IND vs NZ: షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు | IND vs NZ Tests Schedule Squads Match Timings Live Telecast Details | Sakshi
Sakshi News home page

IND vs NZ Tests: షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

Nov 16 2026 4:39 PM | Updated on Nov 16 2026 5:03 PM

IND vs NZ Tests Schedule Squads Match Timings Live Telecast Details

న్యూజిలాండ్‌ గడ్డ మీద 3-2తో టీ20, 3-1తో వన్డే సిరీస్‌లు గెలిచిన టీమిండియా.. ప్రస్తుతం టెస్టు సిరీస్‌ మీద దృష్టి పెట్టింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా కివీస్‌- భారత్‌ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌-2027 రేసులో నిలవాలంటే టీమిండియా కివీస్‌పై తప్పక గెలవాల్సిందే. ఇప్పటికే పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో ఉండగా.. భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌ గడ్డ మీద టీమిండియా చివరగా 2009లో ధోని సారథ్యంలో టెస్టు మ్యాచ్‌ గెలిచింది. ఆఖరిగా 2020లో కోహ్లి కెప్టెన్సీలో రెండు మ్యాచ్‌లు ఆడి ఓటమిని మూటగట్టుకుంది.

ఇక గతేడాది స్వదేశంలోనూ టీమిండియాకు కివీస్‌ చేతిలో ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్‌ చేతిలో సొంతగడ్డపై భారత జట్టు ఏకంగా 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఇప్పుడు అందుకు బదులు తీర్చుకునే అవకాశం వచ్చింది. మరి ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌, జట్లు, వేదికలు, లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడ? తదితర వివరాలు తెలుసుకుందామా!

న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిండియా టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌
తొలి టెస్టు: వెల్లింగ్‌టన్‌, బేసిన్‌ రిజర్వ్‌- నవంబరు 19 (గురువారం)న ఆరంభం
రెండో టెస్టు: క్రైస్ట్‌చర్చ్‌, హాగ్లే ఓవల్‌- నవంబరు 27 (శుక్రవారం)న ఆరంభం
మ్యాచ్‌ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం.. ఉదయం మూడున్నర గంటలకు మ్యాచ్‌ మొదలు.

లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
టీవీ: సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌, సోనీ టెన్‌ వన్‌, సోనీ టెన్‌ 3 టీవీ చానెల్స్‌
డిజిటల్‌: సోనీ లివ్‌ యాప్‌

జట్లు
భారత్‌
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), ధృవ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌, గుర్నూర్‌ బ్రార్‌.

న్యూజిలాండ్‌
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జెమీసన్‌, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement