PC: ProteasMenCSA X
సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం.. టెస్టు ఫార్మాట్లో ప్రపంచంలోనే అత్యంత దూకుడైన ఫాస్ట్‌బౌలర్ అతడే అనడంలో అతిశయోక్తి లేదు. రబాడ ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.
1-1తో సమంగా
కాగా సౌతాఫ్రికా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా ప్రొటిస్, కంగారూలు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.
ఈ క్రమంలో కేప్‌టౌన్ వేదికగా గురువారం సౌతాఫ్రికా- ఆసీస్ మధ్య మూడో టెస్టు మొదలైంది. న్యూలాండ్స్ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది.
287 పరుగుల లక్ష్యం
ఇక ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులు చేసింది. ఫలితంగా వంద పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసిన ప్రొటిస్ జట్టు.. ఆసీస్‌కు 287 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, లక్ష్య ఛేదనలో కంగారూలకు కగిసో రబాడ చుక్కలు చూపించాడు.
A FIERY START TO THE DAY FROM RABADA 🔥🔥 #SAvAUS https://t.co/wwmX6ma3j3
— FanCode (@FanCode) October 31, 2026
రబాడ ప్రపంచ రికార్డు
టాపార్డర్‌లో ట్రవిస్ హెడ్ (14), మ్యాట్ రెన్షా (0), మార్నస్ లబుషేన్ (4)లను వరుస విరామాల్లో పెవిలియన్‌కు పంపాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు రబాడ. తద్వారా అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా కగిసో రబాడ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
WICKET NUMBER 350 FOR RABADA 🥵 Australia in big trouble 😳 #SAvAUS https://t.co/g7FjLgKfwy
— FanCode (@FanCode) October 31, 2026
అతి తక్కువ బంతుల్లో టెస్టుల్లో 350 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్లు
👉కగిసో రబాడ (సౌతాఫ్రికా)- 13808 బంతుల్లో
👉డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా)- 14719 బంతుల్లో
👉వకార్ యూనిస్ (పాకిస్తాన్)- 14905 బంతుల్లో
👉మాల్‌కమ్ మార్షల్ (వెస్టిండీస్)- 16285 బంతుల్లో
👉మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)- 16908 బంతుల్లో.
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా తరఫున 350కి పైగా వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గానూ రబాడ రికార్డులకెక్కాడు. డేల్ స్టెయిన్ 439 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షాన్ పొలాక్ 421, మఖాయా ఎంతిని 390 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇవీ చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టులో కీలక మార్పు


