చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇదే తొలిసారి | India Clinches Both ODI and T20I Series on Kiwi Soil for the First Time | Sakshi
Sakshi News home page

IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇదే తొలిసారి

Nov 15 2026 7:27 PM | Updated on Nov 15 2026 7:42 PM

India Clinches Both ODI and T20I Series on Kiwi Soil for the First Time

మౌంట్ మౌంగనుయి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఐదో వ‌న్డేలో 22 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాట‌ర్లు నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికి.. బౌల‌ర్లు మాత్రం అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. 210 ప‌రుగుల ల‌క్ష్యాన్ని డిఫెండ్ చేసి జ‌ట్టుకు చారిత్రత్మ‌క విజ‌యాన్ని అందించారు.

ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను 3-1 తేడాతో భార‌త్ సొంతం చేసుకుంది.  న్యూజిలాండ్‌పై ఒకే పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు రెండింటినీ భారత్ గెలుచుకోవడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఇప్పటివరకు కివీస్ గడ్డపై ఎన్నో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడినప్పటికీ, ఒకే టూర్‌లో రెండు ఫార్మాట్లలోనూ విజేతగా నిలవడం టీమిండియాకు సాధ్యం కాలేదు.

కానీ ఈసారి భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఈ కలను సాకారం చేసుకుంది. తొలుత టీ20 సిరీస్‌ను,  ఆ తర్వాత వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని 'మెన్ ఇన్ బ్లూ' సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఈ ఆఖ‌రి మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన టీమిండియా 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో అక్షర్‌ పటేల్‌(46), ఇషాన్‌ కిషన్‌(46) టాప్‌ స్కోరర్‌లగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో స్టార్‌ ప్లేయర్లు రోహిత్‌ శర్మ(7), విరాట్‌ కోహ్లి(5) విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జాకబ్‌ డఫీ, మిచెల్‌ శాంట్నర్‌ తలా మూడు వికెట్లు చొప్పున పడగొట్టారు.

అనంత‌రం ఈ స్వ‌ల్ప ల‌క్ష్య చేధ‌న‌లో భార‌త బౌల‌ర్ల ధాటికి కివీస్ 46 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శాంట్నర్‌(24), నిక్‌ కెల్లీ(24) కాస్త ఫర్వాలేదనిపించారు.  భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement