కివీస్‌తో తొలి టెస్టు.. భారత తుదిజట్టు ఇదే! | IND vs NZ 1st Test 2026: R Ashwin picks India playing 11 | Sakshi
Sakshi News home page

IND vs NZ: కివీస్‌తో తొలి టెస్టు.. భారత తుదిజట్టు ఇదే!

Nov 17 2026 6:44 PM | Updated on Nov 17 2026 7:09 PM

IND vs NZ 1st Test 2026: R Ashwin picks India playing 11

హెడ్‌కోచ్‌ గంభీర్‌తో పాటు కెప్టెన్‌ గిల్‌ (PC: BCCI X)

న్యూజిలాండ్‌- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య వెల్లింగ్‌టన్‌ వేదికగా నవంబరు 19న తొలి టెస్టు మొదలుకానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2027 ఫైనల్‌ రేసులో ఉండాలంటే భారత్‌ ఈ సిరీస్‌లో కచ్చితంగా నెగ్గాల్సిందే.

నలుగురు పేసర్లతో బరిలోకి
ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తొలి టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. తుదిజట్టుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు.

అయితే, వెల్లింగ్‌టన్‌ టెస్టులో కచ్చితంగా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతామని గిల్‌ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెల్లింగ్‌టన్‌ వికెట్‌ సీమర్లకు సహకరిస్తుందని.. కాబట్టి భారత బౌలర్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేశాడు. గెలిచేందుకు ఇదే మంచి అవకాశం అని పేర్కొన్నాడు.

పంత్‌తో పాటు జురెల్‌కు చోటు
ఈ సందర్భంగా అశ్విన్‌ తొలి టెస్టుకు తన తుదిజట్టును ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌లను ఎంచుకున్న అశూ.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఇద్దరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్లు రిషభ్‌ పంత్‌, ధ్రువ్‌ జురెల్‌కు చోటిచ్చాడు.

ఇక స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను తుదిజట్టుకు ఎంపిక చేసిన అశూ.. పేస్‌ విభాగంలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌, ప్రసిద్‌ కృష్ణలకు స్థానం కల్పించాడు.

అదే సమయంలో.. నలుగురు నిఖార్సైన పేసర్లతో పాటు ఓ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను కూడా టీమిండియా యాజమాన్యం ఎంపిక చేయవచ్చని అశూ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి తొలి టెస్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు అశ్విన్‌ ఎంచుకున్న భారత తుదిజట్టు
కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, దేవదత్‌ పడిక్కల్‌, శుబ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌, ధ్రువ్‌ జురెల్‌, రవీంద్ర జడేజా, ఆకాశ్‌ దీప్‌, ప్రసిద్‌ కృష్ణ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌. 

ఇవీ చదవండి: IND vs NZ Tests: షెడ్యూల్‌, జట్లు, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు
కెప్టెన్‌గా హెన్రిచ్‌ క్లాసెన్‌.. ప్రకటన విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement