చరిత్ర సృష్టించిన కగిసో రబాడ | Mahfijul Islam suffers Test debut nightmare as Kagiso Rabada scripts rare bowling record | Sakshi
Sakshi News home page

BAN vs SA: చరిత్ర సృష్టించిన కగిసో రబాడ

Nov 15 2026 5:33 PM | Updated on Nov 15 2026 5:48 PM

Mahfijul Islam suffers Test debut nightmare as Kagiso Rabada scripts rare bowling record

వాండరర్స్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా స్పీడ్ స్టార్ నిప్పులు చెరుగుతున్నాడు.  రబాడ ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మొదటి బంతికే బంగ్లా అరంగేట్ర ఆటగాడు మహ్ఫిజుల్ ఇస్లాంను అద్భుతమైన బంతితో రబాడ బోల్తా కొట్టించాడు.

ఆ తర్వాత వరుస ఓవర్లలో మరో నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును కగిసో దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 11 ఓవర్లు బౌలింగ్ చేసిన రబాడ కేవలం 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో రబాడ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

టెస్ట్ మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ పడగొట్టిన నాలుగో దక్షిణాఫ్రికా బౌలర్‌గా రబాడ నిలిచాడు. . గతంలో సఫారీ దిగ్గజాలు బెర్ట్ వోగ్లర్, అలన్ డొనాల్డ్, డేల్ స్టెయిన్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. 1907 ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌ బ్యాటర్ టామ్ హేవార్డ్‌ను ఔట్ చేయడం ద్వారా బెర్ట్ వోగ్లర్ ఈ ఘనత సాధించిన తొలి సఫారీ బౌలర్‌గా నిలవగా.. 2001లో అలన్ డొనాల్డ్, ఆ తర్వాత డేల్ స్టెయిన్ ఈ జాబితాలో చేరారు. ఇప్పుడు రబాడ కూడా వారి సరసన చేరాడు.

అదేవిధంగా రబాడకు ఇది 18వ టెస్టు ఫైవ్ వికెట్ హాల్ కావడం గమనార్హం. కగిసో రబాడ ముష్ఫికర్ రహీమ్ వికెట్ తీయడం ద్వారా టెస్ట్ క్రికెట్‌లో తన 355వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. దీంతో టెస్టుల్లో అత్య‌ధిక వికెట్ల తీసిన బౌల‌ర్ల జాబితాలో శ్రీలంక లెజెండ్ చమిందా వాస్, ఆస్ట్రేలియా దిగ్గజం డెన్నిస్ లిల్లీల స‌ర‌స‌న నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement