తెలుగు మీడియం బ్యాగ్రౌండ్‌ నుంచి దుబాయ్‌ వరకు..! | From A Telugu Medium School To Dubai Goes Viral | Sakshi
Sakshi News home page

తెలుగు మీడియం బ్యాగ్రౌండ్‌ నుంచి దుబాయ్‌ వరకు..!

Oct 6 2026 5:15 PM | Updated on Oct 6 2026 5:35 PM

From A Telugu Medium School To Dubai Goes Viral

తరచుగా కొత్త నగరాలకు మారడం వల్ల కలిగే లాభాలు గురించి ఒక తెలుగమ్మాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. అలా వేర్వేరు నగరాల్లో నివశించండం వల్ల భిన్నమైన సంస్కృతులు తెలియడం తోపాటు మన లైఫ్‌ని కూడా మార్చేస్తుందట. అదెలాగో తన స్వీయ అనుభవాన్ని వివరించింది. 

ఆ మహిళే ఇన్‌స్టాగ్రామ్‌ క్రియేటర్‌ తేజు. తన వ్యక్తిగ వీడియోని పంచుకుంటూ కొత్త నగరాలు లైఫ్‌ని ఎలా మార్చేస్తాయో చెబుతూ తన స్వీయ అనుభవాన్ని వివరించింది. తాను ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో జన్మించి తెలుగు మీడియం పాఠశాలలో చదువుకున్నట్లు తెలిపింది. పదేళ్ల వయసులో తన కుటుంబం బెంగళూరుకి మారడంతో అకస్మాత్తుగా అనేక భాషలు, సంస్కృతులు పరిచయమయ్యాయని చెప్పుకొచ్చింది. 

తన ప్రపంచం తన గ్రామమే అయినప్పుడూ..బెంగళూరు తనకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించిందని అన్నారు. రెండో నగరం హైదరాబాద్‌. ఇది తనకు కాలేజ్‌లో హాస్టల్‌ అనుభవం ఎప్పుడూ లేదని, అందుకనే ఉద్యోగం రావడమే అక్కడ రావడంతో వేరే నగరంలో ఎలా జీవించాలో తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. జిమ్‌లో చేరడం నుంచి తన వస్తువులు కొనుక్కోవడం నుంచి ప్రతీదీ తానే స్వయంగా చేయడం నేర్చుకున్నట్లు తెలిపింది. 

మూడోవ నగరం దుబాయ్‌. 31 ఏళ్ల వయసులో స్థిరమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి భర్తతో కలిసి దుబాయ్‌కి వెళ్లిపోయినట్లు వెల్లడించింది. అక్కడ జాబ్‌ పోర్టల్‌లో ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేశానని, కానీ ఎవ్వరూ అంతగా స్పందించలేదని చెప్పుకొచ్చింది. చివరకు కొన్నేళ్ల క్రితం ఒక స్నేహితుడి ద్వారా ఉద్యోగం దొరికిందని చెప్పుకొచ్చింది. ఇలా ఈ మూడు నగరాలకు వెళ్లడం వల్ల నెట్‌వర్కింగ్‌ పవర్‌ గురించి తెలిసిందని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెటింట తెగ వైరల్‌ అవుతోంది.  

 

ఇదీ చదవండి: నీలి రంగు చీరలో చందమామలా నేషనల్‌ క్రష్‌..! ఆ చీర ప్రత్యేకత ఇదే..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement