వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా పురుషుల క్రికెటర్ల రిటెయినర్ ఫీజుల్లో 25 శాతం కోత విధిస్తున్నట్లు క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది. ఈ ఫీజుల కోత 2026 అక్టోబర్ నుండి అమల్లోకి వచ్చి 2027 సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది.
అలాగే దేశవాళీ ఆటగాళ్ల కాంట్రాక్టుల విధానంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న 12 నెలల కాంట్రాక్టు బదులుగా.. కొత్తగా ఏడు నెలల కాంట్రాక్టును తీసుకు రానున్నారు. కొత్త కాంట్రాక్టు పరిధి ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉండనుంది.
ప్రస్తుతం విండీస్ క్రికెట్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి గాను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 28 మిలియన్ అమెరికన్ డాలర్ల నికర నష్టాన్ని విండీస్ క్రికెట్ బోర్డు చవిచూసింది. అంతేకాకుండా 2025- 2026 ఆర్థిక సంవత్సరంలో సైతం మరో 26 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది.
దీంతో ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి జూలై నెలలో విండీస్ క్రికెట్ బోర్డు 12.82 మిలియన్ అమెరికన్ డాలర్ల(భారత కరెన్సీలో దాదాపు రూ.23.68 రుణాన్ని సహాయంగా పొందింది. ఈ కారణాలతో ఆటగాళ్లను ఫీజులను కూడా సీడబ్ల్యూఐ తగ్గించింది.
కాగా విండీస్ జట్టు ప్రస్తుతం మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం భారత పర్యటనలో ఉంది. తొలుత మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి తిరువనంతపురం వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: తుదిజట్టు నుంచి వాళ్లిద్దరిలో ఒకరిని తప్పిస్తే వైభవ్‌కు లైన్ క్లియర్!


