మౌంట్ మంగనూయి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో 22 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అసాధరణ ప్రదర్శన కనబరిచారు.
210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియన్ బౌలర్ల ధాటికి.. కివీస్ 48.1 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు టీ20 సిరీస్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. ఒకే న్యూజిలాండ్ పర్యటనలో భారత్ టీ20, వన్డే సిరీస్‌లను గెలుచుకోవడం ఇదే తొలిసారి.
ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందించాడు. భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో తాము ఓడిపోయామని శాంట్నర్ చెప్పుకొచ్చాడు.
"ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మొత్తం నలుగురు పేసర్లు చక్కగా రాణించారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ వారిని రొటేట్ చేసిన విధానం బాగుంది. పేసర్లు బాగా వేస్తుండటంతో అక్షర్ పటేల్‌ను వెనక్కి ఆపాడు. మిడిల్ ఓవర్లలో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మాపై ఒత్తిడి పెంచారు. సరైన సమయంలో అర్ష్‌దీప్, సిరాజ్‌లను తిరిగి బౌలింగ్‌కు తీసుకురావడం వారికి కలిసొచ్చింది.
తొలుత భారత్‌ను 209 పరుగులకే కట్టడి చేయడంతో మేము ఈజీగా చేధిస్తామని భావించాం. కానీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ మరింత స్లోగా మారింది. పిచ్ కండీషన్స్‌ను భారత బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. ఫీల్డింగ్ సెటాప్ కూడా చాలా బాగుంది. మిడిల్ ఓవర్లలో ఒక్క భాగస్వామ్యం వచ్చి ఉంటే మేమే మేమే గెలిచేవాళ్లం అని శాంట్నర్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.
అదేవిధంగా కివీస్ కెప్టెన్ తన గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. చేతికి బలంగా బంతి తాకడంతో ఇంకా నొప్పిగానే ఉంది. సోమవారం సోమవారం ఉదయం ఎక్స్-రే తీయించుకున్నాక పరిస్థితి తెలుస్తుందని శాంట్నర్ అన్నాడు.


