‘పోలీసులకు చెప్పాడని’ అనుమానంతో.. స్నేహితుడి దారుణహత్య! | Hyderabad Shocker, Friends Allegedly Kill 28 Year Old Man Over Suspicion Of Informing Police About Drug Sales | Sakshi
Sakshi News home page

‘పోలీసులకు చెప్పాడని’ అనుమానంతో.. స్నేహితుడి దారుణహత్య!

Sep 25 2026 8:11 AM | Updated on Sep 25 2026 10:25 AM

Rajendranagar Friend Murder Over Drug Case In Hyderabad Telangana

వసీం (ఫైల్‌)

పోలీసులకు మాదకద్రవ్యాల విక్రయం గుట్టు చెప్పాడని దారుణం

హైదరాబాద్‌: మహానగరంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే కత్తులతో విరుచుకుపడి నిండు ప్రాణాలు తీశారు. మాదకద్రవ్యాలు అమ్ముతున్న సమాచారాన్ని పోలీసులకు అందిస్తున్నాడన్న అనుమానంతో ఓ యువకుడిని స్నేహితులే కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన మేరకు.. ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌ ప్రాంతానికి చెందిన వసీం(28) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. చింతల్‌మెట్‌ ప్రాంతానికి చెందిన సోహెబ్, ఇలియాస్‌లు స్నేహితులు. గతంలో మాదకద్రవ్యాలు అమ్ముతూ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చారు. జైలు నుంచి వచ్చిన అనంతరం ముగ్గురూ కలిసి స్థానికంగా మాదకద్రవ్యాలు అమ్ముతున్నారు. కొన్ని రోజుల నుంచి స్నేహితులకు వసీం దూరంగా ఉంటున్నాడు.

మాదకద్రవ్యాలు అమ్ముతున్న ఇరువురిని గతంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తమ సమాచారాన్ని వసీం పోలీసులకు అందించాడని ఇద్దరూ భావించి గొడవపడ్డారు. ఇదే విషయమై మనస్పర్థలు వచ్చాయి. గురువారం వసీం ఇంటికి వచ్చిన ఇలియాస్, సోహెబ్‌లు బయటకు పిలిచి ఇదే విషయమై చర్చించారు. మాట మాట పెరిగి వసీంపై కత్తులతో దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలైన వాసీం అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మరొకరితో వెళ్లిపోయేందుకు సిద్ధపడిందని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement