విండీస్‌తో టెస్టు.. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ అరుదైన రికార్డు | Bangladesh Batter Mominul Haque Achieves-Huge Feat Vs WI 1st Test | Sakshi
Sakshi News home page

విండీస్‌తో టెస్టు.. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ అరుదైన రికార్డు

Oct 28 2026 1:51 PM | Updated on Oct 28 2026 2:18 PM

Bangladesh Batter Mominul Haque Achieves-Huge Feat Vs WI 1st Test

Photo Credit: Twitter

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్ మోమినుల్ హక్ అరుదైన ఫీట్ సాధించాడు. 51 బంతుల్లో 28 పరుగులు చేసిన మోమినుల్ హక్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. 

మోమినుల్ హక్ ఇప్పటివరకు తాజా రన్స్‌తో కలిపి 169 మ్యాచ్‌ల్లో 11,002 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో తుషార్ ఇమ్రాన్ (11, 972 పరుగులు) తొలి స్థానంలో ఉండగా, నయీమ్ ఇస్లామ్ (11,253 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మోమినుల్ హక్ మూడో స్థానంలో ఉండగా, మార్షల్ అయూబ్ (10,577 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఇక అంత‌ర్జాతీయ‌ టెస్టు క్రికెట్‌లో 81 మ్యాచ్‌లాడిన మోమినుల్ హ‌క్ 151 ఇన్నింగ్స్‌ల్లో 5,265 ప‌రుగులు సాధించాడు. ఇందులో 13 సెంచ‌రీలు, 28 అర్థ‌సెంచరీలున్నాయి. 28 వ‌న్డేల్లో 557 ప‌రుగులు, ఆరు టీ20 మ్యాచ్‌ల్లో 60 ప‌రుగులు సాధించాడు.

మ్యాచ్ విష‌యానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 56 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ షాద‌మ‌న్ ఇస్లామ్ (75) అజేయ అర్థ‌సెంచ‌రీ చేయ‌గా, తౌహిద్ హృదోయ్ (32) అత‌డికి స‌హ‌క‌రిస్తున్నాడు. విండీస్ బౌల‌ర్ల‌లో జోమెల్ వ‌రిక‌న్ రెండు వికెట్లు తీయ‌గా, జైడ‌న్ సీల్స్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. ఈ మ్యాచ్‌ ద్వారా వెస్టిండీస్‌ తరఫున జోషువా బిషప్‌ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

 

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement