సాక్షి, హైదరాబాద్: వినూ మన్కడ్ ట్రోఫీ బీసీసీఐ అండర్–19 జాతీయ వన్డే క్రికెట్ టోర్నీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. తెలంగాణ టి20 లీగ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 15 వికెట్లతో మెరిసిన 16 ఏళ్ల అమిస్తాపురం వేద్ రెడ్డి హైదరాబాద్ జట్టులోకి ఎంపికయ్యాడు.
ఆ్రస్టేలియా అండర్–19తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యశ్వీర్ గౌడ్‌ను హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహించే వినూ మన్కడ్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ జట్టు ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో ఉంది. హైదరాబాద్ జట్టు తమ మ్యాచ్‌లను రాజ్‌కోట్ వేదికగా అక్టోబర్ 8 నుంచి 16 వరకు ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్‌తోపాటు బరోడా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, మణిపూర్ జట్లున్నాయి.
ఇదీ చదవండి: కరాటే తేజం


