నేను తప్పని నిరూపించారు: రిటైర్మెంట్‌పై ధోని పోస్ట్‌ వైరల్‌ | Mai har ek pal ka shayar hu: MS Dhoni 1st reaction CSK retirement Post Viral | Sakshi
Sakshi News home page

నేను తప్పని నిరూపించారు: రిటైర్మెంట్‌పై ధోని పోస్ట్‌ వైరల్‌

Nov 17 2026 7:39 PM | Updated on Nov 17 2026 7:50 PM

Mai har ek pal ka shayar hu: MS Dhoni 1st reaction CSK retirement Post Viral

మహేంద్ర సింగ్‌ ధోని (PC: CSK X)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చరిత్రలో ఓ శకం ముగిసింది. దిగ్గజ కెప్టెన్‌, లెజెండరీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఈ టీ20 లీగ్‌కు వీడ్కోలు (MS Dhoni retires from IPL) పలికాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ‘తలా’.. ఐపీఎల్‌-2027 సీజన్‌ నుంచి జట్టు మార్గదర్శిగా కొత్త బాధ్యతల్లో తలమునకలు కానున్నాడు.

నేను తప్పని నిరూపించారు
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘అభిమానులు నేను తప్పని నిరూపించారు. ఈ విషయాన్ని అంగీకరించేందుకు ఇంతకంటే గొప్ప పాట నాకు దొరకదు.

ఈ పాటకు రెండు వర్షన్లు ఉన్నాయి. దీనిని బట్టి నేను తప్పు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత దాన్ని అంగీకరించాలి కూడా!’’ అంటూ ‘మై హర్‌ ఏక్‌ పల్‌ కా షాయర్‌ హూ’ అంటూ సాగే ఐకానిక్‌ పాటతో కూడిన వీడియోను 45 ఏళ్ల ధోని షేర్‌ చేశాడు.

PC: CSK X

ఏదీ శాశ్వతం కాదు!
కాగా బాలీవుడ్‌లో 1976లో యశ్‌ చోప్రా దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్‌, శశి కపూర్‌, వహీదా రహ్మాన్‌ తదితరులు నటించిన ‘కభి కభీ’ సినిమాలో.. ముకేశ్‌ ఆలపించిన ఈ పాటకు రెండు వర్షన్లు ఉన్నాయి.

ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సమయంలో సహచర ఆటగాళ్లతో కలిసి ఉన్న ఫొటోలతో కూడిన మాంటేజ్‌ వీడియోకు.. ‘మై హర్‌ దో పల్‌ కా షాయర్‌ హూ’ పాటను జతచేశాడు. ‘నాకంటే ముందు ఎంతమంది కవులు వచ్చినా.. నా తర్వాత ఎవరు వెళ్లిపోయినా.. క్షణం లేదంటే రెండు క్షణాల పాటే నేను కవిగా ఉంటాను.. నా కథ, నా ఉనికి, నా యవ్వనం ఉంటుంది.. కొంతమంది చిన్న సైగ చేసి వదిలి వెళ్లిపోతారు..

మరికొందరు పాటలు పాడుతూ వెళ్లిపోతారు.. ఇంకొందరు కథలు చెప్తూ వెళ్తారు.. రేపు మీ నుంచి నేను వేరైనా.. ఈరోజు మాత్రం మీలో భాగమే..’ అంటూ ఈ పాట సాగుతుంది. దీని అర్థం క్లుప్తంగా.. ఒక కళాకారుడి కథ, ఉనికి, యవ్వనం, నిబద్ధత ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.. వీటి జీవితకాలం తక్కువే అయినా.. అవి విలువైనవి. అయితే, శాశ్వతం కాదని అంగీకరించాలి.

పునాది ఎన్నటికీ నిలిచే ఉంటుంది
తాజాగా ఐపీఎల్‌ జ్ఞాపకాలను.. ముఖ్యంగా చెన్నై జట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే ఫొటోలతో కూడిన వీడియోను ‘మై హర్‌ ఏక్‌ పల్‌ కా షాయర్‌ హూ’ పాటను ధోని జోడించాడు. ‘‘ప్రతీ క్షణం నేను కవినే. నా కథ, నా ఉనికి, నా యవ్వనంలో ప్రతీ క్షణం భాగమే. అయితే, ఇది కాలాతీతమైనది. బంధాల రూపం మారవచ్చు కానీ.. వాటి పునాది ఎన్నటికీ నిలిచి ఉంటుంది.

కలలు, ఆశలకు గడువు తేదీ అనేది ఉండదు. నా యవ్వనం తిరిగి వికసించవచ్చు. మళ్లీ మనం కలిసి జీవిత మకరందాన్ని ఆస్వాదించవచ్చు. మనం ఒకరి శ్వాసలో మరొకరం.. ఒకరి గుండెచప్పుడులో మరొకరం జీవించవచ్చు’’ అంటూ ఈ పాట సాగిపోతుంది.

ఇదీ చదవండి: కెప్టెన్‌గా హెన్రిచ్‌ క్లాసెన్‌.. ప్రకటన విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement