అదరగొట్టిన షూటర్లు.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం | Double Delight In Shooting, India Clinch Gold And Silver To Take Medal Tally To 19 | Sakshi
Sakshi News home page

Asian Games: అదరగొట్టిన షూటర్లు.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

Sep 25 2026 9:12 AM | Updated on Sep 25 2026 9:42 AM

Double Delight In Shooting, India Clinch Gold And Silver To Take Medal Tally To 19

జపాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్‌ రెండో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 6 వరోజు భారత షూటర్లు సంచలన ప్రదర్శన కనబరిచారు. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌ ఫైనల్‌లో కమల్‌జీత్ - సురుచి సింగ్ జోడీ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 

ఫైనల్ పోరు ఆరంభం నుంచే  కమల్‌జీత్ - సురుచి జోడీ ప్ర‌త్య‌ర్ధుల‌కు చుక్క‌లు చూపించింది. మొత్తంగా ఈ  భారత ద్వ‌యం 484.6 పాయింట్ల‌తో గోల్డ్‌మెడ‌ల్‌ను సొంతం చేసుకుంది. కమల్‌జీత్ - సురుచి జోడీ భార‌త్‌కు  పసిడి పతకాన్ని అందించడమే కాకుండా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స‌రికొత్త రికార్డును నెల‌కొల్పారు. 

ఈ విభాగం ఫైనల్‌లో అత్య‌ధిక పాయింట్లు సాధించిన ఏషియ‌న్ జంట‌గా వారు నిలిచారు. ఇంత‌కుముందు ఈ రికార్డు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ కమాలోవ్ - నిగినా సైద్‌కులోవా(481.3 పాయింట్లు) పేరిట ఉండేది. తాజా ప్ర‌ద‌ర్శ‌న‌తో వారిని కమల్‌జీత్ - సురుచి అధిగ‌మించారు.

మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌, నీరజ్‌ కుమార్‌, రుద్రాంక్ష్‌ పాటిల్‌ త్రయం రజత పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో భారత్‌ పతకాల సంఖ్య 19కు చేరింది.
చదవండి: Asian Games: 'అంతా మోసం.. నా నుంచి గోల్డ్ మెడల్ లాగేసుకున్నారు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement