భక్తి
నిర్మలవాణి
మనలోని నిజమైన మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మనిషి జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ‘‘నేను ఎలా ఉన్నాను? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా ప్రవర్తనలో మార్పు అవసరమా? నా కుటుంబం గురించి నేను ఎంత తెలుసుకుంటున్నాను? నా పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటున్నానా?’’ అనే ప్రశ్నలు మనల్ని మనం పరిశీలించుకునేలా చేస్తాయి. అయితే ఇతరుల గురించి తెలుసుకోవడానికి చూపించే ఆసక్తిలో కొంతైనా మన అంతరంగాన్ని తెలుసుకోవడానికి చూపిస్తున్నామా?
ఆత్మపరిశీలనకు ఇదే మొదటి మెట్టు. మనిషి బయట ప్రపంచాన్ని జయించాలనుకుంటాడు. తన చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవాలనుకుంటాడు. తన భవిష్యత్తును మార్చుకోవాలని కోరుకుంటాడు. కానీ తనలోని ఆలోచనలు, భావోద్వేగాలు, బలహీనతలు, అహంకారం, అసూయ, భయం, అసహనం వంటి వాటిని పరిశీలించుకోవడం మాత్రం చాలాసార్లు మరిచిపోతాడు. శ్రీమతి నిర్మలా దేవి 1988 జూలై 27న చేసిన ఒక ఆధ్యాత్మిక బోధనలో, మనిషి తనను తాను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ప్రశ్నల రూపంలో గుర్తుచేస్తారు. ‘‘మీరు ఎలా ఉన్నారు? మీరు నిజంగా పురోగమిస్తున్నారా? లేక మీ వ్యవహారం, ఇతర విషయాల గురించి చింతిస్తున్నారా? మీ ఉన్నతి గురించి చింతిస్తున్నారా? దేశం గురించి చింతిస్తున్నారా? మీ ఉన్నతి గురించి చింతిస్తున్నారా? ఒకవేళ మీ ఉన్నతి గురించి చింతిస్తుంటే, దాని గురించి మీరు ఏం చేస్తున్నారు?’’ అనే ఆలోచన మనిషిని అంతర్ముఖుడిని చేస్తుంది.
మనల్ని మనం తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ప్రపంచంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటాం. విజ్ఞానం పెరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటాం. సమాజంలో మంచి పేరు సం΄ాదించాలనుకుంటాం. కానీ మనిషి తన మనస్సును అర్థం చేసుకోలేకపోతే, ఈ బాహ్య విజయాలన్నీ సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేవు. మన కో΄ానికి కారణం ఏమిటి? మనలో అసూయ ఎందుకు కలుగుతోంది? ఎందుకు చిన్న విషయాలకే మనశ్శాంతిని కోల్పోతున్నాం? ఎందుకు ఇతరుల తప్పులను సులభంగా చూస్తాం కానీ మన తప్పులను అంగీకరించడానికి ఇబ్బంది పడతాం? ఈ ప్రశ్నలకు సమాధానాలు బయట ప్రపంచంలో దొరకవు. మనలోకి మనం చూసినప్పుడే వాటి మూలాలను గుర్తించగలం.
– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు
మనిషి బయట ప్రపంచాన్ని జయించాలనుకుంటాడు. తన చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవాలనుకుంటాడు. తన భవిష్యత్తును మార్చుకోవాలని కోరుకుంటాడు. కానీ తనలోని ఆలోచనలు, భావోద్వేగాలు, బలహీనతలు, అహంకారం, అసూయ, భయం, అసహనం వంటి వాటిని పరిశీలించుకోవడం మాత్రం చాలాసార్లు మరిచిపోతాడు.
- శ్రీ మాతాజీ నిర్మలాదేవి
ఇవి చదవండి: రాఖీ కడితే దుష్టశక్తులు దూరమవుతాయా?


