ప్రపంచ సీనియర్ మహిళల రెజ్లింగ్ చాంపియన్‌షిప్
అస్తానా: కొత్త చరిత్ర లిఖించేందుకు భారత మహిళా రెజ్లర్లు కాజల్ ధోచక్ (76 కేజీలు), నీలమ్ సిరోహి (50 కేజీలు) ఒక్క విజయం దూరంలో నిలిచారు. ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్íÙప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో కాజల్, నీలమ్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన సెమీఫైనల్స్‌లో 18 ఏళ్ల కాజల్ 10–7తో ఐపెరి మెదెత్ (కిర్గిస్తాన్)పై, నీలమ్ 7–3తో జెనిప్ బయనోవా (కజకిస్తాన్)పై గెలిచారు. నేడు జరిగే ఫైనల్స్‌లో నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ యు ససాకి (జపాన్)తో నీలమ్; అనస్తాసియా అల్పియెవా (ఉక్రెయిన్)తో కాజల్ తలపడతారు.
ఇప్పటి వరకు ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత మహిళా రెజ్లర్ స్వర్ణ పతకం సాధించలేదు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ నుంచి ఇప్పటి వరకు అన్షు మలిక్ (2021లో రజతం; 57 కేజీలు) మాత్రమే ఫైనల్‌కు చేరి రజతం దక్కించుకుంది. బబిత కుమారి (2012లో), వినేశ్ ఫొగాట్ (2019, 2022లో), అంతిమ్ పంఘాల్ (2025లో), గీతా ఫొగాట్ (2012లో), పూజా ధండ (2018లో), అల్కా తోమర్ (2006లో), సరితా మోర్ (2021లో), మాన్సి అహ్లావత్ (2024లో) కాంస్య పతకాలు సాధించారు.


