లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు కుటుంబాలలో ఘోర విషాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో తల్లీ, కొడుకు, మరో మహిళ దుర్మరణం చెందారు. వేపనపల్లి వద్ద పరిధిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకొంది. వివరాల మేరకు మహారాష్ట్రకు చెందిన గౌస్ షేక్, భార్య ముస్కాన్ (28) క్రిష్ణగిరిలో నివాసముంటున్నారు. ముస్కాన్ వేపనపల్లి సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తుంది.
ఎలా జరిగిందంటే..
బుధవారం ఉదయం కుమారుడు పుర్కాన్ (9)తో కలిసి పాఠశాలకెళ్లారు. సాయంత్రం విధులు ముగించుకొని తల్లీ కొడుకుతో పాటు అదే పాఠశాలలో పనిచేస్తున్న క్రిష్ణగిరికి చెందిన ఉపాధ్యాయురాలు సుధారాణి(40)తో కలిసి స్కూటర్‌లో క్రిష్ణగిరి వైపు వెళ్తున్నారు. ఇంతలో వెనుక నుంచి వేగంగా ఓ లారీ వారిని ఢీకొని దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలేర్పడిన ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ముక్కలైన మృతదేహాలతో రోడ్డంతా భీతావహంగా కనిపించింది. విషయం తెలిసి రెండు కుటుంబాల బంధువులు, ఉపాధ్యాయలు తరలివచ్చారు. విగతజీవులుగా పడిఉన్నవారిని చూసి బోరున విలపించారు.
-కర్ణాటక


