నవ్యశ్రీ (ఫైల్)
హైదరాబాద్: వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. బాలానగర్ పోలీసులు తెలిపిన మేరకు.. హెచ్‌ఏఎల్ కంపెనీలో పెన్నంశెట్టి రాజు కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. నవ్యశ్రీ (13) 8వ తరగతి చదువుతోంది. గురువారం తల్లి పావనితో కలిసి నవ్యశ్రీ హెచ్‌ఏఎల్ నుంచి మీరా అకాడమీ వైపు వెళుతున్నారు.
సికింద్రాబాద్ వైపు వెళ్లే రహదారిపై కిచెన్ ఎక్విప్‌మెంట్స్ సమీపంలో కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు వెనుక నుంచి స్కూటీని ఢీ కొట్టింది. దాంతో స్కూటీ వెనుక ఉన్న నవ్యశ్రీ రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు ఆమెపై వెళ్లిపోయింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బాలానగర్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ తెలిపారు.
ఇదీ చదవండి: ‘పోలీసులకు చెప్పాడని’ అనుమానంతో.. స్నేహితుడి దారుణహత్య!


