికి అసలైన అలంకారం. ధైర్యం లేనివాడికి దేవుడే వచ్చినా సహాయం చేయడు.
మరొక పద్యంలో...
ధైర్యము గలవానికి ధరణిలో సుఖమురా
ధైర్యము లేనికి దరిద్రమే గతిరా
ధైర్యం ఉన్నవాడికి ఈ లోకంలో సుఖం దొరుకుతుంది. ధైర్యం లేనివాడికి దరిద్రమే దిక్కు.
భాస్కర శతకంలో..
ధైర్యము గలవాడె ధన్యుడీ లోకాన
ధైర్యమున జయమెల్ల దక్కునురా
ధైర్యమే లేనిచో దైవమే వచ్చిన కార్యము సాగదురా
భావం.. ధైర్యం ఉన్నవాడే ఈ లోకంలో ధన్యుడు. ధైర్యంతోనే అన్ని పనుల్లో జయం వస్తుంది. ధైర్యం లేకపోతే దేవుడే వచ్చినా పని జరగదు.
సుమతీ శతకం...
బద్దెన సుమతీ శతకంలో ధైర్యాన్ని నేరుగా మగతనంతో పోల్చాడు.
‘ధైర్యము విడువకుము ధరణిలో నరుడు
ధైర్యమున జయమెల్ల దక్కునురా సుమతీ
ధైర్యమే మగతనంబురా సుమతీ‘
మనిషి ఎప్పుడూ ధైర్యాన్ని వదలకూడదు. ధైర్యంతోనే అన్నీ సాధించవచ్చు. ధైర్యమే అసలైన మగతనం.
మరొక చోట...
ధైర్యము లేనివానికి దైవము తోడుపడడు సుమతీ అని అంటాడు
ధీరుని లక్షణాన్ని, గొప్పతనాన్ని ప్రస్తావిస్తాడు, పద్యంలో ధీరులెప్పుడూ న్యాయ మార్గాన్ని వదలరు అని అంటాడు భర్తృహరి.
చివరిగా...
ధైర్యం అనే అంశాన్ని మంచి పనులకే ముడి పెట్టాలి.. చెడ్డపనులకు చేసే ప్రయత్నం లో చూపిన తెగువ ధైర్యం కాదు. ధర్మం కోసం యుద్ధం చేసినందుకే శ్రీ కష్ణుడు, శ్రీరాముడు, పాండవులు, శివాజీ, ఝాన్సీ భాయి, అల్లూరి సీతారామరాజు... ఎందరో స్వతంత్ర సమర యోధులు ‘దైర్యవంతులు’గా శాశ్వత కీర్తి సంపాదించారు.
– డా. కందాళ సత్యనారాయణ మూర్తి
ఇవి కూడా చదవండి: నిజమైన మార్పు ఎక్కడ మొదలవుతుంది?


