ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా | India dominate kabaddi as mens and womens teams enter finals | Sakshi
Sakshi News home page

Asian Games: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

Sep 25 2026 1:01 PM | Updated on Sep 25 2026 1:21 PM

India dominate kabaddi as mens and womens teams enter finals

ఏషియ‌న్ గేమ్స్-2026లో భార‌త పురుష‌, మ‌హిళ‌ల క‌బ‌డ్డీ జ‌ట్లు అద‌ర‌గొడుతున్నాయి. మ‌హిళ‌ల జ‌ట్టు ఇప్ప‌టికే ఫైన‌ల్‌కు దూసుకెళ్ల‌గా.. తాజాగా మెన్స్ టీమ్ కూడా తుది పోరుకు అర్హ‌త సాధించింది. శుక్ర‌వారం ఐచి వేదిక‌గా జ‌రిగిన సెమీఫైన‌ల్లో థాయ్‌లాండ్‌పై 66-28 స్కోర్‌తో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించి ఫైనల్‌కు చేరింది.

దీంతో ఈ ప్రతిష్టాత్మక ​‍క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. శనివారం జరగనున్న ఫైనల్ పోరులో భారత పురుషుల కబడ్డీ జట్టు తైవాన్ లేదా ఇరాన్‌తో తలపడే అవకాశముంది. 

అంతకుముందు భారత మహిళల క‌బ‌డ్డీ  జట్టు కూడా సత్తాచాటింది. సెమీఫైనల్లో నేపాల్‌ను 48-24 తేడాతో భారత్ చిత్తు చేసింది. కాగా టోర్నమెంట్‌లో మెన్స్‌, ఉమెన్స్ కబడ్డీ జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.
చదవండి: సనత్ జయసూర్య రికార్డ్‌ బ్రేక్‌.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన శ‍్రీలంక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement