మహనీయుల బాల్యం
భారతదేశ విమానయాన రంగానికి పితామహుడిగా పిలవబడే జె.ఆర్.డి. టాటాకు పదేళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం ఉత్తర ఫ్రాన్స్‌లోని ఒక బీచ్ రిసార్ట్ పక్కన నివసించేది. అక్కడ వారి పొరుగున ప్రపంచంలోనే మొదటిసారిగా విమానంలో ఇంగ్లీష్ ఛానల్‌ను దాటి రికార్డు సృష్టించిన ప్రసిద్ధ విమానయాన పైలట్ లూయిస్ బ్లెరియట్ ఉండేవాడు.
ఆయన తరచూ ఆ బీచ్‌లోని ఇసుకపై విమానాన్ని ల్యాండ్ చేస్తూ ఉండేవారు. బీచ్‌లో ఆడుకునే చిన్నారి టాటా ప్రతిరోజూ ఆ విమానం రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేవాడు. ఆ పైలట్ సాహసాలు చూసి, చిన్నారి టాటాలో ఒక బలమైన కోరిక నాటుకుంది. నేను కూడా పెద్దయ్యాక ఖచ్చితంగా పైలట్ అవ్వాలి, ఆకాశంలో ఎగరాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు.
ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత 1929లో భారతదేశంలోనే మొట్టమొదటి కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించి తన బాల్యపు కలను నిజం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనే భారతదేశపు మొదటి ఎయిర్‌లైన్స్ సంస్థను స్థాపించారు.
సందేశం: బాల్యంలో మనసులో నాటుకునే బలమైన లక్ష్యాలే భవిష్యత్తులో మనల్ని గొప్ప శిఖరాలకు చేరుస్తాయి!
ఇవి చదవండి: సముద్రాన్నే సవాల్ చేసిన ఈతగాడు.. కేవలం వారికోసమే!


