శ్రీకాకుళం జిల్లా : తీవ్ర వాయుగుండం తీరం దాటింది. జిల్లాకు నష్టాలు మిగిల్చింది.
బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు భారీ గాలులతో బీభత్సం సృష్టించింది.
ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో జిల్లా ప్రజానీకం అతలాకుతలమైంది.
భారీ వర్షాలకు ఊళ్లకు ఊళ్లు ముంపునకు గురయ్యాయి. ప్రధాన పట్టణాలు జలదిగ్బంధానికి గురయ్యాయి.
పంట పొలాలతో పాటు శివారు కాలనీలు కూడా ముంపు బారిన పడ్డాయి.
ఈదురు గాలులు ఇళ్లు నేలమట్టం చేశాయి. చెట్లను పెకిలించేశాయి.


