Photo Credit: Twitter
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. మ్యాచ్‌లో స్టార్క్ ఆరు వికెట్లతో చెలరేగడంతో సౌతాఫ్రికా 329 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు మార్కస్ అకెర్‌మన్ (95), ఐడెన్ మార్కరమ్ (78), వన్‌డౌన్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్‌హమ్ (50), మార్కో జాన్సెన్ (52) అర్థశతకాలు సాధించారు.
రియాల్ రికిల్‌టన్ (42) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు పడగొట్టగా, నాథన్ లియోన్ రెండు, హాజిల్‌వుడ్, కన్నోలి చెరో వికెట్ తీశారు. తొలి రోజు ఆట ముగిసేసరికి రెండు జట్లు సమానంగా నిలిచాయి. ఒక దశలో 158-0తో పటిష్టంగా కనిపించిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆ తర్వాత తడబడింది. మొత్తంగా తొలి రెండు సెషన్లు సౌతాఫ్రికా దూకుడు ప్రదర్శించగా, చివరి సెషన్‌లో ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో సఫారీలు ఆలౌట్ అయ్యారు.
స్టార్క్ అరుదైన రికార్డు
మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసిన స్టార్క్‌కు 110 టెస్టుల్లో ఇది 20వ ఐదు వికెట్ల హాల్. ఈ నేపథ్యంలో స్టార్క్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 20వ సారి ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన రెండో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ (25 సార్లు) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఓవరాల్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల (ఫాస్ట్, స్పిన్) విభాగంలో స్టార్క్.. న్యూజిలాండ్ దిగ్గజ స్పిన్నర్ డానియల్ వెటోరితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. లంక స్టార్ స్పిన్నర్ రంగన హెరాత్ (34 సార్లు) జాబితాలో తొలి స్థానంలో ఉండగా, పాక్ లెజెండ్ వసీం అక్రమ్ (25 సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో ఉన్న బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్, తైజుల్ ఇస్లామ్ చెరో 19 సార్లు ఈ ఫీట్ నమోదు చేశారు.
వార్న్ రికార్డు బద్దలు
మ్యాచ్‌లో 72 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసిన స్టార్క్ పనిలో పనిగా ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ రికార్డును కూడా బద్దలుకొట్టాడు. కేప్‌టౌన్ వేదికలో ఇప్పటివరకు షేన్ వార్న్ బౌలింగ్ (6-161) ప్రదర్శన అత్యుత్తమంగా ఉండేది. తాజాగా స్టార్క్.. వార్న్ రికార్డును బద్దలుకొట్టి చరిత్ర సృష్టించాడు. ఇక స్టార్క్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. తన చివరి 11 టెస్టుల్లో 62 వికెట్లు పడగొట్టాడు.
3 minutes of extraordinary pace bowling by Mitchell Starc. Take a bow 🙇♂️ https://t.co/Sopph7SPa8
— Troll cricket unlimitedd (@TUnlimitedd) October 27, 2026
ఇదీ చదవండి:


