ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో డీజేలపై ఆంక్షలు | No Permission for DJ Sounds on Tank Bund: Saifabad ACP Sanjay Kumar | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో డీజేలపై ఆంక్షలు

Sep 25 2026 9:46 AM | Updated on Sep 25 2026 10:34 AM

No Permission for DJ Sounds on Tank Bund: Saifabad ACP Sanjay Kumar

సాక్షి,హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ సాక్షితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.

ట్యాంక్ బండ్ ప్రాంతంలో డీజే సౌండ్స్ వినిపించకూడదని ఏసీపీ స్పష్టం చేశారు. డీజే సౌండ్ సిస్టం వల్ల పోలీసుల కమ్యూనికేషన్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇది ఏ పార్టీ పాటలు అనే దానితో మాకు సంబంధం లేదు, డీజే సౌండ్ అనేది మాకు ప్రధాన సమస్యగా మారుతోంది అని ఆయన వివరించారు.

శోభాయాత్ర ఆలస్యం కావడానికి కారణాలను వివరిస్తూ.. క్రేన్ మొరాయించడం వల్లే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రత్యేకంగా కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చే ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులను ట్యాంక్ బండ్‌పైకి తీసుకురాకపోవడం మంచిదని ఏసీపీ సంజయ్ కుమార్ సూచించారు. భక్తులు పోలీసులకు సహకరించి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement